Sudigali Sudheer : ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలో ఒకటైన గాడ్ ఫాదర్ ,సినిమాను ఈ అక్టోబర్ 5న విజయదశమి సందర్భంగా విడుదల చేయనున్నారు.దీనిలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా ,మంచి పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ తో రాబోతున్నారు.అయితే సినిమా విడుదల డేట్ దగ్గర పడడంతో సినిమా బృందం పెద్ద ఎత్తున ప్రమోషన్ చేయడం మొదలుపెట్టారు.దీనిలో భాగంగా గెటప్ శ్రీను ప్రమోషన్స్ లో పాల్గొంటున్నాడు. మెగాస్టార్ తో కలిసి ప్రైవేట్ జెట్ లో ప్రయాణించడం, చిరంజీవితో కలిసి భోజనం చేయడంతో గెటప్ శ్రీను పేరు సినీ ఇండస్ట్రీలో బాగా వినిపిస్తుంది.
ఇటీవల సుమన్ టీవీ లో జరిగిన ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూలో గెటప్ శ్రీను ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుందంటూ కామెంట్ చేశారు. దీంతోపాటు జబర్దస్త్ లోకి సుధీర్ రీ ఎంట్రీ ఇస్తున్నాడన్న విషయాన్ని కూడా చెప్పుకొచ్చాడు గెటప్ శ్రీను. సినీ ఇండస్ట్రీలో బుల్లితెరపై ఎన్నో రకాల కార్యక్రమాలు వస్తుంటాయి కానీ అందులో కొన్ని మాత్రమే నిలబడతాయి.దీనిలో జబర్దస్త్ షో కూడా ఒకటి.ఈ జబర్దస్త్ వేదికగా ఎంతోమంది స్టార్స్ అయ్యారు.అందులో ముఖ్యంగా ఆటో రాంప్రసాద్, గెటప్ శ్రీను, హైపర్ ఆది సుడిగాలి సుధీర్ లు ఉంటారు.

అయితే వీరిలో కొందరికి వెండితెరపై అవకాశాలు రావడంతో జబర్దస్త్ వీడి వెళ్ళిపోతున్నారు. దానిలో సుధీర్ ఒకడు. సుధీర్ కి వెండితెర పై అవకాశాలు రావడంతో జబర్దస్త్ మానేసి వచ్చేసాడు. అయితే ఇప్పుడు అవి అంత వర్క్ అవుట్ కాకపోవడంతో తిరిగి జబర్దస్త్ కు రాబోతున్నాడు,అన్న వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయాన్ని గెటప్ శ్రీను , గాడ్ ఫాదర్ ఇంటర్వ్యూ లో తెలియపరిచారు. అలాగే తనకోసం మేము ఎదురు చూస్తున్నామని , తన ప్లేస్ ఎప్పుడు తనకోసం అలాగే ఉంటుందని గెటప్ శ్రీను చెప్పుకొచ్చారు.