Ghattamaneni Family : కృష్ణ సతీమణి, మహేష్ తల్లి ఇందిరా దేవి ఈ రోజు తెల్లవారుజామున కన్ను మూసిన విషయం తెలిసిందే. ఆమె మృతితో మహేష్ కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతి చెందారు. అయితే ఘట్టమనేని కుటుంబంలో మూడేళ్లలో మూడు విషాదాలు చోటు చేసుకున్నాయి. కుటుంబ సభ్యులు ఒక్కొక్కరిగా తుదిశ్వాస విడుస్తున్న నేపథ్యంలో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. కృష్ణ రెండవ భార్య విజయనిర్మల 2019 జూన్ 27న హార్ట్ అటాక్ తో కన్నుమూశారు. ఈ ఏడాది ప్రారంభంలో మహేష్ అన్నయ్య రమేష్ బాబు అకాల మృతి చెందారు. కొన్నాళ్లుగా తీవ్ర ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న రమేష్ బాబు చికిత్స పొందుతూ మరణించడం జరిగింది.
రమేష్ బాబు మృతి కృష్ణ, మహేష్ లను కృంగదీసింది. కృష్ణ నటవారసుడిగా రమేష్ బాబు వెండితెరకు పరిచయమయ్యాడు. హీరోగా పలు చిత్రాల్లో నటించారు. తండ్రి కృష్ణ, తమ్ముడు మహేష్ తో కలిసి మల్టీస్టారర్స్ చేశారు. 1997 లో విడుదలైన ఎన్ కౌంటర్ మూవీలో చిన్న పాత్ర చేసిన రమేష్ బాబు… వెండితెరకు దూరమయ్యారు. అయితే విజయ నిర్మల, రమేష్ బాబు, ఇందిరా దేవి మృతి ఒకేలా ఉందని కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎలాగైతే విజయనిర్మల అనారోగ్య కారణంగా బాధపడి మరణించిందో, .. రమేష్ బాబు కూడా అనారోగ్యంతో మరణించారు.

Ghattamaneni Family : అభిమానుల్లో టెన్షన్..
ఇక మహేష్ బాబు అమ్మగారు ఇందిరా కూడా గత కొంతకాలం నుంచి అనారోగ్య కారణంగా బాధపడుతూ ఈ రోజు ఉదయం కన్నుమూసారు. అయితే సూపర్ స్టార్ కృష్ణ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే . దీంతో ఇప్పుడు ఘట్టమనేని అభిమానులకు సూపర్ స్టార్ హెల్త్ విషయంలో బాధపడుతున్నారు. కాగా, జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కుని నిలబడ్డ ఇందిరాదేవికి.. మహేష్ బాబు అంటే ప్రాణం. ఇందిరా దేవికి పిల్లలే లోకం.. పిల్లలు కూడా ఆమెను ప్రాణంగా చూసుకునేవారు.. పెద్ద కూతురు మంజుల తన ప్రొడక్షన్ హౌస్ కు ఇందిరా ప్రొడక్షన్స్ అని పేరు కూడా పెట్టారు. ఇందిరా పుట్టినరోజును వేడుకలా జరిపించేవారు.