Ghattamaneni Indira Devi : ఘట్టమనేని కృష్ణ సతీమణి ఇందిరాదేవి బుధవారం తెల్లవారుజామున కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆమె మృతితో ఘట్టమనేని ఫ్యామిలీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మహేష్ బాబు తో పాటు ఆయన కూతురు సితార కూడా ఇందిరా దేవి మృతిని జీర్ణించుకోలేకపోయారు. మహేష్ బాబు చిన్నప్పటి నుండి తల్లిచాటు బిడ్డలా పెరిగాడు. తన తల్లితో మహేష్ కి ఎనలేని జ్ఞాపకాలు ముడిపడి ఉన్నాయి. కృష్ణ – ఇందిరా దేవిలకు రమేష్ బాబు, మంజుల, మహేష్ ముగ్గురు సంతానం. అయితే.. చిన్న కొడుకుగా మహేష్ బాబును ఎంతో గారాబంగా పెంచింది ఇందిరా దేవి. మహేష్ ఎక్కువ సమయాన్ని తన తల్లి దగ్గరే గడిపాడు.
మహేష్ కి తల్లితో పాటు తన అమ్మమ్మతో కూడా అంతే అనుబంధం ఉంది. ఇందిరా దేవి లాంటి ఆడవాళ్లు చాలా అరుదుగా ఉంటారు. పరిశ్రమలో ఉన్నవాళ్లకు కూడా ఇందిరా గురించి తెలిసింది తక్కువే. ఐదుగురు పిల్లల తల్లైన ఇందిరా దేవి వాళ్ళను పెంచి పెద్ద చేసి ప్రయోజకుల్ని చేశారు. ఆమె తన కోడలిని కూడా కూతురిలా చూసుకునేది. ఇక మహేష్-నమ్రతల పెళ్ళిలో కోడలికి విలువైన నగలు బహుమతిగా ఇచ్చారట. ఆ తర్వాత కూడా నమ్రతకు నచ్చిన అనేక వస్తువులను ఇందిరా దేవి ఆమెకు ఇచ్చారని సమాచారం. తనపై ఇందిరా దేవి చూపిస్తున్న ప్రేమకు అంతే కృతజ్ఞతగా నమ్రత ఉండేవారట. మహేష్ కి ఇష్టమైన వంటలు, ప్రవర్తన వంటి అనేక విషయాలు ఇందిరా దేవి దగ్గర నమ్రత నేర్చుకున్నారని సన్నిహితులు చెబుతున్నారు

Ghattamaneni Indira Devi : కోడలంటే ప్రాణం..
ఇక కుటుంబంలో ప్రతి సోమవారం లంచ్ లేదా డిన్నర్ కి కలవాలనే నియమం ఉందట. ఆ ట్రెడిషన్ క్రమం తప్పకుండా జరిగేలా చూసే బాధ్యత నమ్రతకు ఇందిరా దేవి అప్పగించారట. దానిని నమ్రత చాలా చక్కగా నిర్వర్తించేదని సమాచారం. కూతురి కన్నాఎక్కువగా నమ్రతని ఇందిరా చూసుకునేదని, ఆ క్రమంలోనే ఆమె మరణించినప్పుడు నమ్రత చాలా ఎమోషనల్ అయిందని కూడా కొందరు చెబుతున్నారు. ఇక ఇందిరా దేవి తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. వృద్ధాప్యం కారణంగా ఆమె వైద్యానికి కూడా సహకరించకపోవడంతో సెప్టెంబర్ 28వ తేదీ తెల్లవారుజామున కన్నుమూశారు. ఇందిరా దేవి మరణానికి చిత్ర ప్రముఖులు, రాజకీయవేత్తలు సంతాపం తెలిపారు