God Father Movie : మోహన్ రాజా దర్శకత్వంలో చిరంజీవి ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం గాడ్ ఫాదర్. దసరా కానుకగా అక్టోబర్ 5వ తేదీన విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషనల్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంటును అనంతపురం ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ లో ఇటీవల నిర్వహించారు. వర్షంలో తడుస్తూ సినిమాకి సంబంధించిన ఆసక్తికర విషయలు తెలియజేస్తూ మూవీపై హైప్స్ పెంచారు. ఈ సినిమాకి సంబంధించి రామజోగయ్య మాట్లాడిన మాటలు కూడా వైరల్ అయ్యాయి.
ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రామజోగయ్యశాస్త్రి మాట్లాడుతూ .. ‘గాడ్ ఫాదర్’ అనే టైటిల్ పెట్టాలంటే ఒకటికి వందసార్లు ఆలోచన చేయాలి. ఆ పేరుకు ఒక్క చిరంజీవిగారు మాత్రమే సరిపోతారు అంటూ తెగ హైప్ తెచ్చారు. ఇక ఇటీవల చిత్ర ట్రైలర్ విడుదల కాగా, ఈ ట్రైలర్‌పై నెగెటివీటీ స్ప్రెడ్ చేస్తున్నారు. ముఖ్యంగా ఓ సీన్ లో మోహన్ లాల్ మరియు మెగాస్టార్ తో కలిపి కంపేర్ చేస్తూ కొందరు సిల్లీగా మారుస్తున్నారు. దీనితో సోషల్ మీడియాలో అయితే ప్రస్తుతం ఇదే నడుస్తుండగా మెగా ఫ్యాన్స్ కూడా గట్టి కౌంటర్స్ ఇస్తున్నారు.

God Father Movie : తేడా కొడితే అంతే..
లూసిఫర్ అనే మూవీ కి రీమేక్ గా తెరకెక్కిన ఈ మూవీ లో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఒక కీలక పాత్రలో నటించగా , సత్య దేవ్ ఈ మూవీ లో ప్రతి నాయకుడి పాత్రలో నటించాడు లేడీ సూపర్ స్టార్ నయన తార ఈ మూవీ లో మెగాస్టార్ చిరంజీవి కి చెల్లెలు పాత్రలో నటించింది. భారీ తారాగణంతో రూపొందిన ఈ సినిమాకి 60 కోట్ల నాన్ ట్రియేటికల్ బిజినెస్ జరిగినట్లు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆచార్య లాంటి భారీ ఫ్లాప్ తర్వాత చిరంజీవి నటించిన మూవీ కి ఈ రేంజ్ లో నాన్ ట్రియేటికెల్ బిజినెస్ జరగడం పట్ల అందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఏదైన తేడా కొడితే అంతే మరి..