God Father – Ghost : వచ్చే వారం గాడ్ ఫాదర్, ది ఘోస్ట్ అనే రెండు సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. ఒకే రోజు చిరంజీవి, నాగార్జున బాక్సాఫీసు దగ్గర పోటీ పడుతున్నారు. దానికి కారణం దసరా పండుగ కావడం. వచ్చే వారం అంతా దసరా పండుగ సీజన్ కావడంతో ఫెస్టివల్ సందర్భంగా గాడ్ ఫాదర్, ది ఘోస్ట్ రెండు సినిమాలు ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతున్నాయి. అక్టోబర్ 5 న ఈ రెండు సినిమాలు విడుదల కాబోతున్నాయి. ఈనేపథ్యంలో ఈ సినిమాలో విషయంలో ఇప్పటికే స్క్రీన్లు కూడా అన్నీ ఫ్రీజ్ అయిపోయాయి.
ఏ సినిమాకు ఎన్ని థియేటర్లు కావాలో.. డిస్ట్రిబ్యూటర్లు ముందే బుక్ చేసేసుకున్నారు. ఎందుకంటే ఈ రెండు సినిమాల వెనుక ఉన్నది బడా నిర్మాతలే. కాబట్టి ఈ సినిమాల థియేటర్ల విషయంలో పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. అయితే.. గాడ్ ఫాదర్, ది ఘోస్ట్ ఈ రెండు సినిమాల విషయంలో ఒక పోలిక ఉంది. దానికి గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోవాలి. ఈ సినిమాలు రెండూ ఒకే రోజున విడుదల అవ్వడం ఒక పోలిక అయితే.. మరో పోలిక ఏంటో తెలుసా? ఈ రెండు కథల్లో ఉన్న మెయిన్ పాయింట్ ఏంటో తెలుసా? ఈ రెండు సినిమాలు సిస్టర్ సెంటిమెంట్ తో ఉంటాయట. సిస్టర్ కథలతోనే ఈ రెండు ముడిపడి ఉన్నాయట. గాఢ్ ఫాదర్ సినిమా గురించి చెప్పుకోవాలంటే..

God Father – Ghost : చిరంజీవికి చెల్లిగా నటించిన నయనతార
చిరంజీవికి చెల్లి పాత్రలో నయనతార నటిస్తుంది. తన కుటుంబానికి 20 సంవత్సరాలుగా దూరంగా ఉన్న చిరంజీవి.. నయనతార తండ్రి సీఎంగా ఉండి చనిపోవడంతో తన భర్తను దాటలేక సీఎం పదవిని చేపట్టలేని పరిస్థితుల్లో ఉన్న ఆమెను రక్షించేందుకు చిరంజీవి సరైన సమయంలో రంగంలోకి దిగుతాడు. అప్పుడు ముఖ్యమంత్రి పదవిని, తన సోదరిని ఎలా కాపాడుకుంటాడు అనేదే గాడ్ ఫాదర్ స్టోరీ. మరోవైపు ది ఘోస్ట్ సినిమా గురించి చెప్పాలంటే తనకు దూరమైన అక్క.. శత్రువుల వల్ల ప్రమాదంలో ఉందని తెలుసుకొని తన తండ్రికి ఇచ్చిన మాట కోసం ఆమెను ఎలా కాపాడాడు అనేదే ఈ స్టోరీ. ఇక.. ఈ రెండు సినిమాల్లో కథను చూస్తే ఒకేవిధంగా ఉండటంతో పాటు ఒకేరోజు రెండు సినిమాలు రిలీజ్ కావడంపై తెలుగు సినీ అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.