GodFather Movie : ప్రతి సినిమాలో హీరో హీరోయిన్ల చిన్నప్పటి పాత్రలను పోషించడానికి చైల్డ్ ఆర్టిస్టులు అవసరం అవుతున్నారు. అయితే సినిమాలో హీరో హీరోయిన్ల కి ఎంత క్రేజ్ ఉంటుందో చైల్డ్ ఆర్టిస్టులకు కూడా అంతే గ్రేస్ లభిస్తుంది. ఇలా చాలామంది చైల్డ్ ఆర్టిస్టులుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు పెద్దవారిగా మారి హీరోలుగా సినిమాలలో నటిస్తున్నారు. ఇక మరికొందరు ఇప్పుడిప్పుడే చైల్డ్ ఆర్టిస్టులుగా సినిమాలోకి అడుగుపెడుతున్నారు. అలాగే మరి కొంతమంది సీరియల్స్ లో కూడా చైల్డ్ ఆర్టిస్టులుగా నటిస్తున్నారు.ఇక ఇలా సీరియల్స్ లో నటించే చైల్డ్ ఆర్టిస్టులు కూడా సినిమాల్లోకి అడుగుపెడుతున్నారు. దీనిలో భాగంగా ఇటీవల రిలీజైన బింబిసారలో సీరియల్ చైల్డ్ ఆర్టిస్ట్ చేసిన విషయం తెలిసిందే.
అలాగే తాజాగా విడుదలైన గాడ్ ఫాదర్ సినిమాలో ఒక చైల్డ్ ఆర్టిస్ట్ నటించగా ఆమె కూడా సీరియల్ చైల్డ్ ఆర్టిస్ట్ అని తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఆ చైల్డ్ ఆర్టిస్ట్ గురించి చర్చలు నడుస్తున్నాయి.డైరెక్టర్ మోహన్ రాజా దర్శకత్వంలో ఇటీవల విడుదలైన సినిమా గాడ్ ఫాదర్. దీనిలో చిరంజీవి మరియు నయనతార నటీనటులుగా చేయగా బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కూడా ఒక కీలక పాత్రను పోషించాడు. ఈ సినిమాను సూపర్ గుడ్ ఫిలిమ్స్ కొనిదల ప్రొడక్షన్ బ్యానర్ పై ఆర్.బి చౌదరి , ఎన్.వి ప్రసాద్ నిర్మాతలుగా తెరకెక్కించారు. ఇక ఈ సినిమా మాస్ పొలిటికల్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో వచ్చింది. ఈ సినిమాను మలయాళం లో హిట్ అయిన లూసిఫర్ నుండి రీమేక్ గా తీసుకొచ్చారు.

అయితే ఇందులో నయనతార పాత్ర చాలా ప్రాధాన్యతను పోషించింది. అలాగే నయనతార చిన్నప్పటి పాత్రను కూడా చూపించాడు డైరెక్టర్ మోహన్ రాజా. అయితే ఈ పాత్రలో నటించిన చిన్నారి మరెవరో కాదు స్టార్ మా లో ప్రసారమవుతున్న దేవత సీరియల్ లో చిన్మయి పాత్రను చేస్తున్న చైల్డ్ ఆర్టిస్ట్ . ఇందులో మాధవ్ కూతురుగా చిన్మయి నటిస్తూ అందర్నీ ఆకట్టుకుంటుంది. అలా ఏకంగా మెగాస్టార్ చిరంజీవి సినిమాలో అవకాశం కొట్టేసింది ఈ చిన్నారి. ఇక ఈ సినిమాలో తన నటనతో మరింత ప్రేక్షాదరణ పొందింది రిది గుత్తా. ఇక ఈ సినిమా చూసిన వారంతా ఈ చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరంటూ కామెంట్స్ చేయడంతో తన పేరు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.