GodFather Movie : సినీ ఇండస్ట్రీలో ఒకరి కోసం రాసిన కథను మరొక చేస్తూ ఉంటారు .దీనికి కారణం సమయం లేకపోవడం లేదా కథ నచ్చకపోవడం … రీజన్ ఏదైనా సరే ఒక హీరో కోసం రాసిన కథను వేరే హీరో చేసి హిట్టు కొడితే అది మొదటి హీరోకి కొంచెం బాధను కలిగిస్తుందనే చెప్పాలి. అదే సినిమా ఫ్లాప్ అయితే ఇక ఆ ఆనందం వేరు.అయితే ఇలాంటిదే ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో ఒకటి జరిగింది. ఇటీవల మెగాస్టార్ నటించిన సినిమా గాడ్ ఫాదర్ విడుదలై బ్లాక్ బాస్టర్ ను సాధించింది. మోహన్ రాజ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కించడం జరిగింది. దసరా కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమా చిరంజీవి కెరియర్ లో ది బెస్ట్ గా నిలిచింది.
అయితే ఈ సినిమాలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటించిన విషయం తెలిసిందే. అయితే సల్మాన్ ఖాన్ రోల్ లో ముందుగా హీరో వరుణ్ తేజ్ ( Varun Tej ) ని అనుకున్నారట. మెగాస్టార్ ఈ రోల్ గురించి విన్నప్పుడు ఇది మెగా హీరోతో చేపిద్దామని ఆలోచన వచ్చిందట. అయితే అప్పుడు టక్కున చిరంజీవికి గుర్తొచ్చిన పేరు వరుణ్ తేజ్. కానీ మోహన్ రాజా మాత్రం మెగా హీరో వద్దంటూ నేను ఈ రోల్ కి బాలీవుడ్ హీరోని పెడతానని ఆలోచించి ఫైనల్ గా సల్మాన్ ఖాన్ సెలెక్ట్ ( Salman Khan ) చేశారట. వరుణ్ తేజ్ మెగా ట్యాగ్ ను వాడుకుంటూ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు.

వరుణ్ తేజ్ కు ఎప్పటి నుండో చిరంజీవి ( Chiranjeevi ) తో నటించాలన్న కోరిక ఉందని చాలా ఇంటర్వ్యూలో చెప్పుకుంటూ వచ్చాడు. కానీ ఇలా వచ్చినా అవకాశం చేయి జారిపోవడంతో కాస్త బాధపడ్డారని చెప్పాలి.కానీ ఇటువల విడుదలైన గాడ్ ఫాదర్ సినిమాలో సల్మాన్ ఖాన్ రోల్ కి అంత పాపులారిటీ ,లేకపోవడంతో బిస్కెట్ రోల్ ఇచ్చారు అని టోల్ చేస్తున్నారు జనాలు. ఈ విషయం తెలిసిన తర్వాత మెగా హీరో వరుణ్ తేజ్ ట్రోల్స్ తప్పించుకున్నానని సంబరపడుతున్నాడు. ప్రమోషన్స్ టైం లో కూడా సల్మాన్ ఖాన్ కొంచెం ఓవర్ చేశాడని అంత తలపొగరు పనికిరాదని అంటున్నారు జనాలు.