Prabhas : ప్రభాస్ ఫ్యాన్స్ ఆవేశపడకుండా ఈ న్యూస్ చదవండి .. ఇది మీకోసమే !

Advertisement

Prabhas : బాహుబ‌లితో భారీ హిట్ కొట్టిన ప్ర‌భాస్ మ‌ళ్లీ ఆ రేంజ్ విజ‌యాన్ని అందుకోలేదు. సాహో, రాధే శ్యామ్ చిత్రాలు బాక్సాఫీస్ వ‌ద్ద భారీ ఫ్లాపులుగా నిలిచాయి. ఇప్పుడు ఆదిపురుష్ చిత్రంపై భారీ అంచ‌నాలు పెట్టుకున్నారు. అయితే ఈ చిత్రానికి సంబంధించిన టీజ‌ర్ విడుదల కాగా, ఇది అంత‌గా ఆక‌ట్టుకోలేక‌పోయింది. ప్రశాంత్ నీల్ తో చేస్తున్న ‘సలార్’ నాగ్ అశిన్ డైరెక్ట్ చేస్తున్న ‘ప్రాజెక్ట్ కె’ సినిమాల్లో నటిస్తున్నాడు. ఈ రెండు పాన్ ఇండియా ప్రాజెక్ట్ లు ప్రస్తుతం చిత్రీకరణ దశలో వున్నాయి. అయితే ఈ మూవీస్ అండర్ ప్రొడక్షన్ లో వుండగానే ప్రభాస్ మరో ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. డైరెక్ట‌ర్ మారుతీ సినిమా అంటే మినిమ‌మ్ గ్యారెంటీ ఉంటుంది కానీ, ఆయ‌న ఇప్ప‌టి వ‌ర‌కు పెద్ద స్టార్ల‌ను హ్యాండిల్ చేయ‌లేదు. గ‌తంలో వెంక‌టేష్‌తో తీసిన బాబు బంగారం ప్లాప్ అయ్యింది.

Advertisement

ఇటీవ‌ల గోపీచంద్‌తో తీసిన ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్‌లో కూడా మారుతీ మ్యాజిక్ ప‌నిచేయ‌లేదు. దీంతో గోపీచంద్ ఖాతాలో మ‌రో ప్లాప్ ప‌డింది. ఇలాంటి టైమ్‌లో ప్ర‌భాస్ ఇప్పుడు మారుతీకి ఛాన్స్ ఇవ్వ‌డంతో ఆయ‌న ఫ్యాన్స్ ఆందోళ‌ణ చెందుతున్నారు.త్వ‌ర‌లో ప్ర‌భాస్- మారుతి సినిమా ప‌ట్టాలెక్క‌నుంద‌ని వార్త‌లు వ‌స్తుండ‌డంతో ప్ర‌భాస్ అభిమానుల గుండెల్లోరైళ్ల్లు ప‌రుగెత్తుతున్నాయి.పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై ఈ భారీ పాన్ ఇండియా మూవీని టి. జి. విశ్వప్రసాద్ అత్యంత భారీ స్థాయిలో నిర్మించబోతున్నారు. గత కొన్ని నెలలుగా వార్తల్లో నిలుస్తున్న ఈ ప్రాజెక్ట్ ఎట్టకేలకు పట్టాలెక్కబోతోంది. ఇంత వరకు ప్రభాస్ డ్యుయెల్ రోల్ లో కనిపించని విషయం తెలిసిందే.

Advertisement
good news for prabhas fans
good news for prabhas fans

Prabhas : ఫ్యాన్స్ కి ట్రీట్..

అయితే మారుతి తన సినిమాలో ప్రభాస్ కోసం టూ డిఫరెంట్ క్యారెక్టర్స్ ని డిజైన్ చేశాడట. ప్రభాస్ తొలిసారి తాతగా మనవడిగా రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించనున్నాడని తెలుస్తోంది. ఇదే నిజమైతే ప్రభాస్ అభిమానులకు ఊహించని ట్రీట్ గా ఈ మూవీ వుండే అవకాశం వుందని చెబుతున్నారు. ఇందులో ప్రభాస్ కు జోడీగా ముగ్గురు క్రేజీ హీరోయిన్ లు నటించబోతున్నారు. ఇప్పటికే ఇద్దరిని మారుతి ఫైనల్ చేశాడు కూడా. అందులో మాలవికా మోహనన్ ఒకరు కాగా మరొకరు నిధి అగర్వాల్ ఒకరు అని అంటున్నారు.

Advertisement