Guppedantha Manasu 03 Oct Today Episode : దేవయానికి, మహేంద్ర చేత సారీ చెప్పిచ్చిన రిషి.. మహేంద్ర నిన్ను ఇంకా దిగజారేలా చేస్తా అంటున్న దేవయాని…!

Advertisement

Guppedantha Manasu 03 Oct Today Episode : బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్ గుప్పెడంత మనసు. ఈ సీరియల్ ఎన్నో మలుపులతో అభిమానుల్ని బాగా ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ ఈరోజు తాజాగా రిలీజ్ అయింది. ఈరోజు ఎపిసోడ్ 571 హైలెట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం.. హోటల్లో రిషి వసుదరాని టీ ఆర్డర్ పెట్టి తీసుకురమ్మంటే ఇంత లేట్ చేస్తుంది ఏంటి అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడు వసుధార టీ తీసుకొచ్చి ఇస్తుంది. ఇక రిషి అప్పుడు షేర్ చేసుకుని ఇద్దరు కలిసి తాగుకుంటూ.. ఈ జాబ్ నువ్వు మానేయొచ్చు కదా వసుదార నువ్వు సివిల్స్ కి ప్రిపేర్ అయి రాస్తే నీకు మంచి జాబ్ వస్తుంది అని చెప్తూ ఉంటాడు. అప్పుడు వసుధర సార్ నేను ఒక వృత్తిని ప్రేమించాను. అది మార్చుకొను ఒక వ్యక్తిని ప్రేమించాను అది కూడా మార్చుకోను.. నేను ఎప్పటిలాగే ఉంటాను అని చెప్తూ ఉంటుంది.. అప్పుడు రిషి జీవితంలో ఒక్కొక్కసారి కొన్ని మార్చుకోవాలి. అభిప్రాయాలు కాదు ఆలోచనలు మార్చుకోవాలి అని చెప్తాడు. అప్పుడు నేను నిర్ణయం తీసుకునేటప్పుడే మార్చుకోకూడదు అని అనుకున్నాను అని చెప్తుంది. ఇక నువ్వు మొండి దానివి వసుదారా అని రిషి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే దేవయాని భోజనం దగ్గర కూర్చుని ధరణితో వీళ్లు రారంట అని ఎటకారంగా మహేంద్ర వాళ్ళని అంటూ ఉంటుంది.

Advertisement

వాళ్లు రాకపోతే ఏంటి బొట్టు పెట్టి పిలుస్తామా ఏంటి అని తినబోతూ ఉండగా.. రిషి అక్కడికి వస్తాడు ఇక రిషి ని చూసి ఇంకా డ్రామా అప్లై చేస్తూ ఉంటుంది దేవయాని. అప్పుడు రిషి వచ్చి ఏం జరిగింది పెద్దమ్మ ఎందుకు వాళ్ళు మీ మీద అలిగారు అని అనగానే.. దేవయాని ఏడుస్తూ జరిగిందంతా రిషికి చెప్పబోతూ జరిగిందంతా చెబుతూ నేను ఎప్పుడైనా నిన్ను పరాయి వాడిలాగా చూశానా.. నాకన్నా వాడిలాగా ప్రేమగా చూసుకున్నాను కదా అని నటిస్తూ ఉంటుంది. డాడ్ మీరు అలా ఎలా అంటారు. అన్నారా నిజంగానా చెప్పండి అని అంటూ ఉంటాడు. డాడ్ నా కొడుకు నా ఇష్టం అని అన్నారా చెప్పండి డాడ్ అని కోపంగా అంటూ ఉంటాడు. పెద్దమ్మ నీ అలా ఎలా అంటారు. పెద్దమ్మ నాకు అమ్మ.. పెద్దమ్మ నాకు గురువు, దైవం అంటాడు. మీరు ఏం మాట్లాడట్లేదు అంటే మీరు అన్నారని అర్థమవుతుంది. మీరు పెద్దమ్మకి సారీ చెప్పండి అని కోపంగా అంటూ ఉంటాడు. అప్పుడు మహేంద్ర నా వైపు కూడా వినాలి కదా.. నేను తప్పుగా ఏం మాట్లాడలేదు అని అనగానే రిషి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు.. మహేంద్ర సారీ వదిన గారు అని గట్టిగా అంటూ నా కొడుకు కోసం ఎన్ని మెట్లు అయిన దిగుతాను వాడు ఆకలిగా ఉంటే నేను చూడలేను వెళ్లి వాడిని తీసుకురండి అని చెప్పగానే ..

Advertisement
Guppedantha Manasu 03 september 2022 full episode
Guppedantha Manasu 03 september 2022 full episode

దేవయాని నిన్ను ఇంకా దింపుతాను మహేంద్ర అంటూ రిషి దగ్గరికి వెళ్లి డ్రామా చేస్తూ తనను తీసుకొస్తుంది. ఇక అందరూ భోజనం చేస్తూ ఉండగా.. మహేంద్ర జగతి వెళ్ళిపోతూ ఉంటారు. ఇక అప్పుడు రండి డాడీ మీరు కూడా వచ్చి తినండి పెద్దమ్మ విషయంలో నేనేమన్నా తప్పు చేస్తే క్షమించండి అని అంటూ ఉంటాడు. అప్పుడు దేవయాని వసుధార గురించి అడుగుతూ ఉండగా.. వసుధారానే ఫోన్ చేస్తుంది. ఇక రిషి, వసుదార తో మాట్లాడుతూ ఉండగా.. దేవయాని మండిపోతూ ఉంటుంది. ఇక తర్వాత వసుధార జాబ్ గురించి తన చేసే పనుల గురించి తనని పొగుడుతూ ఉంటాడు రిషి. ఇక దేవయాని మండి పడిపోతూ ఉంటుంది. కట్ చేస్తే వసుధార రిషి ఫోటోను చూస్తూ ఫోన్ చేయొచ్చు కదా.. మెసేజ్ చేయొచ్చు కదా అని అనుకుంటూ ఉంటుంది. అక్కడ రిషి వసుధార ఫోటోలు చూస్తూ తన కూడా అలాగే అనుకుంటూ ఉంటాడు. ఇక్కడ వసుధార లవర్స్ అంటే కాల్స్ చేసుకుంటారు.. మెసేజ్ పెట్టుకుంటారు కదా.. తిన్నావా ఏం తిన్నావు ఎలా ఉన్నావు అని అడగొచ్చుగా అని అనుకుంటూ ఉంటుంది. ఇక్కడ రిషి కూడా అలాగే అనుకుంటూ ఉంటాడు.. ఇక తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే రేపటి ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే…

Advertisement