Guppedantha Manasu 04 Oct Today Episode : బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్ గుప్పెడంత మనసు. ఈ సీరియల్ అభిమానుల్ని బాగా ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ ఈరోజు తాజాగా రిలీజ్ అయింది. ఈరోజు ఎపిసోడ్ 572 హైలెట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం… రిషి వసుధార ఒకరి గురించి ఒకరు గుర్తు చేసుకుంటూ సంతోష పడుతూ ఉంటారు. అంతలో వసుదార మిషన్ ఎడ్యుకేషన్ కోసం మెసేజ్ పెడుతుంది. అప్పుడు రిషి అక్కడికి ఎప్పుడు వెళ్లాలి అని అడుగుతాడు. అప్పుడు వసుధార మీ ఇష్టం సార్ ఎప్పుడైనా వెళ్లండి అని అనగానే.. ఇదేంటి నేను కూడా వస్తాను అని చెప్పొచ్చు కదా అని అనుకుంటూ మేడం తో కలిసి వెళ్ళు అన్ని మెసేజ్ పెడతారు. అప్పుడు వసుదార మీరు మొండి జెంటిల్మెన్ అని అంటూ తన ఫోటో చూస్తూ సంతోష పడుతూ ఉంటుంది. ఇక్కడ రిషి చందమామను చూస్తూ వసుదార ను గుర్తు చేసుకుంటూ ఉంటాడు. అంతలో గౌతమ్ వచ్చి తొందరగా రా అని పిలుస్తాడు. ఇక దాంతో రిషి వెళ్ళిపోతాడు. మహేంద్ర, జగతి కాలేజ్ కి వెళ్తూ ఉండగా.. రిషి వచ్చి గుడ్ మార్నింగ్ డాడ్ కాలేజీకి వెళ్తున్నారా అని అంటూ ఉంటాడు. కానీ మహేంద్ర ఏమీ మాట్లాడకుండా వెళ్తూ ఉంటాడు. అప్పుడు రిషి మనిసుని అర్థం చేసుకున్న జగతి. నాకు కొంచెం షాపింగ్ ఉంది మహేంద్ర నువ్వు రిషి కలిసి కాలేజీకి వెళ్ళండి అని చెప్తుంది. అప్పుడు రిషి తన మనసులో థాంక్స్ మేడం అంటూ తనను పొగుడుతూ ఉంటాడు.
ఇక రిషి మహేంద్ర ఒక దగ్గర ఆగి ఆలోచించుకుంటూ ఉంటూ డాడ్ నేను అలా చేసినందుకు కోపంగా ఉందా అని అడుగుతుంటారు. అప్పుడు మహేంద్ర కోపందీ ఏముంది పాల పొంగులా వచ్చి పోతూ ఉంటుంది. కానీ మనం మనసులో మాటలను మాట్లాడుకుందాం.. అని అంటూ వదిన గారికి సారీ చెప్పినందుకు నువ్వు బాధపడుతూ ఉన్నావు అనుకుంటా. కానీ నేను అప్పుడే మర్చిపోయాను.. నీకోసం, మీ ఆనందం కోసం ఒక్కసారి కాదు వంద సార్లైనా సారీ చెబుతాను. అది నా ప్రేమంటే అని అంటూ ఉంటాడు. అప్పుడు రిషి నేను నడుస్తుంటే నా కాలుకి ముళ్ళు గుచ్చుకుంటే నేను అది తీసుకునేవాడిని కానీ అది నా గుండెకి గుచ్చుకుంది. అది ఎవరు తీస్తారు డాడీ అంటూ ఉంటాడు. దీనికి మీరు ఏం చేయలేరా డాడ్ అంటాడు. నాక్కూడా చేయాలని ఉంది రిషి అని మహేంద్ర అంటారు. అప్పుడు రిషి ప్రేమ ఏమైనా చేయగలదు కదా డాడ్ అని అంటాడు. ప్రేమ గాలి లాంటిది గాలి ఆహ్లాదంగానే ఉంటుంది. కానీ అదే గాలి తుఫానుగా వస్తే అందరం కొట్టుకుపోతాం రిషి అని అంటూ ఉంటాడు. అప్పుడు రిషి నాకు ఇష్టం లేకున్నా నీ కోసం ఎన్నో చేశాను అని అంటూ ఉంటాడు. అప్పుడు మహేంద్ర పిల్లలకు ఆకలి వేస్తే ప్రతిసారి నోరు తెరిచి అడగకపోయినా తల్లిదండ్రులు తీసుకురాగలరు అని అంటూ ఉంటాడు.

అప్పుడు రిషి మహేంద్ర తో నాకు వసుధార కావాలి డాడ్. నా కోరికను నెరవేర్చఅండి డాడ్.. ఒక్క పిలుపు కోసం నా ప్రేమని దూరం చేయకండి. వసుదార ఎటువంటి ఎటువంటి షరతులు లేకుండా నాకు కావాలి డాడ్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక మహేంద్ర నీకోసం ఏదైనా చేస్తా ఎంత దూరమైన వెళ్తా అని అంటూ ఉంటాడు. కట్ చేస్తే వసుధార జగతి కోసం ఎదురుచూస్తూ ఉంటుంది అంతలో జగతి వస్తుంది. జగతితో మేడం నేను నీకోసమే ఎదురు చూస్తాను.. విసిటింగ్ కి వెళ్ళాలి అని చెప్తూ ఉంటుంది. అప్పుడు జగతి రిషితో కలిసి పంపించాలి అని నా ఆరోగ్యం బాగాలేదు అని చెప్తూ ఉంటుంది. అంతలో మహేంద్ర, అక్కడికి వస్తారు. అప్పుడు వసుదార నువ్వు మీ మేడం విసిటింగ్ కి వెళ్తున్నారా అని అనగానే.. వసుదార మేడంకి హెల్త్ బాగోలేదంట నేను ఒక్కదాన్నే వెళ్తున్నాను సార్ అని అంటుంది. అప్పుడు అవునా జగతి మనం హాస్పిటల్ కి వెళ్దాం పద అని అనగానే.. జగతి అదేం లేదులే కాలేజీలో పని ఉంది అని చెప్తూ ఉంటుంది. ఇక వసుధార వెళ్తూ రిషి క్యాబిన్ కి వెళ్లి రిషి కూర్చునే చైర్ తో సరదాగా మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు అంతలో రిషి అక్కడికి వచ్చి అదంతా చూస్తూ అదంతా వీడియో తీస్తాడు. వస్తదారా రిషి చైర్ లో కూర్చుని బిందాస్ గా మాట్లాడుతూ ఉంటుంది. అదంతా రిషి చూస్తూ వీడియో తీస్తూ ఉంటాడు ఇక తర్వాతే ఏం జరిగిందో తెలియాలంటే రేపటి ఎపిసోడ్ లో చూడాల్సిందే…