Guppedantha Manasu 05 Oct Today Episode : దేవయాని చెప్పిన మాటలకు షాక్ అవుతున్న మహేంద్ర… సరదాగా గడుపుతున్న వసుధార, రిషి…

Advertisement

Guppedantha Manasu 05 Oct Today Episode : బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్ గుప్పెడంత మనసు. ఈ సీరియల్ అభిమానిని ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ ఈరోజు తాజాగా రిలీజ్ అయింది. ఈరోజు ఎపిసోడ్ 573 హైలెట్ సెంటు ఇప్పుడు మనం చూద్దాం… వసుధార రిషి క్యాబిన్లు రిషితో మాట్లాడుతున్నట్టుగా చిలిపి పనులు చేస్తూ ల ఉంటుంది. అదంతా రిషి చూస్తూ వీడియో తీస్తూ ఉంటాడు. ఇక అప్పుడు వసుధార లవ్ సింబల్ ని తీసి ముద్దు పెట్టుకోబోతూ ఉండగా.. రిషికి ఒక్కసారిగా ఫోన్ వస్తుంది ఆ సౌండ్ విని వసుధర కంగారు పడుతూ ఉంటుంది. ఇక రిషి ఏంటి అని లోపలికి రాగానే వసుధార సిగ్గుపడుతూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఇక రిషి అక్కడ వసుధార పెట్టిన చాక్లెట్ ని తీసుకొని తింటూ సంతోషంగా ఉంటాడు. కట్ చేస్తే మహేంద్ర మాటల్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. జగతి ఏమైంది మహేంద్ర అంటూ ఉంటుంది. రిషితో మళ్ళీ ఏమైనా గొడవ పడ్డావా అని అడగగానే..

Advertisement

అలాంటిదేం లేదు మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ కదా అని మాట దాటిస్తూ ఉంటాడు. అంతలో అక్కడికి రిషి వచ్చి మీరేంటి ఇక్కడ ఉన్నారు ఏంటి సైట్ కి వెళ్ళాలి కదా వసుధార ఏది అనగానే ఒక్కతే వెళ్ళింది జగతికి ఒంట్లో బాగాలేదు అని మహేంద్ర చెప్తాడు. అప్పుడు జగతి తన టు వీలర్ మీద వెళ్ళింది అనగానే రిషి కంగారుపడుతూ అలా బండిమీద ఎలా వెళ్తుంది ప్రమాదం అంటూ తను అక్కడినుంచి వచ్చేస్తాడు. ఇక వసుధారా కి ఫోన్ చేస్తూ ఉంటాడు కానీ వసుధర ఫోన్ తీయదు. బండి మీద వెళుతూ సరదాగా గట్టిగా అరుస్తూ వెళ్తూ ఉంటుంది. ఇక వసుధార ఒక దగ్గర ఆగి ఫోన్ చేయడం చూసి కంగారుపడుతూ రిషి కి ఫోన్ చేస్తూ ఉంటుంది కానీ రిషి తన దగ్గరికి వచ్చేస్తాడు. అప్పుడు వస్తారా రిషి ని చూస్తే కంగారు పడుతూ ఉండగా రాని తిడుతూ ఉంటాడు. అప్పుడు వసుధార రిషికి సారీ అని చెప్తుంది. ఇక అక్కడ నుంచి ఇద్దరు పొలాలలో నడుస్తూ వెళ్తూ..

Advertisement
Guppedantha manasu 05 October 2022 full episode
Guppedantha manasu 05 October 2022 full episode

సరదాగా మాట్లాడుకుంటూ వెళ్తూ రిషి పడపోతు ఉండగా పని పట్టుకుంటుంది. అలా సరదాగా వెళ్తూ ఉంటారు. కట్ చేస్తే దేవయాని మహేంద్ర దగ్గరికి వచ్చి కూర్చొని కాఫీ ఇచ్చి సెటైర్లు వేస్తూ ఉంటుంది. చూసావు కదా రిషికి నా మీద ఉన్న ప్రేమ అని అంటూ ఉంటుంది. అప్పుడు మహేంద్ర వదిన గారు నేను వెళ్తాను అని వెళ్తూ ఉండగా.. దేవయాని ఆగు మహేంద్ర నేను నీకు చాలా విషయాలు చెప్పాలి అంటూ ఇప్పుడు దాకా జరిగిన విషయాల్ని నేను మర్చిపోతాను మీరు ఆ వసుధారాను మర్చిపోండి అంటూ మన ఋషి హ్యాపీగా ఉండటం కదా మనకు ముఖ్యం అని అంటూ ఉంటుంది. ఇప్పుడు మహేంద్ర వదిన రిషి ఒప్పుకుంటాడా అని అనగానే.. నువ్వు చెప్పు మహేంద్ర అని అనగానే.. ఆ పని మీరే చేయండి వదినగారు అని అంటాడు. అప్పుడు దేవయాని ఋషికి ఏ టైం లో ఏం చెప్పాలో నాకు తెలుసు కానీ నువ్వు రిషికి తండ్రివి కదా ఈ బాధ్యత నువ్వే తీసుకో ఇంకో సంబంధానికి నువ్వే ఒప్పించు అని అంటూ ఉంటుంది. అప్పుడు దేవయాని జగతి దగ్గరికి వెళ్లి మహేంద్ర ఎందుకో డల్ గా ఉన్నాడు వెళ్ళు అక్కడికి అని చెప్తుంది.

అప్పుడు జగతి మహేంద్ర దగ్గరికి వచ్చి అక్కయ్య ఏమంటుంది అని అనగానే.. మహేంద్ర విషపు నాగు ఏం చేస్తోంది. ఎప్పుడు ఎవరిని కాటేయాలో అని ఆలోచిస్తూ చూస్తూ ఉంటుంది. అది తెలిసింది కదా అని అంటాడు. కట్ చేస్తే వసుధర రిషి కలిసి విసిటింగ్ కి వెళ్తూ ఉంటారు. అప్పుడు సార్ ఇక్కడ కాసేపు కూర్చోండి అని వసుధార ఋషిని అక్కడ కూర్చోబెడుతుంది. తర్వాత ఓ రైతు మా జామ తోట చూసొద్దాం రండి సార్ అని చెప్తాడు. అప్పుడు రిషి వద్దయ్యా కిషోర్ నాకు ఇంకా ఓపిక లేదు అని అంటూ ఉంటాడు. అంతలో ఆ రైతు రిషికి జామ పండ్లు తీసుకొచ్చి ఇచ్చి తినమని చెప్తాడు. అప్పుడు ఆ జామ ముక్కలను చూసి సంతోషంతో నాకు చాలా ఇష్టం అని తీసుకుంటుంది. ఇక రిషి నీకు ఏది ఇష్టం లేదు అన్ని ఇష్టమే నీకు అని అప్పుడు వసుధార రిషి పక్కన కూర్చొని సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక తర్వాతే ఏం జరిగిందో తెలియాలంటే రేపటి ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే…

Advertisement