Guppedantha Manasu 07 Oct Today Episode : మహేంద్ర కి వసుధార గురించి చెప్తూ బాధపడుతున్న రిషి… వాళ్ళిద్దర్నీ అలా చూస్తూ బాధపడుతున్న జగతి

Advertisement

Guppedantha Manasu 07 Oct Today Episode :బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్ గుప్పెడంత మనసు. ఈ సీరియల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ ఈరోజు తాజాగా రిలీజ్ అయింది. ఈరోజు ఎపిసోడ్ 575 హైలైట్స్ ఇప్పుడు మనం చూద్దాం… వసుధార అన్న మాటలకు కోపంగా రిషి వచ్చేస్తూ ఉంటాడు. అప్పుడు అంతలో గౌతం వచ్చి తనని కారులో తీసుకెళ్తూ ఉండగా.. వసుధార గౌతమ్ కి ఫోన్ చేస్తుంది. అప్పుడు గౌతం ఫోన్ లిఫ్ట్ చేసి వేరే వాళ్ళతో మాట్లాడినట్టుగా నటిస్తూ ఉంటాడు. అప్పుడు రిషికి అర్థమయి ఫోన్ తీసుకొని ఎవరు అనగానే సార్ మీరు కోపంగా వెళ్లారు. అందుకే నేను కారు అని చెప్పగానే రిషి ఫోన్ కట్ చేస్తాడు. ఇక గౌతమ్ ఏమైంది రా రిషి అని అడుగుతూ ఉంటాడు. అప్పుడు రిషి నీకు ఇప్పుడు పోస్ట్ గుచ్చినట్లుగా చెప్పాల్నా అని అంటాడు. అప్పుడు గౌతమ్ నువ్వేం చెప్పినా చెప్పకపోయినా నాకు అర్థమవుతుంది రా అని అంటాడు.

Advertisement

మొత్తం అర్థం చేసుకుంటే మీ మైండ్ కరాబ్ అవుతుంది అని రిషి అంటాడు. ఇక అలా వెళ్ళిపోతూ ఉంటారు. కట్ చేస్తే ఋషి ధార జగతి గురించి మాట్లాడిన మాటలను గుర్తు చేసుకుంటూ ఉంటాడు.మహేంద్ర కూడా దేవయాని అన్న మాటలను రిషి అన్న మాటలను గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఇక రిషి మహేందర్ ను చూసి తన దగ్గరికి వస్తాడు. అప్పుడు రిషి ఏంటి డాడ్ ఎక్కడున్నారు అని అనగానే.. ఒక కుటుంబంలో అప్పుడు మహేంద్ర కళ్ళు మూసుకుంటే కొన్ని ప్రశ్నలు దాడి చేస్తున్నాయి అందుకే ఇక్కడ ఇలా అని చెప్తాడు. అప్పుడు రిషి నాక్కూడా అలాగే ఉంది డాడ్. నేను వసుధార బంధాన్ని వదులుకోవాలనుకోవడం లేదు అని అంటాడు. అప్పుడు మహేంద్ర బంధానికి ఉన్న గొప్పతనం అదే ఇప్పుడు నేను జగతి ఎలా కలిశాం 20 సంవత్సరాలు దూరంగా ఉండి ఇప్పుడు కలశం అది బంధానుకున్న విలువ అని చెప్తూ ఉంటాడు. అప్పుడు రిషి ఇది ఏంటి డాడీ మనిద్దరం ఉన్నప్పుడు ఎటువంటి సమస్యలు లేవు ఇప్పుడు అన్ని సమస్యలే వస్తున్నాయి.

Advertisement
Guppedantha manasu 07 October 2022 full episode
Guppedantha manasu 07 October 2022 full episode

మన మధ్యలోకి మేడం వచ్చిన తర్వాత ఇలా జరుగుతుంది అని అనగానే.. మనిద్దరి మధ్యలో వసుధార కూడా వచ్చింది అని మహేంద్ర అంటాడు. అప్పుడు రిషి నాకెందుకు చాలా బరువుగా ఉంది ఇక్కడ అని మహేంద్ర చేతిని తీసుకుని బాధపడుతూ ఉంటాడు. అప్పుడు మహేంద్ర ఇలా రా పడుకో కాసేపు అని చెప్పి తనని పడుకోబెట్టుకుని దేవుడు ఏది ఇస్తాడు అది స్వీకరించాలి. ఏది ఇవ్వడు దాని గురించి మర్చిపోవాలి అని చెప్తూ ఉంటాడు. అప్పుడు రిషి చెప్పడం ఈజీ డాడ్ కాని దాని పాటించటం చాలా కష్టం చెప్తారు. ఇక్కడ నేను మాట్లాడించకండి ప్రశాంతంగా పడుకొనివ్వండి అని చెప్తూ ఉంటాడు. ఇదంతా జగతి చూస్తూ బాధపడుతూ ఉంటుంది. కట్ చేస్తే వసుధర ఆటోలో వస్తూ రిషి గురించి ఆలోచిస్తూ ఏం చేయాలో ఎలా ఉండాలో కూడా మీరే డిసైడ్ చేస్తారా.. అనుకుంటూ నేను ఏదైనా చెప్తే మీరు వినరు కానీ మీరు చెప్తే నేను బుద్ధిగా వింటున్నాను అని అనుకుంటూ ఉంటుంది. అంతలో డ్రైవర్ కి ఫోన్ వస్తుంది. అప్పుడు వసుధర భయ్యా నాకు ఏమీ తొందర లేదు మీరు పక్కన ఆపి మాట్లాడండి అని చెప్తుంది. అప్పుడు తను వాళ్ళ అమ్మాయితో మాట్లాడుతాడు. తర్వాత వసుధార ఏంటి భయ్యా మీ అమ్మాయి బొమ్మలు తీసుకు రమ్మంటుందా అని అనగానే అవునమ్మా నాకు ఉన్న స్థోమతి ఒకటి రెండు బొమ్మలు తీసుకురాగలం కానీ చాలా బొమ్మలు అంటే నేను తీసుకోలేను కదా అందుకే మేమే ఇంట్లో తయారు చేసుకుని బొమ్మల కొలువు ఆడుతూ ఉంటాం అని చెప్పగానే…

వసుధార వాళ్ళ అమ్మ గురించి బొమ్మల కొలువు గురించి గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఇక కాలేజీలోకి వచ్చి చెట్టుకు అటువైపు రిషి చెట్టుకి ఇటువైపు వసుధర కూర్చొని అతని గురించి ఒకళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. అంతలో వసుధార కలర్ బాటిల్ ని కిందపడే గాని చూసి నువ్వెక్కడున్నావ్ ఏంటి అని అడగగానే.. అప్పుడు వసుధార బొమ్మలు కొలువు కోసం రాజు రాణి బొమ్మల్ని డెకరేట్ చేస్తున్నాను అని అనగానే రిషి నువ్వు చిన్న చిన్న వాటిలోనే ఆనందాన్ని పొందుతావు కదా అని అంటాడు. అవును సార్ చాలా ఆనందంగా ఉంటుంది అని చెప్తుంది. అలా కాసేపు వాళ్లు ప్రేమగా, సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. తర్వాత రిషి దాని గురించి నువ్వేం మాట్లాడట్లేదు అని అంటాడు. అప్పుడు వసుధరా దాని గురించి కాస్త సహనంగా ఆలోచిస్తే మీకే అర్థమవుతుంది. సార్ అని చెప్తుంది. అప్పుడు రిషి ఒక చిన్న విషయాన్ని పట్టుకొని నువ్వు ఎందుకు ఇంత సీరియస్గా ఆలోచిస్తున్నావు నాకు అర్థం కావడం లేదు అని అంటాడు. అప్పుడు ఎన్నో మెట్లు దిగారు.

ఈ ఒక్క విషయంలో అని అనగానే వసుధారపై కోప్పడుతూ ఉంటాడు రిషి. అప్పుడు వసుధర మీరు అమ్మని అమ్మ అని పిలవడానికి ఎందుకు ఇంతలా ఆలోచిస్తున్నారు. అనగానే నీకు ఇప్పటికీ అర్థం కావడం లేదు ఇంకా మొండిగానే బిహేవ్ చేస్తున్నావు అని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉండగా… సార్ సార్ విసిటింగ్ రిపోర్టు అని అనగానే అది జగతి మేడంకి ఇచ్చి వెళ్ళు అని చెప్తాడు రిషి. ఇక వసుధార నేను ఎప్పటికీ మాటమీద నిలబడతాను అని అనుకుంటూ ఉంటుంది. మీరు జగతి మేడంని అమ్మ అని పిలిచేలా నేను చేస్తాను అని అనుకుంటూ ఉంటుంది. రిషి తన కాబిల్ దగ్గరికి వచ్చి వసుధార అన్న మాటలను గుర్తు చేసుకుంటూ తన తీసిన వీడియోను చూస్తూ ఉండగా… వసుధార వచ్చి ఫోన్ లాక్కుంటు ఉండగా.. రిషి పర్మిషన్ లేకుండా పక్క వాళ్ళ ఫోన్ లోకి తొంగి చూడటం తప్పు అని అంటాడు. అప్పుడు వసుధార నా పర్మిషన్ లేకుండా నన్ను వీడియో తీయడం కూడా చాలా తప్పు అని అంటూ ఉంటుంది. అప్పుడు రిషి నా పర్మిషన్ లేకుండా క్యాబిన్లోకి వెళ్లి కూర్చొని నన్ను నానా మాటలు అన్నావు కదా అది తప్పు కాదా అని అంటూ ఉంటాడు. ఇక తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే రేపటి ఎపిసోడ్లో చూడాల్సిందే…

Advertisement