Guppedantha Manasu 08 Oct Today Episode : బుల్లితెరపి ప్రసారమయ్యే సీరియల్ గుప్పెడంత మనసు. ఈ సీరియల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ ఈరోజు తాజాగా రిలీజ్ అయింది. ఈరోజు ఎపిసోడ్ 576 హైలెట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం… కాలేజీలో రిషి క్యాబిన్ దగ్గర సరదాగా చిన్న ఘర్షణ పడుతూ ఉంటారు. ఆ ఘర్షణలో జగతి పేరు ఎత్తగానే రిషి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే.. జగతి ధరణికి హెల్ప్ చేయాలని చేయబోతూ ఉండగా.. దేవయాని ఎటకారంగా జగతిని మాటలు అంటూ… రిషి బాగుండాలని నేను చూస్తున్న నువ్వు చూస్తున్నావు మనిద్దరి మధ్య ఈ ఘర్షణ ఎందుకు చెప్పు. మనిద్దరి ప్రాబ్లం ఒకటే వసుధార.. నాకు రిషి వసుధారల జంట నాకు నచ్చలేదు. కాబట్టి నువ్వేం చేస్తావో నాకు తెలీదు వస్తదారా రిషి దరిదాపుల్లోకి రాకుండా దూరంగా వెళ్లిపోవాలి అని చెప్తూ అక్కడినుంచి వెళ్ళిపోతుంది. దేవయాని. అప్పుడు ధరణి పెద్ద అత్తయ్య చెప్పిన మాటలు అని అనగానే..
జగతి ఆవిడకి నేను ఎప్పుడూ భయపడలేదు.. రిషి బాగుంటాడు బాగుండేలా నేను చేస్తాను. అని చెప్పి అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే వసుధర కోసం రిషి మహేందరికి చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటూ వసుధారకి ఈ గురుదక్షిణ విషయాలు వదిలేద్దాం అని వసుధరాకి, నేను నిన్నేం అడగలేదు నువ్వేం నాకు చేయొద్దు అని చెప్తూ ఉంటాడు. అప్పుడు వసుధార మీకు రిషి మీద ఉన్న పుత్రవాత్సల్యం మిమ్మల్ని భయపడేలా చేస్తుంది. అని వసుధార అంటుంది. అప్పుడు మహేంద్ర మీరిద్దరి దూరమవుతారేమోనని నా భయం అని అంటాడు. అప్పుడు వసుధార అలా నేను జరగనివ్వను. ఒకప్పుడు రిషి సార్ వేరు.. ఇప్పుడు రిషి సార్ వేరు.. కాబట్టి రిషి సార్ కచ్చితంగా మారతారు అని అంటుంది. ఇప్పుడు మహేంద్ర జగతి విషయంలో చాలా మొండిగా ఉంటాడు రిషి అని చెప్తాడు. అప్పుడు వసుధారా నేను అంతకంటే జగ మొండిని అని చెప్తూ ఉంటుంది. అప్పుడు మహేంద్ర రిషి జీవితం ఎటు పోతుందో అని భయంగా ఉంది ఇక విషయాన్ని వదిలేద్దాం వసుధారా అని చెప్తాడు.

అప్పుడు వసుధార రిషి సార్ ప్రేమనే కాదు తన జీవితంలో బాధ్యతలను కూడా నేను పంచుకుంటాను అర్థం చేసుకుంటాను అని చెప్తూ రిషి సార్ బాధ్యత నాది అని అంటూ ఉంటుంది. అప్పుడు మహేంద్ర నువ్వు గ్రేట్ నీ ఆలోచన గ్రేట్ అంటూ నువ్వు గురు దక్షణ వద్దు అంటే ఎక్కడ ఒప్పుకుంటావో అని భయపడ్డాను అని మహేంద్ర అంటూ ఉంటాడు. నువ్వు నన్ను గెలిపించావ్ జగతిని కూడా గెలిపిస్తావని ఆశిస్తున్నాను అని సంతోషంగా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే… టెన్షన్‌తో తలనొప్పి వస్తుంది వచ్చి మర్దన చేయి అని ధరణికి చెప్పగానే అప్పుడు ధరణి మసాజ్ చేస్తూ ఎటకారంగా కామెడీ చేస్తూ ఉంటుంది. దేవయాని ధరణిని అడిగిన క్వశ్చన్లకే అడ్డదిడ్డంగా సమాధానం చెబుతూ ఉంటుంది. కట్ చేస్తే జగతి రిషి మహేంద్ర మాట్లాడుకున్న మాటలు గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటుంది. అంతలో వసుధార అక్కడికి వచ్చి జగతి ఒకటి అడుగుతుంటే ఇంకొకటి సమాధానం చెబుతూ ఉంటుంది. అప్పుడు జగతి ఆగ్రహంతో వసుధారపై గురించి మండి పడిపోతూ…
అసలు ఇక్కడికి నువ్వు రాకుండా ఉంటే బాగుండేది అని అంటూ.. నువ్వు రిషి కలిశారు విడిపోయారు మళ్ళీ అదృష్ట వాశాత్తు కలిశారు అసలు ఏం జరుగుతుంది ఏం చేయాలనుకుంటున్నారు అని మండిపడుతూ ఉంటుంది వసుధారపై . అప్పుడు వసుధారా నేను ఏం చేశాను మేడమ్ అని అనగానే… నువ్వు కాదు మీ ఇద్దరి కలిసి ఏం చేస్తున్నారు అసలు నీ మొండి పట్టుదలేంటి.. రిషి నన్ను అమ్మ అని పిలవకపోతే ఏమవుతుంది. అనగానే వసుధార అలా ఎలా కుదురుతుంది మేడం. నీ ఆలోచనని మార్చుకో అని అక్కడున్న వస్తువులన్నీ విసురుతూ కోపడుతూ ఉంటుంది. అంతలో మహేంద్ర అక్కడికి వచ్చి ఏం జరిగింది అనగానే… జీవితాలే నాశనమవుతున్నాయి. అది మీకు అర్థం కావడం లేదు అని జగతి మహేంద్ర పై కూడా కోప్పడుతూ ఉంటుంది. ఇక తర్వాతే ఏం జరిగిందో తెలియాలంటే రేపటి ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే…