Guppedantha Manasu 13 Oct Today Episode : బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్ గుప్పెడంత మనసు. ఈ సీరియల్ ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ ఈరోజు తాజాగా రిలీజ్ అయింది. ఈరోజు ఎపిసోడ్ 580 హైలెట్స్ ఇప్పుడు మనం చూద్దాం… రిషి దగ్గర ఉన్న బొమ్మల్ని గౌతమ్ చూసి హాయ్ బొమ్మలు బలే ఉన్నాయి. ఒకసారి ఇవ్వరా చూస్తా అని అంటుండగా… ఇవి నావి నేను ఇవ్వను అని రిషి అంటూ ఉంటాడు. అప్పుడు గౌతమ్ అక్కడినుంచి వెళ్ళిపోతాడు. ఇక అందరూ భోజనానికి కూర్చొని ఉంటారు కానీ రిషి రాకపోయేసరికి అందరూ రిషి ని అడుగుతుంటారు. అప్పుడు వసుధార నేను మెసేజ్ పెట్టాను వస్తున్నాడు అని చెప్తుంది. అప్పుడు రిషి వచ్చి కూర్చొని ఉంటాడు. ధరణి వడ్డిస్తుండగా.. వదిన నేను ఈరోజు వడ్డిస్తాను మీరు కూర్చోండి అని చెప్పి అందరికీ వడ్డించి జగతికి కొసరి కొసరి వడ్డిస్తూ మీ ఆరోగ్యం బాగాలేదు బాగా తినాలి అని జాగ్రత్తగా చెప్తూ ఉంటాడు.
అప్పుడు అందరూ సంతోష పడుతూ ఉంటారు. అప్పుడు ఋషి డాడ్ మేడం తోని పిక్నిక్ కి వెళ్ళండి సంతోషంగా ఉంటారు. మీ సంతోషిమే నాకు కావాలి డాడ్ అంటూ బంధాలనేవి ఎటువంటి ఒప్పందాలు పెట్టుకోకుండా ఉంటేనే సంతోషంగా సాగిపోతూ ఉంటాయి అని చెప్తూ ఉంటాడు. అప్పుడు మహేంద్ర తన మనసులో అంటే రిషి గురుదక్షిణకి ఒప్పుకోవడం లేదు అన్ని ఓకే కానీ దానికి ఒక్కదానికి ఓకే అనడం లేదు అని అనుకుంటూ ఉంటాడు. భోజనం అయిన తర్వాత గౌతమ్ రిషిని బొమ్మల కొలువు గురించి అడుగుతూ ఉంటాడు. అప్పుడు రిషి అలాంటి అనుభవాలు నాకు లేవురా నాకు అలాంటి సంతోషాలకి నేను దూరమయ్యాను అని అంటూ ఉంటాడు. ఇక తర్వాత అందరూ బొమ్మల కొలువు గురించి మాట్లాడుకుంటారు. ఆ సమయంలో వసుధార, రిషి ఒకల్ని ఒకళ్ళు చూసుకుంటూ ఉంటారు. దేవయాని వాళ్లని చూసి కుళ్ళుకుంటూ ఉంటుంది. కట్ చేస్తే బొమ్మల కొలువుకు ఏర్పాట్లు చేస్తూ ఉంటారు.

బొమ్మల కొలువు గురించి గౌతమ్ ఏదో అనుకుంటుండగా రిషి అది కాదురా పెద్దమ్మ మీరు చెప్పండి అనగానే… రిషిధార వస్తు నేను చెప్తాను అని వస్తూ ఉండగా… రిషి, వసుధార వైపు అలాగే చూస్తూ ఉంటాడు. ఇక బొమ్మలు కొలువు గురించి చెప్తూ ఉండగా… దేవయాని ఇప్పుడు దాని గురించి చెప్పడం ఎందుకు ఇప్పుడు అదే చేస్తున్నాం కదా అని అని ఉంటుంది. అప్పుడు అందరూ ఏర్పాట్లు చేస్తూ ఉండగా.. వసుధర అలంకరణకి కొన్ని చీరలు కావాలి అని అడుగుతుండగా… ధరణి పైన గదిలో ఉన్నాయి అని చెప్పగానే… దేవయాని చెప్పడం కాదు వెళ్లి తీసుకురా అనగానే… వసుధార నేను వెళ్లి తీసుకొస్తాను లే అని చెప్పి వెళ్తూ ఉంటుంది. అప్పుడు రిషి వసుధర ఎవరినైనా తోడు తీసుకెళ్లొచ్చు కదా అనగానే వసుధర వచ్చి రిషి చేయి పట్టుకొని తీసుకెళ్తుంది.
అప్పుడు అలా చూసిన మహేంద్ర, జగతి సంతోష పడుతూ ఉంటారు. ఇక పైన గదిలో వసుధర రిషి సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. దేవయాని ధరణిని నైవేద్యం సిద్ధం చేశావా అని అడగగానే ఆ చేశాను అత్తయ్య గారు అని చెప్తుంది. మళ్లీ దేవయాని జగతిని నన్నేమైనా హెల్ప్ చేయమంటావా జగతి అని అడుగుతుంది. అప్పుడు జగతి అయ్యో వద్దు అక్కయ్య గారు మీరు అలా నిలబడి చూస్తూ ఉండండి మేము చేస్తాం కదా అని అనగానే… దేవయాని అంటే నీ ఉద్దేశం నన్ను రిటైర్ అవ్వమంటావా… అని అంటుంది. అప్పుడు మహేంద్ర అయ్యో వదిన గారు రిటైర్మెంట్ కి రిటైర్మెంట్ వచ్చినా కానీ మీరు రిటైర్ అవ్వడం ఉండదు అని ఎటకారం చేస్తూ ఉంటాడు. ఇక గౌతమ్ కూడా పెద్దమ్మ ఒక కుళ్ళు బఠాణి కదూ అని జగతికి చెప్తూ ఉంటాడు. అప్పుడు జగతి నవ్వుతూ ఉంటుంది. దేవయాని ఏంటి గౌతమ్ నవ్వుతున్నావ్ అని అడుగుతూ ఉంటుంది. గౌతమ్ ఏదో ఒక సమాధానం చెబుతూ ఉంటాడు. ఇక తర్వాతే ఏం జరిగిందో తెలియాలంటే రేపటి ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే…