Guppedantha Manasu 14 Oct Today Episode : వసుధారని ఈ ఇంటి కోడలుగా దీపం వెలిగించు అంటున్న దేవయాని… ఆశ్చర్యపోతున్న వసుధార…!!

Advertisement

Guppedantha Manasu 14 Oct Today Episode : బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్ గుప్పెడంత మనసు. ఈ సీరియల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ ఈరోజు తాజాగా రిలీజ్ అయింది. ఈరోజు ఎపిసోడ్ 581 హైలెట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం… వసుధార చీరల్ని సెలెక్ట్ చేస్తూ ఉంటుంది. అప్పుడు రిషి నేను ఇప్పుడే వస్తాను అని వెళుతూ ఉండగా.. వసుధార ఎక్కడికి అని అడుగుతుండగా… నువ్వు ఎక్కడికి అని అడక్కు అని రిషి వెళ్లి వసుధార ఇచ్చిన బొమ్మల్ని తీసుకొచ్చి సెల్ఫీలు దిగుతూ ఉంటారు. దేవయాని వీళ్ళు లోపలికెళ్ళి చాలా సేపు అవుతుంది. ఇంకా రాలేదు అని అంటుండగా.. గౌతం వచ్చి నేను వెళ్లి తీసుకురానా అని అనగానే జగతి సైగ చేసి వెళ్లొద్దు అని చెప్తూ ఉంటుంది. దేవయాని మహేంద్ర ని వెళ్లి పిలుచుకురా అలంకరణ అంతా అయిపోయింది కదా అని అంటూ ఉండగా… అంతలో వాళ్ళిద్దరూ కలిసి వస్తూ ఉంటారు. అప్పుడు దేవయాని ఈ బొమ్మలు ఎక్కడివి రిషి అని అడుగుతుండగా… వసుధారా నేనే కొని తయారు చేశాను అని చెప్తూ ఉంటుంది. అప్పుడు గౌతమ్ ఆ ఫోటోల్ని వసు, రిసీని కూడా ఫొటోస్ తీస్తూ ఉంటాడు. అక్కడ అందరూ సంతోషిస్తూ ఉంటారు.

Advertisement

దేవయాని అప్పుడు ఇక చాల్లేగాని పదండి టైం అవుతుందని అంటుంది. ఇక రిషి ఆ బొమ్మల్ని కూడా కొలువులో పెట్టి ఈ బొమ్మలు మన ప్రతిరూపం అని రిషి అంటూ ఉంటాడు. ఇక బొమ్మల కొలువు లో దండం పెట్టుకుంటూ జగతి, మహేంద్ర రిషి సంతోషంగా ఉండాలి అని కోరుకుంటూ ఉంటారు.ధరణి మాత్రం పెద్ద అత్తయ్య ఏం కోరుకుంటారో అది జరగకుండా చూడు అని మొక్కుకుంటుంది. ఇలా అందరూ మొక్కుకుంటూ ఉంటారు. రిషి ,వసుధార గురించి మొక్కుకుంటూ ఉంటారు. వసుధార రిషి సార్ జగతి మేడంని అమ్మ అని పిలవాలి అని మొక్కుకుంటూ ఉంటుంది. ఇక గౌతమ్ దేవయాన్ని స్టైల్స్ పెట్టిస్తూ ఫోటోలు దింపుతుంటాడు. అప్పుడు గౌతమ్ ఈ బొమ్మల కొలువు గురించి చెప్పు పెద్దమ్మ అని అడుగుతూ ఉంటాడు. అప్పుడు తనకి తెలియక కంగారు పడుతూ ఉండగా… వసుధార నేను చెప్తా అని వచ్చి అంత చెప్తుంది. ఇక అందరూ వసుధారాణి పొగుడుతూ ఉంటారు. ఇక రిషి ఒక చీర తీసుకొచ్చి ఇది మా నాయనమ్మ చీర దీనిని మీ చేతుల మీదుగా వసుధారా కి ఇవ్వండి తన కట్టుకుంటే చాలా బాగుంటుంది అని చెప్తూ ఉంటాడు. అప్పుడు అందరూ సంతోషిస్తూ ఉంటారు.

Advertisement
Guppedantha Manasu 14 Oct Today Episode
Guppedantha Manasu 14 Oct Today Episode

జగతి చీర తీసుకొని తాంబూలతో సహా వసుదారకి ఇస్తుంది. ఇక దేవయాని కుళ్ళుకుంటూ ఉంటుంది. కానీ వసుధర కంగారుపడుతూ భయపడుతూ ఉంటుంది. అప్పుడు దేవయాని ఆ చీర తీసుకొని కట్టుకొని వచ్చి బొమ్మల కొలువు దగ్గర దీపరాధన చేసి కలశానికి దండం పెట్టుకో అని అంటూ.. భూషణ్ కోడలుగా ఆహ్వానిస్తున్నాం అనుకో… అంటూ.. డ్రామాలాడుతూ ఉంటుంది. ఇక వసుధర కంగారుపడుతూ ఆ చీరను తీసుకొని వెళుతూ ఉంటుంది. లోపలికి వెళ్లి ఆలోచిస్తూ ఉండగా.. జగతి అక్కడికి వెళ్లి ఏంటమ్మా కట్టుకోకుండా అలా చూస్తున్నావ్ అంటే.. నీ చీర కట్టుకుంటే సగం కోడలుగా అయినట్టే కదా అని అంటూ ఉంటుంది. అప్పుడు జగతి దాన్లో తప్పేముంది అనగానే… నేను ఈ ఇంటి కోడల్ని కావాలంటే మిమ్మల్ని అమ్మ అని పిలవాలి అనే వాగ్దానం ఉంది కదా అని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు జగతి వసుధార కి నచ్చ చెప్తూ ఉంటుంది. కానీ వసుధార మీ గురించి తెలుసుకొని మిమ్మల్ని అమ్మ అని పిలవాలి అంటూ ఉంటుంది. అప్పుడు జగతి మొండిగా చేయకు వసుధర చీర కట్టుకో. అని తనకి నచ్చ చెప్తూ ఉంటుంది. తర్వాతే ఏం జరిగిందో తెలియాలంటే రేపటి ఎపిసోడ్లో చూడాల్సిందే..

Advertisement