Guppedantha Manasu 15 Oct Today Episode : బుల్లి తెరపై ప్రసారమయ్యే సీరియల్ గుప్పెడంత మనసు. ఈ సీరియల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ ఈరోజు తాజాగా రిలీజ్ అయింది. ఈరోజు ఎపిసోడ్ 582 హైలెట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం… వసుధారాణి జగతి గట్టిగా వార్నింగ్ ఇచ్చి చీర కట్టుకొని రమ్మని చెప్తుంది. అప్పుడు ధరణిని రెడీ చేసి తీసుకు రమ్మని చెప్తుంది. అయితే వసుధారా మాత్రం ఆ చీరని ధరణికి కట్టి కిందికి తీసుకొని వస్తుంది. అప్పుడు అందరూ ఆశ్చర్యపోతూ చూస్తూ ఉంటారు. దేవయాని ధరణిని తిడుతూ ఈ చీర నువ్వెందుకు కట్టుకున్నావ్.. వసదారాన్ని కట్టుకొని రమ్మంటే అని తిడుతూ ఉంటుంది. జగతి కూడా వసుధారణి ఏంటి అని జగతి అడుగుతుండగా… దేవయాని ఇంకేంటి తనకు ఇష్టమైందే చేసింది అని అంటూ ఉంటుంది. అప్పుడు రిషి ఒక్కసారిగా గట్టిగా పెద్దమ్మ అంటూ మా నాయనమ్మ గారి చీర గౌరవం నిలబెట్టాలి అని చెప్పినా కూడా కట్టుకొని రాలేదంటే ఎవరు ఇష్టాలకి ఎవరు అడ్డుపడవద్దని అర్థమవుతుంది అని కోప్పడుతూ ఉంటాడు రిషి. అప్పుడు దేవయాని మా అత్తయ్య చీర అంటే నాకు గౌరవం ఉంటుంది.
ఎవరికో బయటి వాళ్లకి ఎందుకు ఉంటుంది అని అంటుంది. పెద్దమ్మ అందరూ మీలా ఆలోచించరు కదా గౌరవాన్ని పొందాలి. కానీ అడుక్కోకూడదు అని రిషి అంటాడు. అంటూ బొమ్మల కొలువు పూర్తి చేయండి మన మాట విని మన కుటుంబంతో నడవాలని లేనివారితో మనం ఏం చేద్దాం… అప్పుడు దేవయాని లోపల సంతోషపడుతూ ధరణిని పూజకాని అని చెప్తూ ఉంటుంది. వసుధర మాట్లాడుతూ ఉండగా… జగతి కూడా ధరణి పూజ తొందరగా కానివ్వు అని చెప్తూ ఉంటుంది. అలా ధరణి పూజ మొత్తం కంప్లీట్ చేసి అందరికీ హారతి ఇస్తుంది. ధరణి హారతి వసు దగ్గరికి తీసుకెళ్లగా వసుధార తీసుకోకుండా ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు దేవయాని పరాయి వాళ్ళు కూడా దైవం దగ్గర సమానమే హారతి తీసుకో వసుధారా అని చెప్తుంది. అప్పుడు వసు హారతి తీసుకుంటుంది. రిషి అక్కడ్నుంచి కోపంగా వెళ్ళిపోతాడు. జగతి కూడా కోపంగా వసు దగ్గరికి వచ్చి నీతో మాట్లాడాలి నా రూమ్ కి రా అని చెప్పి వెళ్ళిపోతుంది. అంతలో మహేంద్ర అక్కడికి వస్తాడు. అంతలో వసు కూడా అక్కడికి వస్తుంది. అప్పుడు జగతి కోపంగా ఇక ఈ ఇంటికి రాకు అని చెప్తుంది.

అప్పుడు వసు ఈ చీర కట్టుకోవడానికి అని చెప్తుండగా స్టాపిట్ అంటూ… ఇంకేముంది నువ్వు చెప్పడానికి ఒక మనిషిని ఎలా గాయం చేయాలో ఎలా ముక్కలు చేయాలని నీకు తెలుసు అంటుంది.. అప్పుడు వసుధార నేనంటే ఏంటో తెలియదా మేడం అని అంటూ ఉంటుంది. అప్పుడు జగతి తెలుసు వసుధార నువ్వు తెలివైన దానివని తెలుసు కానీ మనుషుల్ని ఎంత బాగా గాయపరుస్తావో ఇప్పుడే నాకు అర్థమైంది అని అక్కడ మా అత్తగారి చీర రిషి మనసు ఎంత బాధపడిందో నీకు అర్థం కావడం లేదా.. అంటూ వసుధారని గట్టిగా తిడుతూ ఉంటుంది. అప్పుడు వసుధార నేను మీ కోసమే కదా అని మనసులో అనుకొని నేను రిషి సార్ ని మారుస్తా అని చెప్తూ ఉంటుంది. అప్పుడు నువ్వేం మారుస్తావు నువ్వు మారుస్తావా… ఇన్ని సంవత్సరాలు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేశావు అని అంటుంది. అప్పుడు వసుధార గురుదక్షిణం గురించి అని అడుగుతుండగా… జగతి ఒక్కసారిగా వసుధారపై చేయి చేసుకుంటుంది. అప్పుడు అది చూసిన రిషి జగతి పై మండిపడుతూ ఉంటాడు.
అప్పుడు దేవయాని ఒక ఆడపిల్లని అది మన ఇంట్లో కొడతావా అని జగతిని అంటుంది. అప్పుడు వసుధర నన్ను కొట్టే హక్కు జగతి మేడం మాత్రమే ఉంది అని చెప్తూ ఉంటుంది. అప్పుడు దేవయాని ఈ ఇంటికి కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి అలా చేయడం అస్సలు బాగాలేదు అని డ్రామాలాడుతూ ఉంటుంది. అప్పుడు రిషి వసుధార బాధపడితేనే తట్టుకోలేను నా ముందే తనని కొట్టారు అంటూ ఉంటాడు. అప్పుడు మహేంద్ర వసుధార కి సంజయ్ చెప్తూ ఉంటే నాకు ఎవరు సంజయ్ చెప్పనక్కర్లేదు సార్. ఈ ఇంట్లో ప్రేమ, ఆప్యాయతలు ఎక్కువ అని అంటుండగా.. జగతి వసుధార అని అంటుండగా… రిషి ఇక చాలు నాకు తట్టుకునే శక్తి లేదు ఇవన్నీ చిన్నప్పుడే వదిలేసి వెళ్లిపోయిన వాళ్లకి ఏం అర్థం అవుతుంది అని వసుదారని చేయి పట్టుకుని రా… వసుధారా అని తీసుకొని వెళ్తాడు రిషి. ఇక తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే రేపటి ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే…