Guppedantha Manasu 17 Oct Today Episode : వసుధారని నేను ఎక్కువ జగతి మేడం ఎక్కువ నీకు అని అడుగుతున్న రిషి… ధరణితో ప్రేమగా మాట్లాడుతున్న దేవయాని…

Advertisement

Guppedantha Manasu 17 Oct Today Episode : బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్ గుప్పెడంత మనసు. ఈ సీరియల్ ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ ఈరోజు తాజాగా రిలీజ్ అయింది. ఈరోజు ఎపిసోడ్ 583 హైలెట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం.. జగతి ,మహేంద్ర వసుని అలా కొట్టినందుకు బాధపడుతూ ఉంటారు. మహేంద్ర అప్పుడు జగతిని ఎన్నైనా చెప్పు కానీ వసుధారాన్ని అలా కొట్టి ఉండాల్సింది కాదు అని అంటూ ఉంటాడు. అప్పుడు జగతి వసు చంప మీద తగిలిన దెబ్బ గురించి నేను ఆలోచించట్లేదు.. రిషి మనసు ఎంత బాధ పడిందో తను చాలా సెన్సిటివ్ అని రిషి గురించి బాధపడుతూ ఉంటుంది. అప్పుడు మహేంద్ర వాళ్ళిద్దరూ బయటికి వెళ్లారు వాళ్ల ఇద్దరి మధ్య దూరం పెరుగుతుందో ఏంటో అని భయమేస్తుంది అని అంటూ ఉంటూ ఉంటాడు. అప్పుడు జగతి వసు ఈ మధ్యన చాలా మొండిగా తయారవుతుంది అద్దం లాంటి మనసుని చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సింది పోయి అద్దంతోనే అట్లాడుతుంది. అని అంటూ అక్కడినుంచి వెళ్ళిపోతుంది.

Advertisement

అప్పుడు మహేంద్ర కూడా రిషి ఫోటోలు చూస్తూ బాధపడుతూ ఉంటాడు. కట్ చేస్తే రిషి వసుధార ఒక దగ్గర కూర్చొని ఆలోచిస్తూ… వసుధార మనిద్దరి మధ్యన గురుదక్షిణ ఒక చీర అడ్డుకట్ట వేస్తుందా సార్ అని అంటూ ఉంటుంది. అప్పుడు రిషి నేను కదా నిన్న అడగాల్సింది నువ్వు అడుగుతున్నావేంటి అని అంటూ ఉంటాడు. అప్పుడు వసుధార ప్రశ్న ఎటునుంచి వస్తే ఏముంది సార్. సమాధానం కావాలి కదా అని అంటూ ఉంటుంది. అప్పుడు అయినా మా నాయనమ్మ చీర ఇచ్చి కట్టుకోమంటే నువ్వు ఎందుకు కట్టుకోలేదు అని ప్రశ్నిస్తూ ఉంటాడు. ఆకాశమంత ప్రేమ ముందు ఆరు గజాల చీర దేముంది సార్ దానివల్ల ప్రేమ తగ్గిపోతుందా.. అది కట్టుకుంటేనే బంధం ఉంటుందా అని కొన్ని కొటేషన్స్ ను రిషికి చెప్తూ ఉంటుంది. అప్పుడు రిషి ఇద్దరి అభిప్రాయాలు కలవనప్పుడు బంధం ఎలా స్ట్రాంగ్ గా ఉంటుంది అని అంటాడు. అప్పుడు రిషి మనిద్దరి మధ్య ఉన్న ప్రేమే మన బంధాన్ని బలంగా చేస్తుంది అని చెప్తూ అలా మాట్లాడుకుంటూ ఉంటారు.

Advertisement
guppedantha manasu 17 oct today episode
guppedantha manasu 17 oct today episode

అప్పుడు వసుధర చీర కట్టుకుంటే బంధం పెరుగుతుంది చీర కట్టుకోకపోతే బంధం తెగిపోతుంది అని అనుకోవద్దు సార్ 6 గజాల చీర దేముంది అని తనని కన్విన్స్ చేస్తూ… అయినా ఆ చీర ఆలోచన మీది కాదనుకుంటా అనగానే రిషి అవును పెద్దమ్మ ఇచ్చింది అని చెప్తాడు. అయినా ఇంత జరిగినా నువ్వు ఇలా ఎలా కూల్ గా మాట్లాడుతున్నావు వసుధారా అని అనగానే…ఇక్కడ ఏం జరిగింది సార్ బాధపడడానికి ఒక చీర, ఒక చెంప దెబ్బ ఇంకా కొత్తవి ఏమున్నాయి సార్ మిగతావన్నీ పాతవే కదా అని అంటుంది. అప్పుడు రిషి జగతి మేడం నిన్ను కొట్టినందుకు నీకు బాధగా లేదా అని అడగగా వసు నేను ఇంతకుముందే చెప్పాను సార్ జగతి మేడంకి నన్ను కొట్టి అధికారం ఉంది అని అంటూ ఉంటుంది. అప్పుడు రిషి జగతి మేడం తరఫున నేను నీకు సారీ చెప్తున్నాను అని అనగానే.. జగతి మేడం తరఫున మీరు సారీ చెప్తున్నారు అంటే మీకు తనమీద ఏ హక్కు ఉంది అని అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటుంది వసుధార. అప్పుడు రిషి కోపంగా ఈ విషయాన్ని ఇంతటితో ఆపుదామా అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక వసుధార మీరు కచ్చితంగా మారతారు సార్ అని అనుకుంటూ ఉంటుంది.

కట్ చేస్తే దేవయాని ధరణితో వసు చీర కట్టుకోలేదు అనే విషయాల మాట్లాడుతూ.. ధరణి ని పొగుడుతూ ఉంటుంది. అప్పుడు ధరణి మనసులో ఏం తుఫాను రాబోతుందో ఇలా ఎంత కూల్ గా మాట్లాడుతుంది అనుకుంటూ ఉంటుంది. అప్పుడు దేవయాని మహేంద్ర జగతి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో ఒక కన్ను వేసి ఉంచి నాకు జరిగిందంతా చెప్పు అని ప్రేమగా మాట్లాడుతూ పొగుడుతూ ఉంటుంది ధరణిని…
కట్ చేస్తే రిషి వసుధారని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు అప్పుడు వసుదార వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడు రిషి కనీసం బాయ్ కూడా చెప్పవా వసుధారా అని అనగానే వసుధర వెనుకకి వచ్చి తన కార్ కీని తీసుకొని మీరు కూడా లోపలికి రండి అని అర్థం అని చెప్తూ ఉంటుంది. అప్పుడు రిషి వాళ్ళ పెద్దమ్మకి ఫోన్ చేసి నేను ఈరోజు ఇంటికి రావడం లేదు అని చెప్తాడు.

తర్వాత రిషి రూమ్ లోకి వెళ్లి అంతా చూస్తూ ఉంటాడు. అప్పుడు వసుధర తాగడానికి నీళ్లు ఇస్తుంది. అలా నీళ్లు తాగిన తర్వాత నీ రూమ్ లోకి వస్తే నాకు ఏదో ఫీలింగ్ కలుగుతుంది అని అంటూ ఉంటాడు. అప్పుడు వసుధార అదే ప్రేమంటే అని అంటూ ఉంటుంది. అప్పుడు రిషి వసుధార చేతులు పట్టుకొని నీకు జీవితంలో కొన్ని అభిప్రాయాలు ఉంటాయి కదా.. దాంట్లో నీకు ఎవరు ఇంపార్టెంట్ పర్సన్ అని నేనా.. జగతి మేడం.మా అని అంటాడు. అప్పుడు వసుధార జగతి మేడమే సార్ అని అనగానే తన చేతులు ఒక్కసారిగా వదిలేసి మరి నేనేంటి అని అడుగుతాడు. అప్పుడు వసుధార మీరు నా జీవితం మీరు నేను వేరు కాదు అని ప్రేమగా మాట్లాడుతూ ఉంటుంది. ఇక తర్వాతే ఏం జరిగిందో తెలియాలంటే రేపటి ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే..

Advertisement