Guppedantha Manasu 20 Oct Today Episode : జగతి మహేంద్ర లను బాధపడేలా మాటలు అంటున్న దేవయాని… ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్న రిషి…

Advertisement

Guppedantha Manasu 20 Oct Today Episode : బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్ గుప్పెడంత మనసు. ఈ సీరియల్ ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ ఈరోజు తాజాగా రిలీజ్ అయింది. ఈరోజు ఎపిసోడ్ 586 హైలెట్సె ఏంటో ఇప్పుడు మనం చూద్దాం… దేవయాని రిషితో ఏడుపు డ్రామా మొదలుపెట్టి తనపై ప్రేమ వర్షం కురిపిస్తూ ఉంటుంది. అప్పుడు రిషి వసుధార తన మనసు మార్చుకొని నాకోసం వస్తుంది. జగతి మేడం మీద కృతజ్ఞత ఉంది. అంతకంటే ఎక్కువ ప్రేమ నా మీద ఉంది. నా ప్రేమ గెలుస్తుంది. తను మన ఇంటి కోడలుగా వస్తుంది. అని చెప్తాడు. అప్పుడు దేవయాని ఆ అమ్మాయి మారేటట్లుగా లేదు. పొడిపొడిగా మాట్లాడుతుంది నాకు భయమేస్తుంది అని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు రిషి. మా ఇద్దరి మధ్య ఈ చిన్న అడ్డుతెర తప్ప ఏమీ లేదు. మా ఇద్దరిని ప్రేమె గెలిపిస్తుంది.

Advertisement

ప్రేమ దగ్గర చేస్తుంది అని చెప్తూ ఉంటాడు. కట్ చేస్తే మహేంద్ర జగతి కాలేజీకి వస్తారు. అంతలో గౌతం అక్కడికి వస్తాడు. అప్పుడు వాళ్లు రిషి ని ఎక్కడున్నారు అని అడుగుతారు అప్పుడు గౌతం రాత్రంతా కాలేజీ క్యాంపస్ లోనే ఉన్నాడు కానీ వసూ నుంచి ఫోన్ రాగానే హడావుడిగా వెళ్ళాడు అని చెప్తాడు. అప్పుడు అవునా అని కంగారుపడుతూ ఉండగా.. వసు అక్కడికి వస్తూ ఉంటుంది. అప్పుడు వసుధారని వాళ్లు పిలిచి రిషి ఎక్కడున్నాడు అని అడగగానే వసుధార నా దగ్గరికి వచ్చారు. మళ్లీ దేవయాని మేడం గారు తీసుకెళ్లారు. అని చెప్పగానే వాళ్ళు కంగారుపడుతూ దేవియాని వదిన నీ దగ్గరికి ఎందుకు వచ్చింది అని అనగానే… అక్కడ జరిగిందంతా మహేంద్ర ,జగతి వాళ్ళకి చెప్తుంది వసుధార.. అప్పుడు జగతి దేవయాని అక్కయ్యతో కూడా గురుదక్షిణ విషయాన్ని చెప్పించుకుంటున్నావా అసలు ఎక్కడికి వెళ్తున్నావ్ ఏం చేస్తున్నావ్ అని అంటూ ఉంటుంది. అప్పుడు వసుధార ఒక నాకు నమ్మకం ఉంది అని అంటూ ఉంటుంది.

Advertisement
Guppedantha Manasu 20 oct today episode
Guppedantha Manasu 20 oct today episode

అప్పుడు జగతి కోపంతో నమ్మకం నమ్మకం ఇక్కడ మనుషులు బాధపడుతుంటే నమ్మకం పట్టుకొని వేలాడుతున్నావేంటి ఆ గురుదక్షిణ విషయాన్ని వదిలేయవా అని అంటుంది. అప్పుడు వసుధార క్షమించండి మేడం నేను వదిలేయను అన్నట్లుగా చెప్తుంది. అప్పుడు జగతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వసుధార గౌతమ్ ని మీరు అన్న మాట్లాడండి సార్ రిషి సార్ తో అని చెప్తూ ఉంటుంది. అప్పుడు నువ్వు ఎంత మొండి దానివో తను కూడా అంతే మొండివాడు ఎవరో ఒకరు ఒక స్టెప్ దిగితే బాగుంటుంది లేకపోతే మీ బంధానికి ప్రమాదం ఉంది అన్నట్లుగా చెప్తాడు. అప్పుడు వసు ఎప్పటికీ వదులుకోలేను ఎప్పుడు వదలను అని చెప్తూ ఉంటుంది. ఇంకా గౌతం కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత మహేంద్రతో గురుదక్షిణ విషయాన్ని మాట్లాడుతు రిషి సార్ తప్పకుండా మారతారు అని మహేంద్ర కి ధైర్యం చెబుతూ ఉంటుంది వసుధార. కట్ చేస్తే దేవయాని రిషి దగ్గర కూర్చుని ఉంటుంది. రిషి అప్పుడు పెద్దమ్మ మీరు నా దగ్గరే ఎంతసేపని కూర్చుని ఉంటారు అని అంటుండగా…

నాకు పెద్దగా ఆశలు అంటూ ఏమి లేవు అంతా నువ్వే అన్నట్లుగా ప్రేమ కురిపిస్తూ డ్రామాలాడుతూ ఉంటుంది. జగతి మహేంద్ర కార్లో వస్తూ.. ఇంటికి వెళ్లాలంటే భయమేస్తుంది వదినగారు రోజురోజుకి ఎంతో ప్రమాదకరంగా తయారవుతున్నారు భయంగా ఉంది అని అంటూ ఉంటాడు. అప్పుడు జగతి అక్కయ్య గారి నిజస్వరూపాన్ని రిషి తెలుసుకునే టైం వస్తుంది అని అంటూ ఉంటుంది. అప్పుడు మహేంద్ర మనమే చెప్పేద్దాం అని అంటూ ఉంటాడు. అప్పుడు వద్దు రిషి తనంతట తానే తెలుసుకోవాలి వెయిట్ చేద్దాం అని అంటూ ఉంటుంది. కట్ చేస్తే… రిషి వసుధారాలు ఒకల గురించి ఒకళ్ళు ఆలోచించుకుంటూ మెసేజ్లు పెట్టుకుంటూ ఉంటారు. మహేంద్ర జగతి ఇంటికి వస్తుండగా దేవియాని వాళ్ళని ఆపి రిషి ని పట్టించుకునే టైం లేదా అన్నట్లు కావాలని ఎటకారంగా మాట్లాడుతూ వాళ్ళని బాధపెడుతూ ఉంటుంది. అప్పుడు మహేంద్ర రిషి దగ్గరికి వెళుతూ ఉండగా.. ఆగు మహేంద్ర రిషి బాగా డిస్టర్బ్ అయ్యాడు ఇంకా వెళ్లి డిస్టర్బ్ చేయకు అని చెప్తూ ఉంటుంది.

అప్పుడు మహేంద్ర వదిన గారు రిషి నా కొడుకు నా కొడుకు రూమ్ లోకి వెళ్ళడానికి నీ పర్మిషన్ తీసుకోవాలా అని గట్టిగా అంటూ ఉంటాడు.అప్పుడు రిషి ని బయటికి వస్తూ ఉంటాడు అప్పుడు రిషి ని చూసి దేవయాని మేము ఇంట్లో నుంచి వెళ్ళిపోతాం అంటూ డ్రామా ప్లే చేస్తుంది. అప్పుడు రిషి దేవయాని దగ్గరికి వచ్చి మీరు ఏడవకండి పెద్దమ్మ అని వెళ్ళిపోతూ మళ్లీ ఆగి మహేంద్రని ఇలాంటి పరిస్థితులు వస్తాయని నేను ఎప్పుడు ఊహించలేదు మీరు కూడా మారిపోతారని నాకనిపిస్తుంది డాడీ అని రిషి వెళ్ళిపోతాడు. ఇక మహేంద్ర జగతి కూడా వెళ్తూ ఉండగా.. దేవయాని వాళ్లని వెనక్కి పిలుచి వాళ్లు బాధపడేలా మీకు సంతోషంగా ఉందా ఇప్పుడు మళ్లీ రిషి ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు రిషి ని ఎలా చూసుకోవాలి అపురూపంగా చూసుకోవాలి కదా.. అంటూ రిషి సంతోషాలు నువ్వు కాలు మోపావు దూరమయ్యాయి అని వాళ్ళని నానా మాటలు అంటూ ఉంటుంది. అప్పుడు మహేంద్ర ఆగ్రహంతో దేవియాని పై మండిపడుతూ ఉంటాడు. కానీ జగతి అడ్డుపడుతూ ఉంటుంది. దేవయాని వాళ్ళిద్దరూ కలవకుండా ఉండడానికి వాళ్ల ప్రేమకి మీరే అడ్డంకి గురుదక్షిణ విషయం అడ్డం లేకపోతే ఈపాటికి వాళ్లు కలిసి పోయేవాళ్ళు అని చెప్తూ ఉంటుంది. తర్వాతే ఏం జరిగిందో తెలియాలి అంటే రేపటి ఎపిసోడ్లో చూడాల్సిందే…

Advertisement