Guppedantha Manasu 21 Oct Today Episode : బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్ గుప్పెడంత మనసు. ఈ సీరియల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ ఈరోజు తాజాగా రిలీజ్ అయింది. ఈరోజు ఎపిసోడ్ 587 హైలెట్సె ఏంటో ఇప్పుడు మనం చూద్దాం… దేవయాని జగతిని ,మహేంద్రా ని ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతూ రిషి బాధపడడానికి మీరే కారణం మీరు. గురుదక్షిణ విషయం మీరు మాట్లాడి ఉండకపోతే ఈపాటికి రిషి వసుధారలు పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండేవాళ్ళు ఉదయం వెళ్తారు రాత్రికి వస్తారు రిషి ని పట్టించుకోనే పట్టించుకోరు మీరు ఇంట్లో ఉన్న లేకున్నా ఒక్కటే మీరు ఇంట్లో నుంచి వెళ్ళిపోతే బాగుంటుంది అనిపిస్తుంది. ఈ ఇంట్లో రోజురోజుకి స్వార్ధాలు ఎక్కువవుతున్నాయి అని అక్కడినుంచి వెళ్ళిపోతారు. అప్పుడు మహేంద్ర ఈ సమస్యకి ఏదో ఒక పరిష్కారం ఆలోచించాలి అనే జగతిని కూడా తీసుకొని వెళ్ళిపోతాడు అక్కడి నుంచి.
కట్ చేస్తే రిషి వసుధారాలు కార్లో ప్రేమగా మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటారు. కట్ చేస్తే మహేంద్ర జగతి రిషి అన్న మాటలను గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటారు. రిషికి ఫోన్ చేస్తాడు మహేంద్ర కానీ ఫోన్ స్విచాఫ్ వస్తుంది. వదిన గారు అన్నట్టుగా రిషికి మనమే శత్రువులు అవుతున్నామా. మహేంద్ర ఆవేశంగా జగతి నేనొక మాట చెప్తాను వింటావా అంటూ ఉంటాడు. కట్ చేస్తే రిషి వసుధారలు సరదాగా ప్రేమగా మాట్లాడుకుంటారు చెట్టు కింద కూర్చొని ఉంటారు. కట్ చేస్తే.. మనం వెళ్లిపోవడమే పరిష్కారం అని జగతితో చెప్పి రిషి మహేంద్ర లు కలిసి దిగిన ఫోటోలు చూస్తూ ఏడుస్తూ… ఆ ఫోటోని తీసి దాచుకుంటాడు. దానిపైన ఏదో రాసి మహేంద్ర జగతి కలిసి వెళ్ళిపోతూ ఉంటారు. దేవయాని వాళ్లని చూస్తూ సంతోషపడుతూ ఉంటుంది. కట్ చేస్తే.. రిషి వసుధారతో జీవితం చాలా విచిత్రంగా ఉంటుంది కదా..

వసుధార అని అంటూ ఉంటాడు. అప్పుడు వసు ఏంటి సార్ అవి చిత్రం అనగానే… రిషి లైఫ్ లో అప్పుడే సంతోషాలు అప్పుడే బాదలు అన్నీ కలిసి ఉంటున్నాయి. అప్పుడు వసుధార రిషి పైపు చూస్తూ ఉంటుంది. అప్పుడు రిషి ఏంటి నా వైపు అలా చూస్తున్నావ్ అనగానే.. మీరు సగం సగం నవ్వుతూ ఉంటు ఉన్నారేంటి అని.. అంటుంది. అప్పుడు రిషి నాకు నవ్వు చాలా సంవత్సరాలుగా నా నవ్వు దూరమైంది నువ్వు వచ్చేటప్పుడు సంతోషాలు నవ్వుని తీసుకొచ్చావు అని అంటూ సరదాగా ప్రేమగా మాట్లాడుకుంటూ ఉంటారు. వసుధార నా పేరుని పొగరు అని ఎందుకు పెట్టుకున్నారు సార్ అని అడుగుతుంది. అప్పుడు నువ్వు నాకు స్పెషల్ అనగానే… వసు తన భుజంపై పడుకుని ఈరోజు చాలా సంతోషంగా ఉంది అని అంటుంది.
అప్పుడు ఋషి నాకు ఇలాంటప్పుడే చాలా భయమేస్తుంది. మనం ఎక్కడ దూరం అవుతాము అని నాకు ఇష్టమైన వాళ్లు దూరమవుతారేమోనని భయమేస్తుంది. అని డాడ్ అంటే నాకు చాలా ఇష్టం నేనంటే మా డాడీకి చాలా ఇష్టం నేను ఒక్కరోజు కూడా మా డాడ్ నీ చూడకుండా ఉండలేను అంటూ మహేంద్ర గురించి చెప్తూ ఉంటాడు. కట్ చేస్తే మహేంద్ర జగతి వెళ్ళిపోతూ ఉంటారు. రిషి వసుధార ఈరోజు ఎంత ప్రశాంతంగా ఉందో తెలుసా అని అంటూ ఉంటాడు. ఇలా రిషి వసుధారలు ప్రేమగా మాట్లాడుకుంటూ వెళ్తారు.. మహేంద్ర ,జగతి బాధగా మాట్లాడుకుంటూ వెళ్తుంటారు… ఇక తర్వాతే ఏం జరిగిందో తెలియాలంటే రేపటి ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే..