Guppedantha Manasu : బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్ గుప్పెడంత మనసు. ఈ సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ ఈరోజు తాజాగా రిలీజ్ కాదు.. ఈరోజు ఎపిసోడ్ 589 హైలెట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం… జగతి మహేంద్ర ఇంట్లో నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. రిషి వసుధారాలు సరదాగా గడిపి ఇంటికి వస్తూ ఉంటారు. అలా వచ్చి వసుదారని ఇంటి దగ్గర డ్రాప్ చేసి రిషి ఇంటికెళ్లి మహేంద్ర దగ్గరికి వెళ్తూ ఉంటాడు. కానీ మహేంద్ర వాళ్ళు కనిపించపోయేసరికి అంత వెతికి ఫోటో ప్రేమ్ పై “వెళ్తున్నాం” అని రాసిన దాన్ని చూసి కంగారుపడుతూ దేవయాని దగ్గరికి వచ్చి డాడ్ వాళ్ళు ఎక్కడికి వెళ్లారు.. ఎందుకెళ్లారు మీరేమైనా అన్నారా అయినా వాళ్ళు వెళ్తుంటే మీరు ఎందుకు ఆపలేదు.. లేదా నాకెందుకు ఫోన్ చేయలేదు అని గట్టిగా ప్రశ్నిస్తూ ఉంటాడు. కానీ దేవయాని మాత్రం ఏమీ తెలియనట్లుగా డ్రామాలు చేస్తూ రిషి పై ప్రేమ వలకబోస్తూ ఉంటుంది. అప్పుడు గౌతమ్ రాగ గౌతమ్ తో వసు దేవయాని జరిగిందంతా చెబుతుంది.
అప్పుడు గౌతం రిషి ని ఓదార్చి వాళ్లని వెతకడానికి వెళ్లి వసుధారా కి చెప్పి వసుధారాన్ని రిషి దగ్గరికి పంపిస్తాడు. అప్పుడు వసుధార, రిషి దగ్గరికి వస్తుంది. రిషి వసుధారాన్ని డాడ్ వాళ్లు ఎక్కడైనా కనిపించారా.. వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు. అని కంగారు పడుతూ టెన్షన్ పడుతూ ఉంటాడు. అప్పుడు వసుధార సార్ మీరు కంగారు పడకండి వాళ్ళు ఎక్కడికి వెళ్లారు. మిమ్మల్ని వదిలేసి ఉండరు మీరు రిలాక్స్ అవుదురు గాని రండి అని తీసుకెళ్తూ… దేవయానికి స్ట్రాంగ్ గా టీ పెట్టి తీసుకురా అని చెప్పి వెళ్ళిపోతుంది. అప్పుడు దేవయాని ఇదేంటి నాకు పని చెప్తుంది. నేను ఒకటి అనుకుంటే ఇంకొకటి జరిగింది అని ధర్నాని పిలిచి టీ పెట్టమని అడుగుతూ ఉంటుంది. అప్పుడు ధరణి టీ పెట్టుకుని తీసుకొని రా వెళ్తూ ఉంటుంది. రిషి దగ్గరికి కానీ దేవయాని నేను తీసుకెళ్తాను అని అ టి తీసుకుని వెళ్లి ప్రేమ కురిపిస్తూ నేనే తీసుకొచ్చాను అని చెప్తూ ఉంటుంది. రిషి ముందు ప్రేమ నటిస్తూ ఉంటుంది.

అప్పుడు వసుధార మీరు కాసేపు బయటికి వెళ్ళండి. మేడం సార్ రిలాక్స్ అవుతారు. అని తన దగ్గర కూర్చొని ఓదారుస్తూ ఉంటుంది. అప్పుడు దేవయాని షాక్ అవుతూ ఉంటుంది. కట్ చేస్తే గౌతం అన్నిచోట్ల వెతుకుతూ ఉంటాడు కానీ వాళ్ళు ఎక్కడా కనిపించరూ.. రిషి గౌతమ్ కి ఫోన్ చేస్తూ ఉంటాడు. గౌతమ్ ఇంకా ఎక్కడ కనిపించలేదు అని చెప్తూ ఉంటాడు. కట్ చేస్తే మహేంద్ర జగతి రిషి గురించి బాధపడుతూ టెన్షన్ పడుతూ ఉంటాడు. మహేంద్ర టెన్షన్ పడుతూ గుండెల్లో బాధగా ఉంది అని తనకి అక్కడ నొప్పిగా ఉంది అని జగతికి చెప్తూ ఉంటాడు. అప్పుడు జగతి కంగారుపడుతూ మహేంద్ర టెన్షన్ పడకు మనం రిషికి మంచి జరగాలని బయటికి వచ్చాం.. తను హ్యాపీగా ఉండాలి అని బయటకు వచ్చాము అని తనకి ధైర్యం చెబుతూ ఓదారుస్తూ ఉంటుంది. ఇక రిషి డాడి వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు వసుధర ఎందుకు వెళ్లిపోయారు. నేనేమైనా తప్పు చేశానా అని వసుధారా అని అడుగుతూ ఉంటాడు.. అప్పుడు వసుధార మీరు టెన్షన్ పడకండి ఇంట్లో ఏదో గొడవ జరిగింది. దేవయాని మేడం ఏదో అంటారు లేకపోతే వాళ్లు ఎందుకు వెళ్తారు.. మహేంద్ర సార్ కి మీరంటే ప్రాణం కదా ఆ విషయం మీరు తెలుసుకోండి అని చెప్తూ ఉంటుంది. ఇక తర్వాతే ఏం జరిగిందో తెలియాలంటే రేపటి ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే…