Guppedantha Manasu 24 Oct Today Episode : బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్ గుప్పెడంత మనసు. ఈ సీరియల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ ఈరోజు తాజాగా రిలీజ్ అయింది. ఈరోజు ఎపిసోడ్ 589 హైలెట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం.. రిషి ని వసుధార రూమ్ లోకి తీసుకెళ్లి కూర్చోబెట్టి ధైర్యం చెబుతూ ఉంటుంది. రిషి మాత్రం మహేంద్రని తలుచుకొని డాడీ నేను ఒక మాట అని బాధ పెట్టాను. పెద్దమ్మకి సారీ చెప్పమని బాధ పెట్టాను నేను తప్పు చేశాను అంటూ బాధపడుతూ ఉంటాడు. వసుధారని మెసేజ్ పెట్టు ఫోన్ ఆన్ చేయగానే చూసుకుని కాలేజీకి వస్తారు అప్పుడు నేను డాడ్ ని గట్టిగా హాగ్ చేసుకుని బ్రతిమిలాడుకుంటాను అంటూ ఉంటాడు. అప్పుడు వసుధార రిషిని ఓదారుస్తూ ధైర్యం చెబుతూ మీరు రెడీ అవ్వండి కాలేజీకి వెళ్దాం అని అంటూ ఉంటుంది. అప్పుడు రిషి మీ మేడంకి నీకు చాలా అనుబంధం ఉంది కదా ఎక్కడున్నారు చెప్పు నీకు తెలుసు అన్నట్లుగా అంటాడు. అప్పుడు వసుధార నాకేం చెప్పలేదు సార్ మీరు నన్నే అనుమానిస్తున్నారా అని అంటుంది.
ఇది అనుమానం కాదు నా బాధ నువ్వేంటో నాకు తెలుసు అని అంటుంది. అప్పుడు వసుధరా నేను మీ నీడని మీ అడుగులో అడుగుని మీ జీవితం పంచుకునే దాన్ని నన్నే అనుమానిస్తున్నారా అని అంటుంది. అప్పుడు రిషి ఏం చేయాలో అర్థం కావడం లేదు ఎలా అని బాధపడుతూ ఉంటాడు. అప్పుడు వసుధార మీరేం బాధపడకండి వాళ్ళు వస్తారు అని ధైర్యం చెబుతుంది. దేవయాని బయట నుంచి అదంతా చూస్తూ కుళ్లుకుంటూ ఉంటుంది. కట్ చేస్తే ధరణి మహేంద్ర వాళ్ళ గురించి ఆలోచిస్తూ పాలు పొంగుతున్న చూసుకోకుండా ఉంటుంది. అంతలో వసుధార వచ్చి ఆ పాలు పొంగకుండా చూసుకొని ధరణిని అడుగుతూ ఉంటుంది. అప్పుడు ధరణి చిన్న మామయ్య వాళ్ళు ఎలా వెళ్ళిపోయారు అని బాధపడుతూ ఉంటుంది. అప్పుడు వసుధార ధరణికి కూడా ధైర్యం చెప్పి కాఫీ తీసుకొని వెళ్తూ ఉండగా.. దేవయాని అక్కడికి వస్తుంది. అప్పుడు వసుధారా టి ఇవ్వమంటారా..అనగానే నాకేం అవసరం లేదు అని అనగానే… థాంక్స్ మేడం వేస్ట్ అవుతుంది.

అని ఎటకారంగా దేవయానికి ఒక చురక ఇచ్చి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే రిషి మహేంద్ర గురించి అన్ని జ్ఞాపకాలు చేసుకుంటూ ఉంటాడు. అంతలో వసుధార కాఫీ తీసుకొచ్చి తాగండి సార్ అని చెబుతూ ఉంటుంది. అప్పుడు కాలేజీకి వెళ్దాం పద మీటింగ్కి తప్పకుండా జగతి మేడం వసుధార పద అని అంటూ ఉంటాడు. అప్పుడు వసు వాళ్ళు రాకపోతే మీరు ఎంత డిసప్పాయింట్ అవుతారో ఏంటో అని వసుధరా కూడా బాధపడుతూ ఉంటుంది. కట్ చేస్తే మహేంద్ర జగతి, గౌతమ్ ఇంట్లో మహేంద్ర ,రిషి ఫోటోను చూస్తే బాధపడుతూ ఉంటాడు. గౌతం కూడా అక్కడే ఉంటాడు మహేంద్ర వాళ్ళని మీరు ఇలా రావడం నాకు చాలా బాధగా ఉంది రిషి చాలా బాధపడుతున్నాడు అని అంటాడు. అప్పుడు మహేంద్ర వర్షాకాలంలో ఎండ విలువ తెలుస్తుంది. ఎండాకాలంలో వర్షం విలువ తెలుస్తుంది. అలాగే కొన్ని కొన్ని విలువలు తెలియాలంటే కొన్ని వదులుకోవాలి అని అంటూ ఉంటాడు. గౌతమ్ కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తూ మీ సమస్య తీరేవరకు ఇక్కడే ఉండండి అని చెప్తూ ఉంటాడు. కాలేజీలో వసుదార జగతి మేడం అన్నమాటలు గుర్తు చేసుకుంటూ ఉంటుంది. రిషి వచ్చి ఏం ఆలోచిస్తున్నావు.
వసుధార అని అంటాడు. అప్పుడు వసుదార వాళ్లు వెళ్లిపోవడానికి నేను కూడా కారణం అంటారా అని అంటుంది. అప్పుడు ఋషి కారణమేదైనా కావచ్చు వాళ్ళు వెళ్లిపోవడం ఏంటి అది నాకు అర్థం కావడం లేదు అని అంటూ రిషి బాధపడుతుంటాడు. అప్పుడు వసుధార మీరు తప్పు చేశారేమో అందుకే మహేంద్ర సార్ వెళ్లిపోయారు అని అనగానే.. రిషి కోపంగా ఒకవేళ నేను తప్పు చేస్తున్నాను అనుకో నన్ను గట్టిగా నెరవేయొచ్చు కదా గట్టిగా అడగొచ్చు కదా ఆయనకు ఆ మాత్రం స్వతంత్రం లేదా ఏంటి ఇలా వెళ్లిపోవడం ఏంటి అని అంటాడు. వాళ్ల మనసుకి ఎంత బాధ కలిగితే ఇలా ఇంట్లో నుంచి వెళ్ళిపోతారు… అని అంటుంది అప్పుడు రిషి వసుధారపై కోప్పడుతూ ఉంటాడు. అప్పుడు వసుధార జగతి మేడంని మీరు అని అనగానే రిషి గట్టిగా ప్లీజ్ వసుధారా అంటాడు. ఇక తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే రేపటి ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే..