Guppedantha Manasu 29 Sep Today Episode : రిషి విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్న వసుధార నీ చూసి సర్ప్రైజ్ అవుతున్న కుటుంబ సభ్యులు… మండిపోతున్న దేవయాని…!

Advertisement

Guppedantha Manasu 29 Sep Today Episode : బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్ గుప్పెడంత మనసు ఈ సీరియల్ అభిమానుల్ని బాగా ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ ఈరోజు తాజాగా రిలీజ్ అయింది. ఈరోజు ఎపిసోడ్ 568 హైలెట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం… రిషి నేను ఇప్పటికే చాలాసార్లు చెప్పాను నన్ను మార్చాలని ట్రై చేయకు అని చెప్తూ.. వెళ్ళిపో అని అంటాడు. అప్పుడు నేను వెళ్ళను నీకే నా మనసు ఉంది. నాకు కూడా ఉంది. మీరు నేను వేరు వేరు అన్న విషయాన్ని నేను ఎప్పుడూ మర్చిపోయాను.. నేను మిమ్మల్ని వదిలి ఎలా వెళ్తాను.. మీకోసం ఇంట్లో వాళ్ళు కంగారు పడుతూ ఉంటారు. మీరు వెళ్తే నేను వెళ్తాను అని అంటుంది. అప్పుడు రిషి లేచి కోపంగా వెళుతూ ఉంటాడు. అప్పుడు వసుధార కూడా తన వెనక వెళ్తూ ఉండగా.. ఎందుకు నాకు కోపం తెప్పిస్తున్నావ్ అని అంటాడు. అప్పుడు మీరు కోప్పడ్డా సరే నేను మీ వెనకే ఉంటా అని అంటుంది. అప్పుడు అంతలో క్యాబ్ అక్కడికి వస్తుంది. నీ కోసం క్యాబ్ బుక్ చేశాను వెళ్ళు అని చెప్తాడు. అప్పుడు వసుధర మనసులో రిషి ని పొగుడుకుంటూ ఉంటుంది. అలా ఎవరింటికి వాళ్లు వెళ్లిపోతారు. కట్ చేస్తే మహేంద్ర, జగతి కంగారుపడుతూ ఉంటారు.

Advertisement

అంతలో దేవయాని వాళ్ల దగ్గరికి వచ్చి ఏంటి ఆలుమగలు ఇద్దరు సైలెంట్ గా ఉన్నారు. ఏం ఆలోచిస్తున్నారు ఏంటి అని ఎటకారంగా మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు జగతి వెళ్లి.. రిషి కోపంగా బయటికి వెళ్లాడు మాకు భయంగా ఉంది మీరు ఫోన్ చేయండి అక్కయ్య మీ ఫోన్ తీస్తాడు అని చెప్తుంది. అప్పుడు నేను చెయ్యను అన్నట్లుగా వెటకారంగా మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు జగతి మిమ్మల్ని అడగడం నాదే తప్పు అని అంటుంది. అంతలో ధరణి వచ్చి చిన్న అత్తయ్య నా ఫోన్ నుంచి చేస్తాను అని అంటుండగా.. దేవయాని తనపై కోప్పడుతుంది. అంతలో రిషి వస్తాడు.. అంతలో గౌతమ్ కూడా వస్తాడు.. అప్పుడు గౌతమ్ ని రిషి రాగానే ఎక్కడికెళ్లావ్ ఏంటి అని విసిగించకు అని గౌతమ్ కి చెప్తుంది దేవయాని.. రిషి చేతికున్న గాయాన్ని చూసి అందరూ కంగారుపడుతూ ఏమైంది అని అడుగుతూ ఉంటారు.. అప్పుడు రిషి నన్ను కాసేపు ఏమీ అడగవద్దు అని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు.. ఇక జగతి మహేంద్ర కూడా అక్కడినుంచి వెళ్ళిపోతారు. దేవయాని గౌతమ్ కూడా నువ్వు కూడా వెళ్తే బాగుంటుంది అని అంటుంది. ఇక రిషి వసుధార అన్న మాటలను గుర్తు చేసుకుంటూ ఉంటాడు.

Advertisement
Guppedantha Manasu 29 september 2022 full episode
Guppedantha Manasu 29 september 2022 full episode

అంతలో వసుధార రిషి దగ్గరికి వస్తుంది. అది చూసిన దేవయాని ఇదేంటి ఇంటికొచ్చి సరాసరి రూమ్ లోకి వెళుతుంది అని అనుకుంటూ ఉంటుంది. ఇప్పుడు వసుధార అన్నం తిన్నారా.. నొప్పి ఎలా ఉంది సార్ అని అడుగుతూ ఉంటుంది. అప్పుడు రిషి భ్రమ అనుకొని నువ్వు మాయమైపోవా.. నువ్వు నిజంగానే వచ్చావా అని అంటారు. అప్పుడు నేను నిజంగా రావటం ఏంటి సార్ అని వసుధార అంటూ ఉంటుంది.. దేవయాని అందర్నీ పిలిచి వసుదారని చూపించడానికి వెళ్తుంది. అప్పుడు దేవయాని వసుధారాన్ని పక్కకు నెట్టి అన్నం తినిపించబోతూ ఉంటుంది. అప్పుడు రిషి నాకు వద్దు పెద్దమ్మ అని అంటూ ఉంటాడు. అప్పుడు అందరూ తినమని అడుగుతూ ఉంటారు. అయినా సరే నాకు వద్దు అని రిషి అంటుండగా… వస్తదారా దేవయాని దగ్గర నుంచి ప్లేట్లు తీసుకొని తనని జరగమని చెప్పి కోప్పడుతూ రిషికి తినిపిస్తూ ఉంటుంది. అందరూ ఆశ్చర్యంగా వసుధార వైపు చూస్తూ ఉంటారు. అప్పుడు రిషి కి తినిపిస్తుంటే తింటూ ఉంటాడు. అప్పుడు జగతి, మహేంద్ర, గౌతమ్, ధరణి సంతోష పడుతూ ఉంటారు. దేవయాని మాత్రం మండిపోతూ ఉంటుంది.

వసుధార రిషి ని చూసుకునే విధానం చూసి అందరూ సంతోష పడిపోతూ ఉంటారు. ఇక వాళ్ళిద్దర్నీ ఒంటరిగా వదిలేయాలని అందరూ బయటికి వెళ్తారు.. ఇక దేవయాని ఇదేంటి ఇలా చేస్తుంది నాకే పనులు చెబుతుంది అని తను కూడా వెళ్ళిపోతుంది. అప్పుడు వసుధార ఒకరి మీద కోపం భోజనం మీద చూపించకండి అని అంటూ ఉంటుంది. అప్పుడు రిషి నువ్వెందుకు వచ్చావు అని అంటూ ఉంటాడు. కోపం ఉన్నచోట ప్రేమ ఉంటుందని మీరే చెప్పారు కదా నాకు రావాలనిపించింది అందుకే వచ్చాను. కోపంలో మీకు మీరే గాయం చేసుకున్నారు అని చేతిని పట్టుకొని చూస్తూ ఉంటుంది. ఇక వాటర్ తాపించి తన చున్నీ తో తన ముతిని తుడుస్తూ ఉండడం చూసి రిషి సంతోష పడిపోతుంటాడు. వసుధార అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే గౌతమ్, జగతి ,మహేంద్ర వసుధార రిషి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు.. రిషి వసుధారాలను కలపడానికి ఒక పెద్ద ప్లాన్ వేస్తూ ఉంటారు. ఇక తర్వాతే ఏం జరిగిందో తెలియాలంటే రేపటి ఎపిసోడ్లో చూడాల్సిందే…

Advertisement