Guppedantha Manasu 30 Sep Today Episode : వసుధార చెప్పకుండా జాబ్ లో జాయిన్ అయినందుకు బాధపడుతున్న రిషి.. జీవితాంతం మీకు అసిస్టెంట్ గా ఉంటా అంటున్న వసుధార…!

Advertisement

Guppedantha Manasu 30 Sep Today Episode : బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్ గుప్పెడంత మనసు ఈ సీరియల్ అభిమానలని ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ ఈరోజు తాజాగా రిలీజ్ అయింది. ఈరోజు ఎపిసోడ్ 569 హైలెట్స్ ఏంటి ఇప్పుడు మనం చూద్దాం… రిషి ని, వసుధారని కలపడానికి గౌతమ్, జగతి, మహేంద్రా ప్లాన్ వేస్తూ ఉంటారు. అప్పుడు మహేంద్ర ఆపరేషన్ రిషిదారా అనే టైటిల్ ని పెడతారు. దేవయాని వాళ్ళను చూస్తూ వీళ్ళు ఏం చేస్తున్నారు ఏం ఆలోచిస్తున్నారు అని అనుకుంటూ ఉంటుంది. రిషి చేతికట్టు విప్పేస్తూ వసుధార అన్న మాటల్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. అంతలో మహేంద్ర వచ్చి నేను ఇప్పుతాను అని ఇప్పుతు ఉంటాడు. అప్పుడు మీరు ఎందుకు డాడ్ కాఫీ తీసుకురావడం నేను వచ్చి తాగుతాను కదా అని అంటాడు అప్పుడు మహేంద్ర నాకెందుకో నీ పక్కనే ఉండాలి.. నీతోనే ఉండాలి.. ఫ్రెండ్ లా ఉండాలి అని అనిపిస్తూ ఉంటుంది అని చెప్తూ ఉంటారు. అప్పుడు రిషి నాక్కూడా అలాగే ఉంటుంది డాడ్ అని చెప్తూ ఉంటారు. అప్పుడు మహేంద్ర వాళ్ళ ప్లాన్లో భాగంగా కాలేజీలో మీటింగ్ ఉంది. నువ్వు రావాలి అని చెప్తూ ఉంటాడు. అప్పుడు సరే డాడ్ వస్తాను. అని అనగానే.. అంతా ఓకే కదా రిషి వస్తావు కదా అని అంటాడు.

Advertisement

అప్పుడు రిషి ఏంటి డాడ్ నేను వస్తాను అని చెప్తున్నాను కదా అని అనగానే సరే అని మహేంద్ర అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.ఇక రిషి కాలేజీకి వచ్చి హార్ట్ బొమ్మను చూసి వసుదార అన్నమాటలు గురించి ఆలోచిస్తూ.. వసుదార నిన్ను నన్ను వేరు చేసేది అమ్మా అన్న మాట అని అంటూ ఉండగా.. అంతలో జగతి అక్కడికి వస్తుంది. ఒక మీటింగ్ కి ఒక ఫైల్ చూడాలి అని చెప్తూ ఉండగా.. నేను తర్వాత చెప్తాను మీరు వెళ్ళండి మేడం అని అంటూ.. వసుధార తను కి పెట్టిన బ్యాడ్జిని చూస్తూ.. సంతోష పడుతూ ఉంటాడు. ఇక తర్వాత అందరూ మీటింగ్ హాల్లో కూర్చుని మిషన్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అంతలో వసుధార లోపలికి రావచ్చా సార్ అని అడుగుతూ ఉంటుంది. అప్పుడు ఆశ్చర్యంగా రిషి చూస్తూ ఉండగా.. సార్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ దగ్గర నుంచి కోఆర్డినేటర్గా వచ్చాను సార్ అని అంటూ ఉంటుంది. అప్పుడు రిషి ఎడ్యుకేషన్ ఆఫీసర్ దగ్గర్నుంచి వచ్చింది నువ్వా అనుకుంటూ లోపలికి రా అని పిలుస్తారు. ఇక అలా వచ్చి వసుధార మిషన్ ఎడ్యుకేషన్ గురించి అంత వివరిస్తూ ఉంటుంది. అప్పుడు అందరూ వసుదారను మెచ్చుకుంటూ ఉంటారు. ఇక అప్పుడు రిషి మొదలు పెడదాం అని చెప్తూ.. వసుధార జాబ్ చేస్తున్న విషయం నాకు చెప్పాలనిపించలేదా అని అనుకుంటూ ఉంటారు. ఇక వసుధార కూడా జాబ్ చేస్తున్న విషయం తనకి చెప్పలేనందుకు బాధపడుతూ ఉంటాడు. అని అనుకుంటూ ఉంటుంది.

Advertisement
Guppedantha Manasu 30 september 2022 full episode
Guppedantha Manasu 30 september 2022 full episode

ఇక ఆ కోపంలో రిషి ఆ బాధ్యతలన్నీ జగతికి అప్పచెప్తాడు. ఇక అప్పుడు వసుదారా మీరే సంతకాలు చేయాలి అని చెప్తూ ఉండగా.. ఒక్కసారిగా లేచి వెళుతుండగా గాయమైన చేతికి మళ్లీ దెబ్బ తగులుతుంది. అప్పుడు అందరూ ఒక్కసారిగా రిషి అని అంటూ ఉంటారు. అప్పుడు ఇట్స్ ఓకే పర్లేదు మీరు వెళ్ళండి అని చెప్తాడు. అప్పుడు అక్కడి నుంచి అందరూ వెళ్ళిపోతారు.. కానీ వసుధార కూడా వెళ్తూ మళ్లీ ఒక్కసారిగా వెనక్కి వచ్చి రిషి చేతిని పట్టుకొని బాధపడుతూ ఉంటుంది.అప్పుడు రిషి ఏం కాదులే వసుదార మనసుకయ్యే గాయం కంటే ఈ గాయం పెద్దది కాదు అని చెప్తూ అక్కడినుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే దేవయాని గౌతమ్ దగ్గరకు వచ్చి గౌతమ్ ని మీరు ఏం మాట్లాడుకున్నారు అని అడుగుతూ ఉంటుంది. అప్పుడు గౌతమ్ ఊహించి వేరే మ్యాటర్ చెబుతూ ఉంటాడు. అప్పుడు దేవయాని రిషి వసుధారాల గురించి ఏమైనా మాట్లాడారా అని అడుగుతుంది. గౌతమ్ మాత్రం అదంతా చెప్పకుండా వేరే మ్యాటర్ చెబుతూ ఉంటాడు. ఇక దేవయాని అప్పుడు అంతే అంటావ అంటూ తన మనసులో గౌతం నీకు అంతా తెలిసి కూడా ఏమీ చెప్పట్లేదు అనుకుంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే రిషి ఎలుతుండగా రిషి వెనుక వసుధర వెళుతూ ఉంటుంది.

ఇక జగతి ,మహేంద్ర వాళ్లని చూస్తూ సంతోష పడతారు. ఇక తర్వాత మహేంద్ర ఎడ్యుకేషన్ మినిస్టర్ కి ఫోన్ చేసి మీరు వసుధారా కి జాబ్ ఇచ్చినందుకు థాంక్స్ అని చెప్తూ మీటింగ్ అయిపోయింది సార్ అని చెప్తూ ఉంటాడు. అప్పుడు మినిస్టర్ వస్తుందార లాంటి అమ్మాయికి జాబ్ ఇవ్వకుండా ఎలా ఉంటాం వజ్రం లాంటి అమ్మాయి వసుధరా. అని వసుధారా ను పొగుడుతూ ఉంటాడు. కట్ చేస్తే రిషి వసుధార నువ్వు మినిస్టర్ దగ్గర జాబ్లో జాయిన్ అవ్వడం ఏంటి.. నాకు చెప్పాలి కదా అని అంటూ ఉంటాడు. అప్పుడు వసుధార ఎగ్జామ్స్ అయిపోయాయి కదా ఖాళీగా ఉండడం ఎందుకు అని నేను జాయిన్ అయ్యాను అని చెప్తూ ఉంటుంది. అప్పుడు రిషి నాకొక మాట చెప్పాలి అనిపించలేదా.. అని అంటాడు. అప్పుడు వసుధార అంటే ఈ జాబ్ నాకు వస్తుందో లేదో అని అనుకున్నాను. నా దగ్గర నువ్వు అసిస్టెంట్ గా పని చేసావ్ తెలుసు గా.. అని అనగానే అప్పుడు జీతం తీసుకుని అసిస్టెంట్గా చేశాను.. కానీ ఇప్పుడు జీతం తీసుకోకుండా జీవితాంతం తోడుగా నడిచే అసిస్టెంట్ పనిచేయాలి అనుకుంటున్నాను అని అంటుంది. ఇక తర్వాతే ఏం జరిగిందో తెలియాలంటే రేపటి ఎపిసోడ్లో ఎదురు చూడాల్సిందే..

Advertisement