Nandamuri HariKrishna : తెలుగు సినిమా చరిత్రలో చిరస్థాయిగా మిగిలిపోయే నటులలో ఎన్టీఆర్ ఒకరు. రాముడు, కృష్ణుడు వేషం వేస్తే ఎన్టీఆర్ మాత్రమే వేయాలి అన్నంతగా ఉండేది. విశ్వ విఖ్యాత నటసార్వభౌముడుగా బిరుదాంకితుడైన ఎన్టీఆర్ అనేక పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలలో వైవిధ్యభరితమైన పాత్రలెన్నో పోషించి తెలుగు ప్రేక్షకుల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. రాముడు, కృష్ణుడు, దుర్యోధనుడు, రావణాసురుడు, భీముడు, కర్ణుడు ఇలా ఎన్నో పౌరాణిక పాత్రలతో తెలుగు వారి హృదయాలలో శాశ్వతంగా, ఆరాధ్య దైవంగా నిలిచిపోయారు దర్శకుడిగా.. నటుడిగా.. కథకుడిగా సత్తా చాటారు.
అయితే ఎన్టీఆర్.. తన కుమారులతో (బాలయ్య-హరికృష్ణ) మాయాబజార్ సినిమాను రీమేక్ చేయాలని భావించారట. తను నటించిన మాయాబజార్ చిత్రం సెన్సేషనల్ హిట్ కావడంతో బాలయ్య,హరికృష్ణతో రీమేక్ చేస్తే బాగుంటుందని ఎంతగానో ఆలోచించారు. అర్జనుడిగా.. కృష్ణుడిగా.. బాలయ్య, హరికృష్ణలను పెట్టి.. ఈ సినిమాకు ప్లాన్ చేసుకున్నారు. ఇందులో శశిరేఖగా.. అప్పటికే హిందీ బెల్ట్‌లోకి వెళ్తున్న ఆలిండియా నెంబర్ 1 హీరోయిన్ శ్రీదేవిని పరిచయం చేయాలని.. వర్ధమాన హీరోయిన్లు గా ఉన్నవారిని ప్రధాన పాత్రల్లోకి తీసుకుని.,ఈ సినిమాని తానే డైరెక్ట్ చేయాలని ఎన్టీఆర్ అనుకున్నారట.

Nandamuri HariKrishna : చివరి కోరిక..
కాని అదే సమయంలో ఆయన రాజకీయాల్లోకి రావడం, ప్రభుత్వం ఏర్పాడు చేయడంతో ఇది కుదరలేదు. ఏవో పనలు అవలన అమెరికాకు వెళ్లడం.. తర్వాత.. రాజకీయ సంక్షోభం.. కారణంగా.. రెండేళ్లపాటు..దీనిపై శ్రద్ధ చూపలేక పోయారు. తర్వాత.. మళ్లీ ఎన్నికలు ఇలా మాయాబజార్ రీమేక్ చేయాలని అనుకున్న సంగతి తర్వాత మరిచిపోయారు. అయితే ఈ సినిమాను తమ సొంత బేనర్.. రామకృష్ణా సినీ స్టూడియోపైనే తీయాలని అనుకోవడం మరో విశేషం. అయితే హరికృష్ణ కూడా ఆ రీమేక్‌లో నటించాలనే కోరిక ఎంతో ఉండేది. కాని అది తీరకుండానే ఆయన కన్నుమేసారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ వంటి వారు కూడా ఇప్పుడు ఆ కథను టచ్ చేయలేరు అంటే ఇక అది అలా మరుగున పడినట్టే అని చెప్పుకోవాలి.