Hebah Patel : హెబ్బా పటేల్ గురించి తెలుసు కదా. కుమారి 21 ఎఫ్ అనే సినిమాతో ఒక్కసారిగా తనేంటో నిరూపించుకుంది. అంతకుముందు చాలా సినిమాల్లో నటించినా తనకు అంత గుర్తింపు రాలేదు. కానీ.. కుమారి సినిమాతో ఒక్కసారిగా తెలుగు ఇండస్ట్రీలో తన పేరు మారుమోగిపోయింది. కుమారి 21 ఎఫ్ సినిమాలో తన గ్లామర్ షోను చూసి కుర్రకారు ఏమాత్రం ఆగలేకపోయారు. తెలుగు ఇండస్ట్రీలో ఆ తర్వాత తను నటించిన చాలా సినిమాలు హిట్ అయ్యాయి. ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమా హిట్ తో ఇక తెలుగు ఇండస్ట్రీలో తన స్థానాన్ని పదిలం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ.
ఆ తర్వాత హెబ్బా పటేల్ చాలా సినిమాలో హీరోయిన్ గా, ఐటెమ్ సాంగ్స్ లోనూ నటించింది.ఇటీవల ఆహా ఓటీటీలో రిలీజైన ఓదెల రైల్వే ష్టేషన్ సినిమా తెలుసు కదా. ఆ సినిమాలో హెబ్బా పటేల్ డీ గ్లామర్ రోల్ లో నటించింది. ఆ సినిమాలో కూడా తన నటనతో అందరినీ ఆకట్టుకుంది. తను కేవలం సినిమాల్లో నటించడం, గ్లామర్ పాత్రలు పోషించడమే కాదు.. సోషల్ మీడియాలోనూ తను ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన గ్లామర్ ను ప్రదర్శిస్తూ ఉంటుంది. పొట్టి పొట్టి డ్రెస్సులు వేస్తూ అందాలు ఆరబోస్తూ కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తుంది హెబ్బా.

Hebah Patel : ఓదెల రైల్వే స్టేషన్ సినిమాలో డీ గ్లామర్ రోల్ పోషించిన హెబ్బా పటేల్
అందుకే తను అంటే అంత క్రేజ్. తనకు ఉన్న క్రేజ్ అటువంటిది. ఇటీవల రెడ్ కలర్ డ్రెస్ లో అందాలు ఆరబోసిన ఫోటోలు వైరల్ అయిన విషయం తెలిసిందే కదా. తాజాగా ఎల్లో కలర్ చీర కట్టుకొని క్లాస్ లుక్ తో ఫోటోలకు పోజులిచ్చింది హెబ్బా పటేల్. చీరలోనూ తన అందాలను ప్రదర్శించి కుర్రకారును రెచ్చగొట్టింది హెబ్బా. తన డీసెంట్ లుక్ ఫోటోలు చేసి నెటిజన్లు ఆగలేకపోతున్నారు. ఏంటి హెబ్బా.. కుర్రాళ్లను ఇలాగైనా ప్రశాంతంగా బతకనీయవా అంటూ కామెంట్లు చేస్తున్నారు. దీంతో హెబ్బా లేటెస్ట్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.