Hebbah Patel : కుమారి 21ఎఫ్’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసులు దోచుకున్న అందాల ముద్దుగుమ్మ హెబ్బా పటేల్. తొలి సినిమాతోనే తన గ్లామర్, నటతో మెస్మరైజ్ చేసిందీ బ్యూటీ. ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ కొత్త కొత్త ఫోటోషూట్ తో ప్రేక్షకులను ఆనందింపజేస్తుంది. ఈ అమ్మడు కుమారి 21ఎఫ్ చిత్రం తర్వాత పలు సినిమాలు చేసిన కూడా పెద్దగా విజయాలు సాధించకపోవడంతో ఈ అమ్మడి పరిస్థితి దారుణఃగా మారింది. ఈడోరకం ఆడోరకం, ఎక్కడికి పోతావు చిన్నవాడా లాంటి సినిమాల్లో నటించినా కూడా హెబ్బాకు కావాల్సిన రేంజ్ ఇమేజ్ అయితే రాలేదు.
హెబ్బా ఆ మధ్యన రామ్ రెడ్ మూవీలో స్పెషల్ సాంగ్ తో హీటెక్కించింది. హెబ్బా నటించిన మిస్టర్, అంధగాడు లాంటి చిత్రాలు నిరాశపరిచాయి. మంచి అంచనాలతో విడుదలైన ఈ మూవీస్ పరాజయం కావడం హెబ్బాకు మైనస్ గా మారింది. అవకాశాలు పెద్దగా రాకపోవడంతో ఈ ముద్దుగుమ్మ అందాల ఆరబోతతో నానా రచ్చ చేస్తూ కుర్రకారు హృదయాలు కొల్లగొడుతుంది. తాజాగా తన క్యూట్ లుక్స్ షేర్ చేస్తూ యువతకి పిచ్చెక్కిస్తుంది. మోడ్రన్ డ్రెస్సులు, చిట్టి పొట్టి బట్టలలో అందాలు ఆరబోస్తూ హెబ్బా పటేల్ పాపులర్ అయింది.

Hebbah Patel : అదిరిందమ్మా..
తాజాగా హెబ్బా పటేల్ అందమైన రెడ్ శారీలో వయ్యారాలు ఒలకబోస్తూ కనువిందు చేస్తోంది. ఇవి నెటిజన్స్‌ని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.తాజా పిక్స్ లో అందాల దేవతలా హెబ్బా వయ్యారంగా నిలుచుని ఇస్తున్న ఫోజులు చూపు తిప్పుకోలేకుండా ఉన్నాయి. స్లీవ్ లెస్ బ్లౌజ్ లో హెబ్బా పటేల్ కొంగు కొంచెం పక్కకి జరిపి అదరహో అనిపిస్తోంది. ఈ పిక్స్ చూసి అబ్బా ఏందబ్బా అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అమ్మడి అందాలకు పిచ్చెక్కిపోతున్నారు. ప్రస్తుతం హెబ్బా పిక్స్ తెగ వైరల్ అవుతున్నాయి. హెబ్బా పటేల్ చివరగా ఓదెల రైల్వేస్టేషన్ చిత్రంలో డీ గ్లామర్ రోల్ లో నటించింది.