Nani : స్మార్ట్ ఫోన్లు వచ్చాక ఈ జనరేషన్ జీవితమే మారిపోయింది. నేటి యూత్ స్మార్ట్ ఫోన్లకే అతుక్కుపోతున్నారు. సినీ ఇండస్ట్రీలో కూడా ఈ స్మార్ట్ ఫోన్ల వల్లనే సినిమాలు రిలీజ్ కాకముందే లీక్ అవుతున్నాయి. ఇది ఒక్క ఇండస్ట్రీకే కాదు.. అన్ని ఇండస్ట్రీలలో లీకుల సమస్య ఉంది. పవన్ కళ్యాణ్ మూవీ అత్తారింటికి దారేది ఫస్ట్ హాఫ్ మొత్తం విడుదలకు ముందే లీక్ అయింది. సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. ఆ తర్వాత చాలా సినిమాలు లీక్ అయ్యాయి. కొన్ని సినిమాలు రిలీజ్ కు ముందే లీక్ కావడంతో అంతగా బాక్సాఫీసు వద్ద ఆడలేకపోయాయి.
సోషల్ మీడియాలో పలు సినిమా సీన్స్, ఫైటింగ్ సీన్స్ ను లీక్ చేస్తూ మూవీ యూనిట్ కు షాకిస్తుంటారు లీకు రాయుళ్లు. ఎవరో లీకురాయుళ్లు సినిమాను లీక్ చేస్తే ఎవ్వరూ ఏం చేయలేరు కానీ.. తను నటించే సొంత సినిమాను ఏ హీరో అయినా లీక్ చేసుకుంటారా? చెప్పండి. ఎవ్వరూ లీక్ చేయరు కదా. కానీ.. ఓ హీరో మాత్రం తన సొంత సినిమానే లీక్ చేసుకున్నాడు. ఇంతకీ ఆ హీరో ఎవరంటారా? నాచురల్ స్టార్ నాని.

Nani : నాని తదుపరి మూవీ దసరా
నాని ప్రస్తుతం దసరా అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా 2023 లో సమ్మర్ కానుకగా రిలీజ్ కానుంది. నాని మాత్రం ఈ సినిమా పైనే ఎక్కువ ఆశలు పెట్టుకున్నాడు. దసరా కానుకగా ఈ సినిమాకు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేస్తామని మూవీ టీమ్ చెప్పుకొచ్చింది. తీరా 3 వ తారీఖున ఎలాంటి ప్రోమోను విడుదల చేయలేదు. దీంతో నాని ఫ్యాన్స్ చాలా బాధపడ్డారు. అయితే.. హీరో నాని తన ఫ్యాన్స్ ను మెప్పించడం కోసం ఏకంగా తన సినిమాకు సంబంధించిన వీడియోను తానే లీక్ చేశాడు. ప్రోమో లేదు కాబట్టి నేనే నా ఫోన్ లో రికార్డు చేసిన ఓ వీడియోను లీక్ చేస్తున్నా అంటూ చెప్పుకొచ్చాడు నాని. రేపటి సంది దుమ్మ లేశిపోద్ది అంటూ క్యాప్షన్ పెట్టి ఓ సాంగ్ లో డ్యాన్స్ చేస్తున్న విజువల్స్ ను నాని లీక్ చేస్తాడు. దీంతో నాని లీక్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నీ సినిమా ప్రమోషన్స్ కోసం నీ సినిమాను నువ్వే లీక్ చేసుకున్నావా? ఇలాంటి సినిమా ప్రమోషన్స్ కూడా చేస్తారా? అంటూ కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Since @odela_srikanth says no promo. Leaking something I recorded in my phone while we filmed the song 🙂
రేపటి సంది దుమ్ము లేశిపోద్ది pic.twitter.com/OQeevCqdD1
— Nani (@NameisNani) October 2, 2022