Heroine : అంకిత అంటే అందరికి వెంటనే స్ట్రైక్ కాకపోవచ్చు కాని సింహాద్రి అంటే ఠక్కున గుర్తు పట్టేస్తారు. ఆమె ఎవ్వరూ ఊహించిన విధంగా మోడలింగ్ లోకి వచ్చి ఆ తర్వాత చిన్న చిన్న యాడ్స్ ద్వారా జనాలకు పరిచయమైంది . అంకితను జనాలకు పరిచయం చేసింది రస్నా యాడ్. అంకిత మొదటిసారి టాలీవుడ్ లో లాహిరి లాహిరి లాహిరిలో సినిమాలో నటించారు. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో అంకిత వరుస ఆఫర్ లను అందుకున్నారు. ఈ సినిమా తరవాత అంకిత రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటించిన సింహాద్రి సినిమాలో హీరోయిన్ గా నటించారు.
ఈ సినిమాతో ఒక్కసారిగా అంకిత పేరు సినీ ఇండస్ట్రీలో మారుమ్రోగిపోయింది. వరుస అవకాశాలు వచ్చాయి . కానీ అంకిత తన హెడ్ వెయిట్ కారణంగా కొన్ని సినిమాలను రిజెక్ట్ చేసింది . ఈ క్రమంలోనే ఆమె చెడు వ్యసనాలకు బానిసయింది. స్మోకింగ్ చేయడం ..డ్రింకింగ్ చేయడం అలవాటుగా మార్చుకుంది. ముఖ్యంగా నైట్ మూడు పెగ్గులు వేస్తే గాని నిద్ర రాని పొజిషన్ కి చేరుకునేసింది .ఆమె పరిస్థితిని చూసిన తల్లిదండ్రులు తెగ బాధపడిపోయి ఆమెను రిహాబిటేషన్ సెంటర్లో చేర్పించారట. ఇక తర్వాత ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేయగా ,ప్రస్తుతం భర్త పిల్లలతో సంతోషంగా గడుపుతుందట.

Heroine : అంకిత అలా దూరమైందా..
పూణెకు చెందిన విశాల్ ఝాటక్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది అంకిత. ఇక పెళ్లి తర్వాత వీరిద్దరికీ ఓ బాబు జన్మించాడు. దాంతో ఫ్యామిలీ లైఫ్ లో బిజీ అయిపోయింది. అంతేకాకుండా అంకిత ఇప్పుడు వజ్రాల వ్యాపారం చేస్తుంది. తన తండ్రికి చెందిన వజ్రాల వ్యాపారాన్ని అంకిత నడిపిస్తుంది. అయితే ఈమధ్య తన లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. అంకిత అప్పటికి ఇప్పటికీ చాలా మారిపోయింది అని చూసినవాళ్లంతా అనుకుంటున్నారు. బొద్దుగా మారి గుర్తు పట్టలేనంత దారుణంగా మారింది.