Angelina Jolie :హాలీవుడ్ స్టార్ ఏంజెలీనా జోలి… తన భర్త అయినా బ్రాడ్ పిట్ నుంచి విడాకులు తీసుకున్న సంగతి తేలిసిందే. అయితే దీనికి గల కారణాలను స్వయంగా వెల్లడించింది ఏంజెలీనా జోలి. అయితే ఇటీవల తన భర్తకు వ్యతిరేకంగా పత్రాలను కోర్టులో దాఖలాలు చేసింది. దీనిలో భాగంగా తన మాజీ భర్త బ్రాడ్ పిట్ తమ ఆరుగురు పిల్లల్లో ఒకరిని హింసించాడని, మరొకరి మొహంపై కొట్టాడని ఆరోపించింది.అలాగే తన జుట్టు పట్టుకుని గోడకు కొట్టాడని పేర్కొంది. 2016లో జరిగిన ఈ హింసాత్మక వాగ్వివాదాన్ని ఏంజెలీనా జోలి సవివరంగా కోర్టుకు తెలియజేసింది. తన భర్తతో విడాకులు కోరుకోడానికి గల కారణం ఇదే అని తెలియజేసింది.
అలాగే 2016లో ఓ ప్రైవేట్ జెట్ లో జరిగిన కొన్ని సంఘటనలను షేర్ చేసుకుంది ఏంజెలీనా జోలి. ది న్యూ యార్క్ టైమ్స్ నివేదిక ప్రకారం.ఫ్రాన్స్ నుండి కాలిపోర్నియాకు వెళ్లే విమానంలో తన భర్త ప్రవర్తన తన పిల్లల ఏడుపుకు మరియు వారి మోచేతులకు గాయాలయ్యడానికి కారణం అని జోలి పేర్కొంది. అలాగే ఆ గొడవలో తన పై మరియు తన పిల్లల పై బీర్ ను పోసి అసభ్యకరంగా ప్రవర్తించాడని పేర్కొంది.

అలాగే మరో కౌంటర్ స్యూ పత్రాలకు సంబంధించిన వివరాలను కూడా షేర్ చేసింది ఏంజెలీనా జోలి. పిల్లల్లో ఒకరు జోలిని సమర్ధించగా తన భర్త వారి పైకి దాడికి వెళ్ళాడని అతని ఆపడానికి వెనుక నుండి పట్టుకున్నానని తెలిపింది.లాస్ ఏంజెల్స్ సుప్రీంకోర్టులో దాఖలాలు చేసిన పత్రాలను జోలి పరిస్థితులను , తనకి అవసరమైన సమయంలోనే బహిర్గతం చేస్తానని తెలిపింది. ఇక వీరిద్దరి విడాకులు వ్యవహారం ఏళ్ల తరబడి కొనసాగుతూ వస్తుంది. దీనివలన వీరి ఇరువురి కెరియర్ చాలా ఇబ్బందిగా మారింది.