The Ghost : టాలీవుడ్ కింగ్ నాగార్జున ప్రస్తుతం చాలా బిజీ అయిపోయారు. వరుస సినిమాలతో బిజీబిజీగా గడుపుతున్నారు. నాగార్జున నటించిన ది ఘోస్ట్ మూవీ ఇటీవల విడుదల అయిన విషయం తెలిసిందే. దసరా సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు కూడా టాక్ మంచిగానే వచ్చింది. బాక్సాఫీసు ముందు మంచి వసూళ్లే చేస్తోంది. ఈ సినిమాను ప్రవీణ్ సత్తారు డైరెక్ట్ చేశాడు. ఇప్పటి వరకు నాగార్జున ఇలాంటి జానర్ లో చాలా సినిమాల్లో నటించడంతో ఈ సినిమాలో నటించడం నాగార్జునకు ఈజీ అయిపోయింది.
ఈ సినిమాలో నాగార్జున సరసన సోనాల్ చౌహాన్ నటించింది.ఈ సినిమాతో పాటు గాడ్ ఫాదర్ సినిమా కూడా దసరా కానుకగా ఒకే రోజు విడుదల అయినప్పటికీ రెండు సినిమాలకు తెలుగు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్సే వస్తోంది. అయితే.. ఈ సినిమా సక్సెస్ కావాలంటే ఎంత రాబట్టాలి.. బ్రేక్ ఈవెన్ ఎంత.. గ్రాస్ ఎంత అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సినిమా సక్సెస్ కావాలంటే.. నైజాం ఏరియాలో రూ.5.59 కోట్లు రావాలి.

The Ghost : నైజాంలో కనీసం రూ.6 కోట్లు రావాలి
సీడెడ్ లో రూ.2.50 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ.2.25 కోట్లు, ఈస్ట్ లో రూ.1.50 కోట్లు, వెస్ట్ లో రూ.1.40 కోట్లు, గుంటూరులో రూ.1.60 కోట్లు, కృష్ణలో రూ.1.40 కోట్లు, నెల్లూరులో రూ.65 లక్షలు, ఏపీ, తెలంగాణ మొత్తంలో రూ.16.80 కోట్లు రావాల్సి ఉంది. ఇక రెస్ట్ ఆఫ్ ఇండియాలో చూసుకుంటే రూ.4 కోట్లు రావాలి. ఓవర్సీస్ లో రూ.2 కోట్లు రావాలి. ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ బిజినెస్ రూ.22.80 కోట్లు జరిగినట్టు తెలుస్తోంది. మొత్తం కలిపి ఈ సినిమా సక్సెస్ కావాలంటే రూ.23 కోట్లను రాబట్టాల్సి ఉంటుంది. చూద్దాం మరి ఈ సినిమా అన్ని కలెక్షన్లను రాబడుతుందో లేదో?