Ram Charan : సౌత్ స్టార్ డైరెక్టర్ శంకర్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఆయన సినిమాలు ఎంత రిచ్ గా ఉంటాయనేది మనందరికి తెలిసిందే. ఈ మధ్యనే “ఆర్ఆర్ఆర్” సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో ఇప్పుడు శంకర్ భారీ బడ్జెట్ చిత్రం చేస్తున్నాడు. ఆర్సీ15 అనే టైటిల్ తో ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.
రాంచరణ్ కరియర్ లో 15వ సినిమాగా తెరకెక్కనున్న ఈ సినిమా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై రాబోతున్న 50వ ప్రాజెక్ట్ కూడా.ఈ సినిమాలోని ఓ సాంగ్ కోసం న్యూజిలాండ్ వెళ్లబోతున్నారట. అంతేకాదు సాంగ్ కోసం భారీగా ఖర్చు పెడుతున్నారట. భారీగా అంటే అలా ఇలా కాదు.. ఏకంగా రూ.23 కోట్లు ఖర్చు పెట్టి ఇప్పటి వరకు ఇండియన్ సినిమాల్లోనే తెరకెక్కించనంత గ్రాండియర్‌గా చేయబోతున్నారని టాక్. ఇందులో నిజా నిజాలేంటో కానీ.. అన్ని కోట్లు ఖర్చు పెట్టి ఇప్పటి వరకు ఇండియన్ సినిమాల్లోనే తెరకెక్కించనంత గ్రాండియర్‌గా చేయబోతున్నారని టాక్. ఇందులో నిజా నిజాలేంటో కానీ.. అన్ని కోట్లు ఖర్చు పెట్టటం అంటే మామూలు విషయమైతే కాదు.

Ram Charan : అంత భారీ ఖర్చుతోనా..
ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఒక హై వోల్టేజ్ యాక్షన్ సీన్ ను కూడా ప్లాన్ చేశారట. కేవలం ఈ ఒక్క సన్నివేశం కోసమే నిర్మాతలు 10 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. త్వరలోనే ఈ యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్ జరగబోతోంది. దాదాపు 1000 మంది ఫైటర్లు ఈ సన్నివేశంలో పాల్గొనబోతున్నారు. ఇక ఈ సన్నివేశం సినిమాకి హైలైట్ గా మారుతుందని సమాచారం. అంజలి, శ్రీకాంత్ తదితరులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. రామ్ చరణ్‌తో తొలిసారి తొలి తమిళేతర దక్షిణాది హీరోతో శంకర్ సినిమా చేస్తున్నారు. వీళ్లిద్దరి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్నిదిల్ రాజు భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ తొలిసారి త్రిపాత్రాభినయం చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి. రామ్ చరణ్.. తండ్రి.. ఇద్దరు కుమారులుగా నటించబోతున్నట్టు సమాచారం.