Prabhas : ప్రభాస్ కి ఈ విషయం తెలిస్తే ఏమైనా ఉందా.. గుండె బద్దలు అవ్వదా ?

Advertisement

Prabhas : అభిమానులు తమ హీరోలను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తారు. వారికోసం ఏం చేయడానికి అయినా సిద్ధపడతారు. ఒక్కోసారి అభిమానుల ప్రేమ హద్దులు తాటుతుంటుంది. తమ హీరో పై ఉన్న అభిమానంతో ఇతరులకు ఎలాంటి నష్టం జరుగుతుందనేది ఆలోచించకుండా వారి ఇష్టానుసారం ప్రవర్తిస్తారు. ఇక పాన్ ఇండియా స్టార్ట్ అయిన ప్రభాస్ అభిమానుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభాస్ అంటే అభిమానులకే కాకుండా సగటు ప్రేక్షకుడికి కూడా చాలా ఇష్టం. ఎందుకంటే ప్రభాస్ వ్యవహరించే తీరు అలా ఉంటుంది కాబట్టి.

Advertisement

అయితే ఇటీవల అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టినరోజు కానుకగా ప్రభాస్ నటించిన స్టైలిష్ మూవీస్ ను ప్రదర్శించారు. ఈ క్రమంలో బిల్లా సినిమాను పలు ప్రాంతాలలో ప్రదర్శించారు. ఈ క్రమంలో ఓ థియేటర్ లో మంటలు అంటించారు ప్రభాస్ ఫ్యాన్స్. ఇక వివరాల్లోకెళ్తే. ప్రస్తుత కాలంలో హీరోల కెరియర్లో బిగ్గెస్ట్ హిట్ ను అందించిన సినిమాలను రీ రిలీజ్ పేరుతో 4k లో రిలీజ్ చేస్తున్నారు. ఇక ఇటీవల ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా పలు ప్రాంతాలలో ప్రభాస్ కెరియర్లో బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచిన, బిల్లా మరియు రెబల్ సినిమాలను ప్రదర్శించారు. ఈ క్రమంలో పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన తాడేపల్లిగూడెం పట్టణంలోని వెంకటరామ థియేటర్లో ,ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బిల్లా సినిమాను రీ రిలీజ్ చేశారు.

Advertisement
if prabhas knows about her fans rude behavior
if prabhas knows about her fans rude behavior

ఇక ఈ సినిమాలోని యాక్షన్స్ సీన్ల గురించి మనకు తెలిసిందే. ఇక ఈ సినిమా ప్రదర్శిస్తుండుగా యాక్షన్ సీన్స్ వచ్చినప్పుడు కొందరు యువకులు బాణ సంచాలను థియేటర్లోనే కాల్చారు. దీంతో థియేటర్ లో మంటలు చెలరేగాయి. కొన్ని సీట్లకు మంటలు అంటుకుని పాక్షికంగా కాలిపోయాయి. .ఇక ఒక్కసారిగా థియేటర్లో మంటలు రావడంతో హాల్ మొత్తం పొగతో నిండిపోయింది. దీంతో హాల్లోని ప్రేక్షకులు భయం తో థియేటర్ ను వదిలి బయటకు పరుగులు తీశారు. ఇంత జరిగిన ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రమే వెనక్కి తగ్గకుండా మరింత రచ్చ చేశారు. దీంతో పలువురు ఈ అంశంపై మండిపడుతున్నారు. అభిమానం ఉండాలి కానీ ప్రాణాలు మీదకు తెచ్చుకునే అంతలా ఉంటే ఎప్పటికైనా నష్టపోయేది వారే అని పలువురు కామెంట్ చేస్తున్నారు. ఇక ఇప్పుడు ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Advertisement