Bigg Boss 6 Telugu : బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ షో ప్రేక్షకులని ఎంతగా అలరిస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగుతో పాటు పలు భాషల్లో ఈ షో సూపర్ రెస్పాన్స్ అందుకుంటోంది. తెలుగులో విజయవంతంగా ఐదు సీజన్స్ పూర్తి చేసుకొని ఆరో సీజన్ లోకి అడుగుపెట్టింది. నాగార్జున హోస్ట్‌గా సెప్టెంబర్ 4 నుంచి ఈ షో మొదలైంది. గత ఐదు సీజన్లు విజయవంతం కావడంతో ఆరో సీజన్ పై ఓ రేంజ్ బజ్ నెలకొంది. దీంతో ప్రేక్షకుల అంచనాలు రీచ్ అయ్యేలా అంతా పక్కాగా ప్లాన్ చేసి రంగంలోకి దిగాడు బిగ్ బాస్. రోజురోజుకి ఈ షో రసవత్తరంగా మారుతుంది. కంటెస్టెంట్స్ తమ సత్తా చాటుతూ అదరగొడుతున్నారు. మునుపెన్నడూ లేనివిధంగా ఈసారి హౌస్ లోకి 21 మంది కంటెస్టెంట్లు పార్టిసిపెంట్స్ గా ఎంట్రీ ఇచ్చారు.
మొదటివారం అందరికీ షాక్ ఇస్తూ ఒక్కరిని కూడా బిగ్ బాస్ యాజమాన్యం ఎలిమినేట్ చేయలేదు. కానీ రెండో వారంలో ఎవరూ ఊహించని విధంగా ఇద్దరు కంటెస్టెంట్లను, హౌస్ లోపల నుంచి ఎలిమినేట్ చేశారు. షానీ సాల్మన్ అలాగే అభినయశ్రీ ఇద్దరినీ డబుల్ ఎలిమినేషన్ చేసి శని, ఆదివారాలలో ఇంటికి పంపేశారు. చివరిగా చంటి ఎలిమినేట్ అయ్యాడు.అయితే ఈ వారం ఎవరు ఎలిమినేట్ కానుందనే దానిపై ఆసక్తి నెలకొంది. ఈ వారం బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అవ్వబోయేది రామ్ గోపాల్ వర్మ దెబ్బతో ఒక్కసారిగా క్రేజ్ తెచ్చుకున్న ఇనయా సుల్తానా అని తెలుస్తోంది.

Bigg Boss 6 Telugu : ఇనయ ఔట్..
రాంగోపాల్ వర్మ కూడా ఆమెకు ఓట్ చేయాల్సిందిగా సోషల్ మీడియా వేదికగా కోరారు. అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఇనయా సుల్తానా హౌస్ నుంచి ఎలిమినేట్ అవ్వడం ఖాయమని అంటున్నారు. ఎప్పుడో ఇనయ ఎలిమినేట్ అవ్వాల్సి ఉన్నా ఇనయ మెల్లమెల్లగా ఇక్కడి వరకు వచ్చింది. ఈ వారం ఆమె ఎలిమినేట్ కావడం పక్కా అని తెలుస్తుంది. ఒకవేళ ఇనయ ఎలిమినేట్ కాని పక్షంలో రాజశేఖర్ అవుతాడని చెప్పుకొస్తున్నారు. మరి రామ్ గోపాల్ వర్మ చేసిన ప్రమోషన్స్ ఎంత వరకు సఫలం అవుతాయో చూడాలి.