Mahesh Babu Mother Indira Devi : సూపర్ స్టార్ కృష్ణ సతీమణి ఇందిరా దేవి ఈ రోజు తుదిశ్వాస విడిచారని తెలియగానే ఘట్టమనేని కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు శోకసంద్రంలో మునిగారు. ఇందిరా దేవి ..కృష్ణకు మరదలు వరుస. సినిమాలు చేసే సమయంలో కుటుంబ సభ్యులు చెప్పడంతో పెళ్లి చేసుకున్నారు. ఇందిరా తెలంగాణలోని ఖమ్మం జిల్లాలోని ముసళ్లమడుగు గ్రామ ఆడపడుచు. మహేష్ కూడా చిన్నప్పుడే ముసళ్లమడుగులోని అమ్మమ్మ ఇంటి వద్ద కూడా కొద్ది రోజుల పాటు పెరిగాడు. పెళ్లి తర్వాత ఆమె కొద్ది రోజులు గుంటూరు జిల్లా తెనాలి మండలం బుర్రిపాలెంలో ఉన్నారు.
కృష్ణ-ఇందిరాదేవి దంపతులకు ఐదుగురు సంతానం ఉన్నారు. వీరిలో ఇద్దరు కుమారులు కాగా… ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. రమేశ్ బాబు, మహేశ్‌బాబు, పద్మావతి, మంజుల, ప్రియదర్శిని ఉన్నారు. కృష్ణ – ఇందిర దంపతుల పిల్లల్లో పెద్ద కుమారుడు రమేష్ కొన్ని సినిమాల్లో హీరోగా చేసి.. ఆ తర్వాత నిర్మాతగా మారారు. అనారోగ్యంతో ఈ ఏడాది మొదట్లో కన్నుమూసారు. ఆయన మరణంతో ఇందిరా చాలా కుంగిపోయింది. ఇక ఆమె కుమార్తెల్లో పెద్ద కుమార్తె పద్మావతి గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ భార్య. వీరి కుమారుడు గల్లా అశోక్ కూడా ఇటీవలే హీరో సినిమాతో కథానాయకుడిగా మారాడు. ప్రియదర్శిని భర్త సుధీర్‌బాబు కూడా టాలీవుడ్లో హీరోగా ఉన్నాడు.

Mahesh Babu Mother Indira Devi : ఇంట్రెస్టింగ్ విషయాలు..
ఇక మంజుల గతంలో నటిగా, నిర్మాతగాను రాణించింది. ఇందిరా పిల్లలు అందరు కూడా మంచి స్థానాలలో నిలదొక్కుకున్నారు. కృష్ణ,విజయ నిర్మాలకి పిల్లలు లేరు. నరేష్ విజయ్ నిర్మల మొదటి భర్త కొడుకు అనే విషయం తెలిసిందే. ఇందిరాదేవి తుదిశ్వాస విడిచారనే విషయం విచారం కలిగించిందని పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ అన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తున్నానని చెప్పారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇందిరాదేవి గారు స్వర్గస్తులయ్యారనే వార్త ఎంతో కలచివేసింది. ఆ మాతృదేవత ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. సూపర్‌స్టార్ కృష్ణ గారికి, సోదరుడు మహేశ్‌బాబుకు, కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను ” అని చిరంజీవి ట్విటర్లో పేర్కొన్నారు.