Intinti Gruhalakshmi 03 Oct Today Episode : తులసి ప్లేసులో నందుని అపాయింట్ చేసిన సామ్రాట్… జాబ్ రిజైన్ చేస్తున్న తులసి..!

Advertisement

Intinti Gruhalakshmi 03 Oct Today Episode : బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్ ఇంటింటి గృహలక్ష్మి ఈ సీరియల్ ప్రేక్షకులని బాగా ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ ఈరోజు తాజాగా రిలీజ్ అయింది. ఈరోజు ఎపిసోడ్ 753 హైలెట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం… తులసి కూర్చొని కూరగాయలు కట్ చేస్తూ ఉంటుంది. కానీ అనసూయ మనసులో తులసి ని జాబ్ మానేయమని సామ్రాట్ చెప్పాడా.. చెప్తే ఎంత ప్రశాంతంగా ఎలా ఉంది. అసలు నా మాటలు పట్టించుకోలేదు.. అంటే వీళ్లిద్దరి మధ్య బయట వాళ్ళు అనుకునే సంబంధం ఉందా.. అని అలా మనసులో అనుకుంటూ ఉంటుంది. తులసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అంతలో అభి అక్కడికి వచ్చి అనసూయని ఏం చేశావు నాయనమ్మ నేను చెప్పింది. అని అడుగుతూ ఉంటాడు. నేను నువ్వు చెప్పినట్టే చేశాను రిజల్ట్ కోసం ఎదురుచూడు అని మళ్ళీ పాపం నేను చాలా కష్టపడుతున్నాను. ఇలాంటి రోజు ఒకటి వస్తుందని నేను ఊహించలేదు నా కొడుకుకి ఇచ్చి పెళ్లి చేసి నేను పెద్ద తప్పు చేశాను. మళ్లీ ఇప్పుడు చాలా కష్టాలు పడుతుంది అని బాధపడుతూ ఉంటుంది. అంతలో తులసి అక్కడికి వస్తుంది. అప్పుడు వాళ్లు వాళ్ల మాటలు విన్నారేమోనని భయపడుతూ ఉంటారు. కానీ తులసి ఏమీ అనదు.. ఏమైంది అత్తయ్య గారు అని అడుగుతుండగా…

Advertisement

అభి అనసూయ మాట దాటేస్తారు. అనసూయ అప్పుడు తులసిని నువ్వు రేపు ఆఫీస్ కి వెళ్ళాలా అని అడుగుతూ ఉంటుంది. అప్పుడు తులసి అదేంటి అత్తయ్య అలా అడుగుతున్నారు. వెళ్ళాలి అని చెప్తుంది. కట్ చేస్తే సామ్రాట్ అనసూయ అన్నమాటల్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. అంతలో అక్కడికి సామ్రాట్ వాళ్ళ బాబాయ్ వచ్చి నువ్వు తులసి తో ఎందుకు అలా బిహేవ్ చేసావ్ తనపై ఎందుకు కోప్పడ్డావ్ నువ్వు ఎవరితో ఎలా మాట్లాడినా నేను పట్టించుకోను కానీ తులసితో అలా మాట్లాడితే నేను ఊరుకోను తులసి ఎంత బాధపడిందో తన మొహాలను కనిపించింది. అసలు నువ్వు ఎందుకు ఇలా మారావ్ పద్ధతి మార్చుకో ఇకనుంచైనా అది నేర్చుకో అని చెప్తూ ఉంటారు. అప్పుడు సామ్రాట్ ఇప్పుడిప్పుడే ఎవరితో ఎలా ఉండాలి. అని నేర్చుకుంటున్నాను అని బాధపడుతూ ఉంటాడు. అప్పుడు సామ్రాట్ వాళ్ళ బాబాయ్ వాడు ఏం చేయబోతున్నాను. సలహా ఇచ్చాను ఏం జరగబోతుంది. అని అనుకుంటూ ఉంటాడు. కట్ చేస్తే లాస్య తులసి ఫైల్స్ మీద సంతకం చేస్తూ ఉండగా.. నీకు ఒకళ్ళు చూసి చెప్తే నువ్వు చేస్తున్నావ్ అని కుళ్ళుకుంటూ నీ పని అయిపోయింది. మేడం అని అనుకుంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఝాన్సీ అనే అమ్మాయి దొంగ ఫైల్స్ మీద సంతకం పెట్టిస్తుంది.అంతలో అక్కడికి సామ్రాట్ వచ్చి తులసిని చాటుగా చూస్తూ ఉంటాడు.

Advertisement
intinti gruhalakshmi 03 october 2022 full episode
intinti gruhalakshmi 03 october 2022 full episode

అప్పుడు తులసి ఒక్కసారిగా సామ్రాట్ వైపు చూడగానే సామ్రాట్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే అనసూయ హనీ బర్త్డేకి ఏ చీర కట్టుకోవాలని అనుకుంటూ ఉండగా.. అక్కడికి అభి వచ్చి నువ్వేం చేస్తున్నావ్ నాయనమ్మ పార్టీకి వెళ్ళడమేంటి నూనె ఏం చెప్పావు ఏం చేస్తున్నావ్ అని ఇద్దరు ఘర్షణ పడుతూ ఉంటారు. అప్పుడు ఇది ప్లాన్ లో ఒక భాగం మనందరం పార్టీకి వెళ్తున్నాం నేను చెప్పింది చెయ్.. అని గట్టిగా చెప్పి వెళ్లిపోతుంది. కట్ చేస్తే ఆఫీసులో అందరూ తులసిని పొగుడుతూ ఉంటారు. అప్పుడు నందు మేనేజర్ అవగానే కళ్ళ నెత్తికెక్కాయా ఫైల్ మీద చూడకుండా సంతకం పెట్టావా.. అని తనపై కోప్పడుతూ ఉంటాడు. ఇక లాస్యకి ఛాన్స్ దొరికిందని ఇంకొక నాలుగు మాటలు తులసిని అంటూ ఉంటుంది. అంతలో సామ్రాట్ అక్కడికి వచ్చి నందగోపాల్ గారు థాంక్స్ మీరు మన ప్రాజెక్ట్ ని చేజారకుండా చేసినందుకు అని పొగుడుతూ ఉంటాడు. తులసిని కూడా ఇన్ డైరెక్ట్ గా తిడుతూ ఉంటాడు. ఇక లాస్య అన్న మాటలకు కూడా సామ్రాట్ ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు. అప్పుడు సామ్రాట్ వాళ్ళ బాబాయ్ లోపలి పదమ్మ మాట్లాడుకుందాం అని అనగానే సామ్రాట్ వద్దు.. తను తప్పు చేయలేదు అంటే అప్పుడు మాట్లాడదాం… అంటూ నేను వెరిఫై చెయ్యని ఫైలు నీ దగ్గరికి ఎలా వచ్చింది. చూసుకోకుండా అలా ఎలా చేస్తారు.

అని అంటున్నప్పుడు తను ఝాన్సీ చెప్పిన మాటలను గుర్తు చేసుకుంటూ ఇప్పుడు ఈ విషయాన్ని తన మీద చెప్తే తన జీవితం పాడవుతుందని ఆ తప్పు తన మీదనే వేసుకుని సామ్రాట్ కి సారీ సామ్రాట్ గారు అని చెబుతుంది. ఇక నుంచి ఈ తప్పులు జరగకుండా చూసుకుంటాను అని అంటుంది. ఇక లాస్య తనకి ఇష్టం వచ్చినట్టుగా తులసీని తిట్టి అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. ఇక సామ్రాట్ తులసి దగ్గరికి వచ్చి రిలాక్స్ తులసి గారు ఇక జరిగిందని మర్చిపోయి రండి. తను మీరు రాకపోతే పార్టీ జరుపుకోదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ఝాన్సీ ఒక రూమ్ లోకి వచ్చి అలా చేసినందుకు బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఇక అప్పుడు తులసి ఝాన్సీ దగ్గరికి వెళ్లి నువ్వు ఎందుకు నాతో ఆ ఫైల్ మీద సంతకం పెట్టి ఇచ్చావు.. ఎవరు చేయించారు నీ జాబ్ కి ఎటువంటి ఇబ్బంది లేకుండా నేను చూసుకుంటాను.. నేను చెయ్యను తప్పకి తలవంచాను నీతో ఎవరు చెప్పించారు అని గట్టిగా అడుగుతూ ఉంటుంది. ఇక రేపటి ఎపిసోడ్లో హనీ బర్త్డే పార్టీలో నందగోపాల్ ను పొగుడుతూ నాకు ఇంత పెద్ద హెల్ప్ చేసినందుకు ఒక పెద్ద గిఫ్ట్ ఇవ్వబోతున్నాను అంటూ తులసి ప్లేస్ లో నందు గారిని అపాయింట్ చేయబోతున్నాను.. అని చెప్పగానే తులసి ఆశ్చర్యంగా సామ్రాట్ కి దండం పెట్టి అక్కడినుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. లాస్య మాత్రం సంతోషంతో గంతులు వేస్తూ ఉంటుంది. ఇక తర్వాతే ఏం జరిగిందో తెలియాలంటే రేపటి ఎపిసోడ్లో ఎదురు చూడాల్సిందే..

Advertisement