Intinti Gruhalakshmi 04 Oct Today Episode : అనసూయ చెప్పిన మాటలు విని సామ్రాట్ తులసిని ఏం చేయబోతున్నాడు.? తులసి ఒప్పుకుంటుందా.?

Advertisement

Intinti Gruhalakshmi 04 Oct Today Episode : బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్ ఇంటింటి గృహలక్ష్మి. ఈ సీరియల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ ఈరోజు తాజాగా రిలీజ్ అయింది. ఈరోజు ఎపిసోడ్ 754 హైలెట్ సెంటు ఇప్పుడు మనం చూద్దాం.. ఝాన్సీ దగ్గరికి వెళ్లి తులసి నీ పేరు బయటికి రాకుండా నేను చూసుకుంటా, నీ ఉద్యోగానికి ఎటువంటి ఆటకం కలగనివ్వను ఈ విధంగా ఎవరు చేయమని చెప్పారు అని అడుగుతూ ఉంటుంది. నువ్వు ఇలాగే చేస్తే నీది తప్పుని సామ్రాట్ దగ్గర చెప్తాను అని అంటూ ఉంటుంది. అప్పుడు ఝాన్సీ తప్పు నేనే చేశాను. ఎవరు చేయించలేదు రండి మేడం సామ్రాట్ దగ్గరికి వెళ్దాం చెబుదాం… నావల్ల మీరెందుకు నింద మోయాలి అని ఝాన్సీ అంటూ ఉండగా.. తులసి అక్కడినుంచి వచ్చి బాధపడుతూ ఉంటుంది. అంతలో సామ్రాట్ వాళ్ళ బాబాయ్ వచ్చి సామ్రాట్ తరపున నేను సారీ చెప్తున్నాను.. సామ్రాట్ మనసు ఏదో బాగాలేదు నువ్వు పట్టించుకోకమ్మ అని చెప్తూ ఉంటాడు. అప్పుడు తులసి సామ్రాట్ దగ్గర నమ్మకాన్ని పోగొట్టుకున్నాను తప్పు చేశాను అని అంటుంది. అప్పుడు సామ్రాట్ వాళ్ళ బాబాయ్ తెలిసి చేస్తే తప్పంటారు. తెలియక చేస్తే పొరపాటు అంటారు .నువ్వు చేసింది పొరపాటు అమ్మ ఈ విషయం అక్కడ చెప్పొద్దా అని అంటూ ఉంటాడు. అప్పుడు సామ్రాట్ వాళ్ళ బాబాయ్ నీ మీద నందు వాళ్ళు ఏమైనా కుట్ర చేశారేమో అని అంటూ ఉంటాడు. అప్పుడు తులసి నా మీద కక్ష పెట్టుకుని ఏం చేస్తారు.

Advertisement

అయినా నందు గారు ఆ ఫైల్ చేజారిపోకుండా దాన్ని చూసి మంచి పని చేశారు అని అంటుంది. అప్పుడు పెద్దాయన దీన్ని మనసులో పెట్టుకొని సాయంత్రం పార్టీకి రాకుండా ఉండకు తప్పకుండా రావాలి అని చెప్తాడు. అప్పుడు తులసి సరే అని అంటుంది. అప్పుడు ఝాన్సీ సామ్రాట్ దగ్గరికి వచ్చి సార్ నేను జాబ్ కి రిజైన్ చేస్తున్నాను. నేను చేసిన తప్పుని నన్ను పదేపదే బాధపెడుతుంది. నేను ఇక్కడ జాబ్ చేయలేను అని చెప్తుంది. అప్పుడు సామ్రాట్ ఆ లెటర్ ని చింపివేసి తప్పు చేసింది నేను నువ్వు ఎందుకు దానికి బాధపడతావ్ జాబ్ మానేయద్దు.. అని అని అంటూ ఉంటాడు. కట్ చేస్తే హనీ పుట్టినరోజుకి ఏర్పాట్లు చేస్తూ సామ్రాట్ తులసి వాళ్ల కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఇక సామ్రాట్ వాళ్ళ బాబాయ్ సామ్రాట్ ని నువ్వు ఎవరికోసం ఎదురు చూస్తున్నావో నాకు తెలుసు వాళ్ళు రాగానే సారీ చెప్పు అని అంటాడు. అంతలో తులసి వాళ్ళు వస్తారు. అప్పుడు రండి మీ కోసమే ఎదురుచూస్తున్నాను అని సామ్రాట్ అంటూ ఉంటారు. ఇక తర్వాత లాస్య నందు వాళ్లు వస్తారు. అప్పుడు సామ్రాట్ మీరు దగ్గరుండి అన్ని చూసుకోవాలి. నందుకి చెప్తూ ఉంటాడు. అప్పుడు లాస్య బాధ్యతలు తీసుకోవడంలో ఎంత అలర్ట్ ఉంటాడో మీకు తెలుసు కదా సామ్రాట్ గారు అని అనగానే. సామ్రాట్ వాళ్ళ బాబాయ్ ఇక్కడ ఆఫీస్ విషయాలు మాట్లాడొద్దు అని చెప్తాడు. ఇక దాంతో తులసి హనీ దగ్గరికి వెళుతుంది. సామ్రాట్ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.

Advertisement
intinti gruhalakshmi 04 october 2022 full episode
intinti gruhalakshmi 04 october 2022 full episode

ఇక నందు వాళ్ల అమ్మని నన్ను పలకరించాలి అని కూడా అనిపించడం లేదా అంత పనికిరాని వాడిని అయ్యానా అని అనగానే.. అప్పుడు లాస్య అవును నందు దాని అర్థం అదే కదా ఒక కృష్ణుడు పని అయిపోయింది. రెండో కృష్ణుడు కోసం ఎదురుచూస్తున్నారు. అని అనగానే ప్రేమ్ లాస్య పై కోప్పడతాడు. అప్పుడు ఉన్నదే కదా ప్రేమ్ నేను అన్నది ఎందుకు ఉలిక్కిపడతావ్ ముందు జరగబోయేది అదే అని అంటూ లాస్య అనసూయ ఘర్షణ పడుతూ ఉంటారు. ఈ అనసూయ ఉండగా అలాంటివి జరగనీయను గుర్తుపెట్టుకో అని లాస్య తిడుతుంది అనసూయ. ఇక దాంతో అందరూ అక్కడ నుంచి వెళ్ళిపోతారు. తులసి హనీ ని రెడీ చేస్తూ… హనీ సరదాగా సంతోషంగా గడుపుతూ ఉంటుంది. అదంతా సామ్రాట్ బయట నుంచి చూస్తూ సంతోష పడుతూ ఉంటాడు. అంతలో వాళ్ళ బాబాయ్ వచ్చి ఇక్కడే నిలబడకపోతే లోపలికి వెళ్లొచ్చు కదరా అని తన లోపలికి వెళ్లి సామ్రాట్ ని పిలుస్తాడు. తులసి సామ్రాట్ ని పలకరిస్తుంటే అప్పుడు సామ్రాట్ ఏం మాట్లాడకుండా తన గురించి బాధపడుతూ ఉంటారు. అప్పుడు హనీ నాన్న ఈ డ్రెస్ ఎలా ఉంది అని అనగానే… బుట్ట బొమ్మలా ఉన్నావ్ అని అంటాడు. మళ్లీ అనసూయ అన్నమాటలు గుర్తొచ్చి తను తెచ్చిన డ్రస్సు ఇచ్చి ఈ డ్రెస్ వేయండి అని తులసికి చెప్తాడు.

అప్పుడు హనీ అదేంటి నాన్న నేను తులసి ఆంటీ తెచ్చిన డ్రెస్ వేసుకున్నాను కదా.. ఇది బాగానే ఉంది కదా అని అంటూ ఉండగా.. అప్పుడు సామ్రాట్ హనీ పై కోప్పడుతూ ఈ డ్రెస్ వేసుకోవాలి అని చెప్తూ ఉంటారు. అప్పుడు సామ్రాట్ వాళ్ళ బాబాయ్ దాని పుట్టినరోజు నాడు దాన్ని ఇబ్బంది పెట్టకు అని అనగానే సామ్రాట్ సరే మీ ఇష్టం అని కోపంగా బయటికి వచ్చేస్తాడు. ఇక తులసి బాధపడుతూ ఉంటుంది. ఇక అనసూయ సామ్రాట్ దగ్గరికి వచ్చి నేను చెప్పింది ఏం చేశారు. చక్కగా పార్టీని గ్రాండ్ జరుపుకుంటున్నారు. నా మాటంటే మీకు లెక్కలేదు. అందుకే నేను పార్టీకి వచ్చాను. నన్ను చూస్తేనైన ఆ విషయం గుర్తుకొస్తుందేమో అని సామ్రాట్ పై మండిపడుతూ ఉంటుంది. అప్పుడు సామ్రాట్ మీరు ఎందుకు అలా అంటున్నారు. తులసి గారికి ఎటువంటి హాని జరగకుండా నేను చూసుకుంటాను అని చెప్తూ ఉంటాడు. ఇక రేపటి ఎపిసోడ్ పార్టీలో సామ్రాట్ ,తులసి జాబ్ మానేయాలి అని నందగోపాల్ని పొగుడుతూ తనని తులసి ప్లేసులో అపాయింట్ చేస్తున్నాను అని చెప్తూ ఉంటాడు. అప్పుడు తులసి బాధపడుతూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఇక తర్వాతే ఏం జరిగిందో తెలియాలంటే రేపటి ఎపిసోడ్లో చూడాల్సిందే..

Advertisement