Intinti Gruhalakshmi 05 Oct Today Episode : అనసూయ తులసిని అలా చేసింది ఏంటి .? సామ్రాట్ ఏం చేయబోతున్నాడు..?

Advertisement

Intinti Gruhalakshmi 05 Oct Today Episode :  బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్ ఇంటింటి గృహలక్ష్మి. ఈ సీరియల్ ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ ఈరోజు తాజాగా రిలీజ్ అయింది. ఈరోజు ఎపిసోడ్ 755 హైలైట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం… అనసూయ సామ్రాట్ ని నాకు నిన్ను నమ్మాలని లేదు సామ్రాట్ బాబు నిన్ను ఇలానే వదిలేస్తే జీవితాంతం ఆలసించేవాడిలాగా ఉన్నావ్.. ఇక నాకు ఓపిక లేదు నా తులసిని నేను కంచలాగా కాపాడుకుంటాడు. అని గట్టిగా తనకి వార్నింగ్ ఇచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు సామ్రాట్ వాళ్ల బాబాయ్ వచ్చి ఏమైందిరా ఆవిడ నీ మీద ఎందుకు కోప్పడుతుంది అని అనగానే.. సామ్రాట్ పార్టీ అయినా తర్వాత మాట్లాడుకుందాం లే అని చెప్తాడు. కట్ చేస్తే ఒక అతను నందిని ఇన్సల్ట్ చేస్తూ నువ్వు జాతకం లాంటిది చూపించుకో నీకు అంత బ్యాడ్ టైం నడుస్తుంది అని అంటాడు.. అప్పుడు నందు తనపై కోప్పడుతూ చేయించుకోబోతాడు. అప్పుడు లాస్య నందుని పక్కకు తీసుకొచ్చి నువ్వు ఇప్పుడు గొడవ పడే సమయం కాదు అని చెప్తుంది. అప్పుడు అభి వచ్చి డాడీ లాస్య ఆంటీ చెప్పింది కరెక్టే.

Advertisement

మామ్ విషయంలో నాయనమ్మ చాలా కష్టపడుతుంది. మనందరికీ మంచి రోజు దగ్గర పడ్డాయి అనిపిస్తుంది. అని అంటాడు. అప్పుడు నందు నాకు నమ్మకం లేదు నువ్వు కూడా పిచ్చిపిచ్చి ఆశలు పెట్టుకోకు అని నందు చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. సామ్రాట్ తెచ్చిన డ్రెస్ వేసి హనీ ని తులసి తీసుకొని వస్తుంది. హనీ ని అలా చూసిన సామ్రాట్ చాలా సంతోషపడతాడు. అప్పుడు తులసి నేను తీసుకొచ్చిన డ్రెస్ నచ్చలేదా నేను తీసుకురావడం నచ్చలేదా అని సామ్రాట్ ని అడుగుతూ ఉంటుంది. అప్పుడు సామ్రాట్ కొన్ని నిజాలు తెలుసుకోవడం కంటే తెలుసుకోకుండా ఉంటేనే మంచిదేమో అని సామ్రాట్ అంటాడు. పిడుగు లాంటి నిజాలు విని నా గుండె తట్టుకుంది. ఏ విషయమైనా నేను తీసుకోగలను అని నిజం చెప్పండి. నాతో చెప్పాలనిపించకపోతే చెప్పకండి. అని అంటుంది. నేను చెప్పింది నిజమని నమ్ముతారా అని సామ్రాట్ అంటాడు. మీరంటే నాకు చాలా నమ్మకం అండి అని అంటుంది తులసి. అప్పుడు సామ్రాట్ ఒక అబద్ధం చెప్పి తప్పించుకుంటాడు. ఇక హనీ ని తీసుకొని సామ్రాట్ తులసి చెరో వైపు పట్టుకొని తీసుకుని వస్తూ ఉండగా… అనసూయ మండిపడి పడిపోతూ ఉంటుంది.

Advertisement
intinti gruhalakshmi 05 october 2022 full episode
intinti gruhalakshmi 05 october 2022 full episode

లాస్య కుళ్ళుకుంటూ ఉంటుంది. అప్పుడు సామ్రాట్ హానిని కేక్ కట్ చేయమనగానే ఆగండి నాన్న నాకు ఇష్టమైన తులసి ఆంటీకి ఒక గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటున్నాను. అని అంటుంది. అప్పుడు తులసి నీ పుట్టినరోజుకి నాకు గిఫ్ట్ ఏంటి అని అనగానే.. మీరు నా సంగీతం మాస్టర్ కదా.. అందుకే ఒక సాంగ్ డెడికేట్ చేయాలనుకుంటున్నాను అని సాంగ్ పాడుతుంది. ఆ పాట పాడుతున్నప్పుడు తులసి సామ్రాట్ హాని సంతోషంగా గడపడం చూసి అవి లాస్య కోపంగా చూస్తూ ఉంటారు. అప్పుడు హనీ అలా చూడటం కాదు ఇద్దరు కలిసి నాతో కేక్ కట్ చేయించండి అని తులిసి ని సామ్రాట్ ని అంటుంది. అప్పుడు ఇద్దరు కలిసి కేక్ కట్ చేపిస్తారు. ఇక లాస్య తులసి సామ్రాట్లపై లేనిపోనివి అన్ని నందుకి చెప్తూ ఉంటుంది. తర్వాత ముందుగా హనీ కేక్ తులసికి పెడుతుంది. తర్వాత సామ్రాట్ కి పెడుతుంది. అలా కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత సామ్రాట్ నందుని పిలిచి ఒక చిన్న పొరపాటు వల్ల ఈరోజు మా కంపెనీ 10 కోట్లు నష్టపోయేది. నందువల అలా జరగకుండా నన్ను మా కంపెనీని కాపాడాడు.

అని చెప్తూ.. తన రాయల్టీకి మెచ్చి తులసి గారి ప్లేస్ లో మేనేజర్ గా అపాయింట్ చేస్తున్నాను.. అని చెప్తాడు అప్పుడు లాస్య సంతోషంతో గెంతులేస్తూ ఉంటుంది. ఇక తులసి బాధగా చూస్తూ ఉంటుంది. ప్రేమ్, శృతి వాళ్ల తాతయ్య సామ్రాట్ ఏంటి ఇలా చేశారు అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక తులసి వెళ్లి నందుకి కంగ్రాట్యులేషన్స్ నందు గారు మీరు సిన్సియర్గా వర్క్ చేసేవాళ్లు కాబట్టి మీ సిన్సియర్ని నిరూపించుకున్నారు అంటూ పొగుడుతూ ఉంటుంది. ఇక రేపటి ఎపిసోడ్లో బతుకమ్మ సెలబ్రేషన్స్ జరుపుకుంటూ ఉంటారు. ఇక తులసి, సామ్రాట్ ఇద్దరు కలిసి కోలాటం ఆడుతుండగా అనసూయ వెళ్లి తన దగ్గర కోలాటం కర్రలు గుంజుకుంటుంది. ఇక తులసి ఆశ్చర్యంలో మునిగిపోతుంది. ఇక తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే రేపటి ఎపిసోడ్ లో చూడాల్సిందే..

Advertisement