Intinti Gruhalakshmi 07 Oct Today Episode : అనసూయ మాటలకు ఏం చేయలేని పరిస్థితిలో నలిగిపోతున్న సామ్రాట్…

Advertisement

Intinti Gruhalakshmi 07 Oct Today Episode : బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్ ఇంటింటి గృహలక్ష్మి. ఈ సీరియల్ ప్రేక్షకులని బాగా ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ ఈరోజు తాజాగా రిలీజ్ అయింది. ఈరోజు ఎపిసోడ్ 757 హైలెట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం… సామ్రాట్ ని వాళ్ళ బాబాయ్ నువ్వు చేసిన తప్పుకి కనీసం క్షమాపణైనా చెప్పావా… నీకు మనస్సాక్షి లేదు అని అంటూ ఉంటాడు. అప్పుడు సామ్రాట్ ఇప్పుడే ఫోన్ చేసి చెప్తాను అనగానే పెద్దాయన అవమానం అందరి ముందు చేసి.. సారీ ఫోన్లో చెప్తావా అనగానే సరే బాబాయ్ ఇంటికి వెళ్లి చెప్పు వస్తాను అని అంటాడు. కట్ చేస్తే కాలనీ వాళ్లు అందరూ తులసి వాళ్ళ ఇంటికి వచ్చి బతుకమ్మలు అందరం కలిసి ఆడదాం అలాగే దాండియా కూడా ప్లాన్ చేసాం అని చెప్తూ ఉంటారు. తులసి ఫ్యామిలీ సరదాగా జోక్స్ వేసుకుంటూ హ్యాపీగా ఉంటారు. అప్పుడు దివ్య హనీ ని కూడా పిలుస్తున్నావా మామ్ ఈ పండక్కి అని అడుగుతుంది.అప్పుడు అందరూ బాధగా చూస్తూ ఉంటారు.

Advertisement

అప్పుడు దివ్య ఏదో క్యాజువల్ గా అడిగాను మామ్ అని అక్కడినుంచి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే సామ్రాట్ తులసికి సారీ చెప్పడానికి వస్తూ ఎలా సారీ చెప్పాలి ఎలా రిసీవ్ చేసుకుంటుంది అని ఆలోచిస్తూ. జనరల్ మేనేజ్ నుంచి తీసేసినందుకు సారీ అని చెప్తే సరిపోతుందా.. లేదా జరిగిందంతా చెప్తే బాగుంటుందా అని అనుకుంటూ ఉంటాడు. కట్ చేస్తే అనసూయ వాళ్ళ ఆయన హనీ విషయంలో గొడవ పడుతూ ఉంటారు. దివ్య హనీ ని పిలుస్తావా అని అడిగినప్పుడు తులసి నాకు సిగ్గు లేదా ఇంత జరిగిన తర్వాత ఎలా పిలుస్తాను అని చెప్పాలి కదా… అప్పుడు పెద్దాయన అనాలనిపించలేదు అనలేదు దీంట్లో ఏముంది అని అంటూ ఉంటారు.. అంతలో తులసి అక్కడికి వస్తుంది. అప్పుడు పెద్దాయన ఏంటమ్మా ఒక్కదానివే వస్తున్నావ్ అందరితో కలిసి వెళ్లి అనగానే.. అనసూయ ఏంటి ఆ తింగరి మాటలు వాళ్ళందరూ షాపింగ్ కి వెళ్ళారేమో తులసి సరుకులు తీసుకుని ఇంటికి వచ్చిందేమో అంతేనా కలిసి అంటూ పిండి వంటలు ఏం చేస్తున్నావ్ అని అడుగుతుంది. అప్పుడు తులసి మావయ్య గారికి ఏమైతే ఇష్టమో అవే చేస్తాను అత్తయ్య గారు అని చెప్తుంది.

Advertisement
intinti gruhalakshmi 07 october 2022 full episode
intinti gruhalakshmi 07 october 2022 full episode

ఇక అక్కడ నుంచి తులసి పెద్దాయన వెళ్ళిపోతారు. ఇక అంతలో సామ్రాట్ అక్కడికి వస్తాడు. అప్పుడు అనసూయ సామ్రాట్ నాకోసం వచ్చాడో తులసి కోసం వచ్చాడు నా కోసమే వచ్చి ఉంటాడు ఎందుకంటే తులసి ని జాబ్ లోంచి తీసేసారు కదా మొహం చెల్లదు మాట్లాడడానికి అనుకుంటూ తన దగ్గరకు వెళుతుంది.అప్పుడు సామ్రాట్ తులసి గారికి స్వారీ చెప్పాలని నేను వస్తే నా దగ్గరికి వస్తుంది ఏంటి అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడు అనసూయ నేను చెప్పినట్టు చేసినందుకు థాంక్స్ అనుకుంటూ మీరు చాలా గొప్పవారు అని తనని పొగుడుతూ ఉంటుంది. కానీ తులసి మీరు ఇలా చేసినందుకు చాలా బాధగా కృంగిపోతుందని అనుకున్నాను కానీ తులసి చాలా ఆనందంగా ఉంది నాకు సంతోషంగా ఉంది అంటూ.. నాకు ఇంకొక హెల్ప్ చేసి పెట్టాలి అని సామ్రాట్ ని అడుగుతుంది. అప్పుడు మళ్లీ హెల్ప మళ్ళి ఏమి అడుగుతుందో అని భయపడుతూ ఉంటాడు. అప్పుడు అనసూయ ఈ విషయాలన్నీ మన ఇద్దరి మధ్యలోనే ఉండాలి ఎవరికి చెప్పవద్దు అని చెప్పి అలాగే తులసి మీ ఆఫీస్ కి రాదు మీ ఇంటికి రాదు మీరు కూడా రాకుండా ఉంటే చాలా మంచిది అని చెప్తూ…

ఆయన ఇప్పుడు మీరు ఎందుకు వచ్చారు అని అడుగుతుంది. అప్పుడు తులసి గారి కోసం వచ్చాను అని అంటాడు. అప్పుడు తులసి కోస మా ఎందుకు అని గట్టిగా అడుగుతుంది. తులసి గారి దగ్గర ఒక ఫైల్ ఉంది అది తీసుకుందామని వచ్చాను అని చెప్తాడు. సరే నేను దాన్ని పంపిస్తాను మీరు ఇక్కడే ఉండండి అని చెప్పి తన లోపలికి వెళ్తుంది. సామ్రాట్ ఏం చేయలేని పరిస్థితిలో నలిగిపోతూ ఉంటాడు. అప్పుడు అనసూయ తులసి దగ్గరికి వచ్చి సామ్రాట్ వచ్చాడు అని అనగానే… అయ్యో అవునా లోపలకు వచ్చి కూర్చోమని చెప్పలేదా అని అంటుంది తులసి. అప్పుడు ఆయన ఏదో ఫైల్ కోసం వచ్చాడంట దానికి నువ్వు ఎందుకు అంత కంగారు పడుతున్నావ్ వెళ్లి ఆ ఫైల్ తీసుకురా నేను విచ్చేసి వస్తా అనగానే తులసి ఫైల్ తీసుకొని నేనే వెళ్తాను బాగోదు అని ఫైల్స్ తీసుకొని సామ్రాట్ దగ్గరికి వెళ్తుంది. అప్పుడు సామ్రాట్ గారు మీరు నిజంగానే ఫైల్స్ కోసం వచ్చారా.. ఈ ఫైల్స్ మీకు ఉపయోగపడే కూడా కాదు ఒకవేళ ఈ ఫైల్స్ కావాలంటే మీరు ఇక్కడ దాకా రావాల్సి అవసరం ఉండదు అని అంటూ ఉంటుంది తులసి. ఇక రేపటి ఎపిసోడ్లో అందరూ కలిసి బతుకమ్మ ఆడుతూ ఉంటారు. ఇక తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే రేపటి ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే…

Advertisement