Intinti Gruhalakshmi 08 Oct Today Episode : బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్ ఇంటింటి గృహలక్ష్మి. ఈ సీరియల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ ఈరోజు తాజాగా రిలీజ్ అయింది. ఈరోజు ఎపిసోడ్ 758 హైలెట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం… తులసి సామ్రాట్ ని మిమ్మల్ని చూస్తుంటే మీరు ఫైల్స్ కోసం వచ్చినట్లు అనిపించడం లేదు అని అనగానే సామ్రాట్ అదేంటి అలా అంటారు తులసి గారు అని అంటాడు. అప్పుడు తులసి ఎందుకంటే నా దగ్గర ఉన్న ఫైల్స్ ఉపయోగకరమైనవి కాదు ఒకవేళ కావాలనుకున్న వీటి కోసం మీరు ఇక్కడ దాకా రారు అని అంటుంది. అప్పుడు సామ్రాట్ మనసుకి ఇష్టం లేకుండా పనులు చేస్తే మనసు మనల్ని ప్రశాంతంగా ఉండనివ్వదు. కానీ ఎప్పుడూ మనసు మాటే వినాలంటే కష్టం కదా అని చెప్తూ ఉంటాడు. అప్పుడు తులసి మీరు నిజంగా ఎందుకు వచ్చారు అని అడగగానే… ఫైల్స్ కోసమైతే కాదు అనగానే తులిసి నాకోసం వచ్చారా అంటే జాబ్ లో నుంచి తీసేసినందుకు బాధపడుతున్నానేమోనని ఓదార్చడానికి వచ్చారా అని అడుగుతుంది.
అప్పుడు సామ్రాట్ మనసులో మీరు బాధపడకపోయినా నేను నరకము అనుభవిస్తున్నాను అని అనుకుంటారు. అయినా నాలాంటి అర్హత లేని దాన్ని జాబ్లో పెట్టుకోవడమే మీరు చేసిన పొరపాటు ఇప్పుడు తీసేయడం కూడా అంతే మంచి జరిగింది అని చెప్తూ ఉంటుంది. అప్పుడు సామ్రాట్ మీకు నేను నమ్మకద్రోహాన్ని చేశాను చేస్తూనే ఉన్నాను.. చేతులెత్తి క్షమాపణ చెప్పాలని వచ్చాను. మీ అత్తయ్య గారు నన్ను ఆపారు అంటూ అనుకుంటూ ఉంటాడు. అప్పుడు తులసి మన మధ్య జాబ్ రిలేషన్ పోయిందేమో కానీ స్నేహితుల రిలేషన్ ఎప్పటికీ ఉంటుంది. మీరు ఎప్పటికైనా రావచ్చు ఎప్పటికైనా పోవచ్చు అని చెప్తూ ఉంటుంది. అప్పుడు సామ్రాట్ మీకు కోపం రాదా తులసి గారు అని అనగానే… నా కోపం నా అదుపులోనే ఉంటుంది నేను చెప్పిన మాట వింటుంది అని అంటుంది. ఇక ఫైల్స్ తీసుకొని సామ్రాట్ వెళుతుండగా… తులసి మా కాలనీలో బతుకమ్మలు ఆడుతున్నారు హానిని తీసుకొని రండి అని చెప్పగానే నాకు పనుంది. హనీ పంపిస్తానులే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.

కట్ చేస్తే ఆ పెద్ద ఆవిడకి తులసికి మధ్యలో ఏదో జరుగుతుంది. దీన్ని మనం వాడుకుని ఆ పెద్దవాడిని మన వైపు తిప్పుకోవాలని ఆలోచిస్తూ ఉంటుంది. దీనిలో నందుని ఇన్వాల్వ్ చేస్తే తనకు ఇష్టం ఉండదు కాబట్టి నేనే రంగంలో దిగుతా అని అనసూయ కి ఫోన్ చేస్తుంది. అప్పుడు అనసూయ కట్ చేస్తుంది. అయినా సరే మళ్లీ లాస్య చేస్తుంది. ఇక అనసూయ ఫోన్ ఎత్తి ఏమొచ్చింది అని అనగానే మీకు కోపం వచ్చింది అత్తయ్య గారు అని అనసూయని మాయమాటలు అని చెప్పి బుట్టలో పడేసి పూజకి ఒప్పిస్తుంది. ఇక ఆ విషయాన్ని నన్ను దగ్గరకొచ్చి చెప్తుంది. ఇక నందు సంతోషంతో పొంగిపోతూ ఉంటాడు. కట్ చేస్తే దివ్య, అంకిత, అనసూయ, శృతి బతుకమ్మల ఆడడానికి ప్రాక్టీస్ చేస్తూ సంతోషంగా ఉంటారు. ఇక అంతలో అభి , ప్రేమ్ పువ్వులు తీసుకుని వచ్చి ఇక బతుకమ్మని తయారు చేయండి అని చెప్పగానే ..అంకిత మాకు ట్రైన్ కావాలి అనగానే ఆ ట్రైన్ ఎవరు అని ప్రేమ్ అంటాడు. అప్పుడు శృతి ఇంకెవరు అత్తయ్య గారే.. అంటుంది. ఇక దివ్య మాకు బతుకమ్మలు పేర్చడం నేర్పించి బతుకమ్మ గురించి చెప్పి మామ్ అనగానే.. అప్పుడు తులసి అప్పుడు బతుకమ్మ ఎలా పేర్చాలి.. బతుకమ్మ గురించి అంతా చెప్తూ ఉంటుంది. అంతలో అనసూయ నీ బతుకు కి కూడా ఆ సామ్రాట్ అడ్డం కాకుండా నీ జీవితం హ్యాపీగా సాగిపోవాలని కోరుకుంటున్నాను అని అనసూయ అంటుంది.
అప్పుడు తులసి కూడా నా ఎదుగుదలకి నువ్వు ఏ దారిలో తీసుకెళ్తున్నావు అంతా నీ ఇష్టం తల్లి అని తులసి మొక్కుకుంటుంది. కట్ చేస్తే సామ్రాట్ హానికోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. హనీ రెడీ అవుతూ ఉంటుంది. అప్పుడు హనీ వాళ్ళ తాతయ్య తన దగ్గరికి వెళ్లి ఎంతసేపు రెడీ అవుతావు అనగానే… ఆడవాళ్లంటే సింపుల్ కాదు వాళ్లు మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ పెట్టుకోవాలి. అని చెప్తూ ఉంటుంది. సరే తొందరగా రా అని హనీ వాళ్ళ తాతయ్య సామ్రాట్ దగ్గరికి వెళ్ళగానే సామ్రాట్ ఏంటి బాబాయ్ రావడం లేదు చెప్పిన టైయానికి వెళ్లాలి కదా అని కోప్పడుతూ ఉంటాడు. తులసి మనసుని బాధ పెట్టకురా నువ్వు కూడా వెళ్ళు ఎవరో ఏదో అనుకుంటారని ఇప్పుడే ఎందుకు ఇలా.. అయినా మీరు ఎప్పుడూ హద్దుతాటి ప్రవర్తించలేదు కదా అని పెద్దాయన అంటుంటాడు… అప్పుడు సామ్రాట్ తులసి గారికి ఇబ్బంది క్రియేట్ చేయడం నాకు ఇష్టం లేదు నేను వెళ్ళను అని చెప్తూ ఉంటాడు. కట్ చేస్తే తులసి ఫ్యామిలీ, నందు ఫ్యామిలీ అందరూ గుడికి వస్తారు. అప్పుడు తులసి నందు ఫామిలీ వస్తుండగా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. ఇక రేపటి ఎపిసోడ్లో అందరూ కలిసి బతుకమ్మ లాడుతు ఉంటారు. లాస్య మాత్రం గట్టి ప్లానే వేసి సామ్రాట్ ని అక్కడికి వచ్చేలా చేస్తుంది. ఇక తర్వాతే ఏం జరిగిందో తెలియాలంటే సోమవారం ఎపిసోడ్ వరకు వేచి ఉండాల్సిందే.