Intinti Gruhalakshmi 10 Oct Today Episode : బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్ ఇంటింటి గృహలక్ష్మి. ఈ సీరియల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ ఈరోజు తాజాగా రిలీజ్ అయింది. ఈరోజు ఎపిసోడ్ 759 హైలెట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం… తులసి కుటుంబం గుడికి వస్తారు. తర్వాత నందు లాస్య కూడా అక్కడికి వస్తారు. లాస్య నందు అనసూయ కి హాయ్ చెప్తారు. అప్పుడు తులసి వాళ్ళ మావయ్య ఇదేంటి కొత్తగా నువ్వు మళ్ళీ అనగానే… అప్పుడు అనసూయ వాడికి కొత్తగా జనరల్ మేనేజర్ జాబ్ వచ్చింది అందుకే నా పేరు మీద పూజ చేయించాలి అనుకున్నారట నన్ను ఇంటికి రమ్మని పిలిచారు. నేనే గుడికి రమ్మని చెప్పాను అని వాళ్ళని పొగుడుతూ ఉంటుంది. ఇక లాస్య నందు అనసూయ కాల మీద పడి ఆశీర్వాదం తీసుకుంటారు. తులసి అలాగే ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. ఇక అందరూ కలిసి గుడిలోకి వెళ్లి తులసి వాళ్ళ అత్తయ్య గారు మామయ్య గారు పేర్ల మీద పూజ చేయిస్తూ ఉండగా… లాస్య తులసి ఇప్పుడు మేము అత్తయ్య మామయ్య ల పేరు మీద పూజ చేయిస్తాను అని తన దగ్గర ఉన్న అర్చన పేపర్ తీసుకొని గుడిలో అయ్యగారికి ఇస్తుంది.
ఇక తర్వాత పూజ చేస్తూ ఉండగా… తులసి ఎందుకు నా జీవితం ప్రశాంతంగా ఉండనివ్వడం లేదు.. నేను చేసే పనిలో ఏదో ఒక ఆటంకం కనిపిస్తున్నావు దేవుడా.. నేను ఎవరికీ అన్యాయం చేశాను.. నా కుటుంబం లో ఎప్పుడు కలహాలు లేకుండా అందరూ ఎప్పుడూ కలిసి ఉండేలా చూడు దేవుడా అని మొక్కుకుంటూ ఉంటుంది. అంతలో పూజారి అక్కడికి వచ్చి ఈరోజు చాలా విశేషమైన రోజు ఏమైనా కోరికలు ఉంటే కోరుకోండి అని చెప్పగానే.. తులసి నా కోడలు చంటి పిల్లల్ని ఎత్తుకోవడమే నాకు కావాలి. నాకు మనవడు మనవరాలు కావాలి అదే మొక్కుకుంటున్న అని మొక్కుకుంటుంది. అప్పుడు పూజారి అయితే మీ కోడలు తోనే ముడుపులు కట్టించండి అని చెప్తారు. అప్పుడు తులసి ఆ చెట్టు దగ్గరికి వచ్చి వాళ్ళని ముడుపులు కట్టమని అడుగుతుంది. అప్పుడు శృతి మనం తలరాత ఎలా రాసిపెట్టి ఉంటే అలాగే జరుగుతుంది. ఈ ముడుపులు కట్టడం వల్ల ఏం మార్పు జరుగుతుంది. అని అంటూ ఉంటుంది. అప్పుడు తులసి అనసూయ అంతా వివరంగా చెప్తూ ఉంటారు. అప్పుడు దివ్య నాకు అన్నయ్యలతో ఆడుకొని బోర్ కొడుతుంది. ఓ మేన కోడలు ఓ మేనల్లుడు కావాలి.

ఖచ్చితంగా చేంజ్ కావాలి అని అనగానే అంకిత నువ్వు కూడా ఒక ముడుపు కట్టు పెళ్లవుతుంది అని అంటుంది. అప్పుడు అందరూ నవ్వుతారు. అప్పుడు శృతి అంకిత ముడుపులు కట్టడానికి వెళ్లగా వాళ్లకి ముడుపు కట్టడానికి చెట్టుకొమ్మ అందుకు పోవడంతో ప్రేమ వచ్చి సాయం చేసి ముడుపులు కట్టేలా చేస్తారు.. అనసూయ కాలనీలో మనకోసం అందరూ ఎదురు చూస్తారు. పదండి వెళ్దామని అందరూ అక్కడ నుంచి వెళ్లి అందరూ బతుకమ్మలు ఆడుతూ ఉంటారు. అందరూ బతుకమ్మలు ఆడుతుండగా.. లాస్య మాత్రం ఎందుకు సామ్రాట్ గారు రాలేదు అంటే వీళ్ళిద్దరి మధ్య ఏదో జరిగింది వీళ్ళిద్దరిని పర్మనెంట్గా దూరం చేయాలంటే ఏదో ఒకటి చేయాలి అని హనీ దగ్గరికి వెళ్లి మీ నాన్న ఎందుకు రాలేదు అని అడగగా.. తనకి పని ఉందని రాలేదు ఆంటీ అని చెప్తుంది.
అప్పుడు తనకి మాయ మాటలు చెప్పి తన చేత వాళ్ళ నాన్నకి ఫోన్ చేపించి వచ్చేలా చేస్తుంది. కంగారుపడుతూ సామ్రాట్ సామ్రాట్ వాళ్ళ బాబాయ్ హనీ దగ్గరికి వెళ్తారు. ఆ కార్యక్రమంలో జంటలతో గేమ్స్ ఆడిస్తూ ఉంటారు. ముందుగా అంకిత అభి గేమ్ ని స్టార్ట్ చేస్తారు. ఆ గేమ్లో అభి అంకిత ఓడిపోతారు.సామ్రాట్ హనీ దగ్గరికి వస్తూ తెగ కంగారు పడిపోతూ ఉంటాడు. తర్వాత నందు లాస్య కూడా ఆ గేమ్ ని ఆడుతూ ఉంటారు. వాళ్లు కూడా ఓడిపోతారు. ఇక రేపటి ఎపిసోడ్లో తులసి సామ్రాట్ కలసి దాండియా ఆడతారు. వాళ్లకి గిఫ్ట్ కూడా వస్తుంది. అప్పుడు అనసూయ ఇక సామ్రాట్ పై గట్టిగా మండిపడుతూ తన వల్లే జాబ్ పోయిందన్న విషయాన్ని బయట పెట్టేస్తుంది. ఇక అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. తర్వాతే ఏం జరిగిందో తెలియాలంటే రేపటి ఎపిసోడ్లో చూడాల్సిందే…