Intinti Gruhalakshmi 11 Oct Today Episode : బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్ ఇంటింటి గృహలక్ష్మి. ఈ సీరియల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ ఈరోజు తాజాగా రిలీజ్ అయింది. ఈరోజు ఎపిసోడ్ 760 హైలెట్స్ ఇప్పుడు మనం చూద్దాం.. తులసి వాళ్ళ ఫ్యామిలీ ఒక్కొక్క జంట వచ్చి గేమ్ ని ఆడుతూ ఉంటారు. కానీ ఎవరు గెలవరు. చివరగా శృతి ప్రేమ్ గెలుస్తారు. వాళ్లు మనసులో కొద్దిసేపు ప్రేమగా కొద్దిసేపు కోపంగా ఘర్షణ పడుతూ ఉంటారు. తర్వాత భార్యల గురించి భర్తలు చెప్తూ ఉంటారు. తర్వాత బుట్ట లో బాల్ ఆట ఆడుతారు.. చివరగా త్రో బాల్ లో అభి జంట గెలుస్తారు. తులసి అప్పుడు అభి దగ్గరకు వచ్చి అంకిత చెప్పినట్లుగా నడుచుకుంటే త్రో బాల్ లో గెలిచావు.. అలాగే అంకిత చెప్పినట్లు వింటే జీవితంలో కూడా గెలుస్తావని చెబుతూ ఉంటుంది. అంతలోనే సామ్రాట్ వాళ్ళ బాబాయ్ అక్కడికి వస్తారు. సామ్రాట్ తులసిని ఇంత నిర్లక్ష్యం మా మీ దగ్గర వదిలేసి వెళ్ళింది మీరు చూసుకుంటారని కదా హనీకి ఏమన్నా అయితే నేను తట్టుకోలేను సంగతి మీకు తెలుసు కదా…
అందరికీ ఫోన్ చేస్తుంటే ఒక్కళ్ళు రెస్పాండ్ అవడం లేదు అని అంటూ వాళ్ళందరినీ తిడుతూ ఉంటాడు. అప్పుడు తులసి హనీ నీకు కడుపునొప్పి వచ్చిందా అని అడుగుతూ ఉంటుంది. అప్పుడు హనీ నాకు కడుపునొప్పి వస్తేనే కదా ఆంటీకి చెప్పడానికి నేను నాన్న కోసం నాన్న కూడా నాతో పండగ జరుపుకోవాలని అలా అబద్దం చెప్పి రప్పించాను.. అనగానే హనీ పై సామ్రాట్ కోప్పడుతూ ఉంటాడు. తర్వాత అందరూ సామ్రాట్ని ఉండి పండగ జరుపుకోవడానికి ఉండమని రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు. అప్పుడు హనీ తన చేతిని పట్టుకొని ప్రోగ్రాం దగ్గరికి తీసుకువస్తుంది. ఇక లాస్య అగ్గి రాసుకుంటుంది నేను వేసిన ప్లాను ప్లే చేసే టైం వచ్చింది. అని సంతోష పడుతూ ఉంటుంది. ఇక అన్ని జంటలు అక్కడ దాండియా ఆడుతూ ఉంటారు. అన్ని జంటలు ఓడిపోగా చివరగా సామ్రాట్ తులసి జంట దాండియా లో గెలుస్తారు. ఇక అందరూ మెచ్చుకొని కాలనీ ప్రెసిడెంట్ చేత బహుమతి ఇస్తారు.

అనసూయ అభి లాస్య నందు మాత్రం మండిపోతు ఉంటారు. అప్పుడు తులసి నా జీవితంలో ఎప్పుడు ఓడిపోతూనే ఉన్నాను.. కానీ ఇప్పుడు సామ్రాట్ గారు గెలుపు అనే రుచిని నాకు చూపించారు మీరు చాలా గొప్పవారు. సామ్రాట్ అని సామ్రాట్ ని పొగుడుతూ ఉంటుంది. ఇక తర్వాత అక్కడున్న యాంకర్ తులసిని దుర్గామాత కి హారతి ఇవ్వమని అడుగుతారు. అప్పుడు హారతి ఇవ్వడానికి వెళుతూ ఉండగా.. అక్కడున్న ఆడవాళ్లు తులసిని నీకేం అర్హత ఉందని దుర్గ మాతకి హారతి ఇస్తావ్.. ఊరు మీద పడి ఆంబోతుల తిరుగుతున్నావ్ ఆడవాళ్ళ పరువు తీస్తున్నాం అంటూ నానా మాటలు అంటూ ఉంటారు. ఇక రేపటి ఎపిసోడ్లు సామ్రాట్ ఆడదానికి స్వేచ్ఛ లేదా మా స్నేహం లో ఎటువంటి కళంకం లేదు మీ ఆలోచనలలోనే కళంకం ఉంది. అని అంటూ తులసి సామ్రాట్ అందరిపై మండిపడుతూ వేదాంతం చెప్తూ ఉంటారు. ఇక తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే రేపటి ఎపిసోడ్లు చూడాల్సిందే…