Intinti Gruhalakshmi 12 Oct Today Episode : బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్ ఇంటింటి గృహలక్ష్మి. ఈ సీరియల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ ఈరోజు తాజాగా రిలీజ్ అయింది. ఈరోజు ఎపిసోడ్ 761 హైలెట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం… దుర్గామాత కి తులసి హారతి ఇవ్వబోతుండగా… అక్కడున్న ఆడవాళ్లు తులసి హారతి ఇవ్వడానికి ఏం అర్హత ఉంది ఊరి మీద పడి ఆంబోతుల తిరుగుతుంది. అని తులసిని నానా మాటలు అంటూ ఉంటారు. అప్పుడు అక్కడ ఉన్న వాళ్లపై అనసూయ మండిపడుతూ వాళ్లపై చేయి లేపుతుంది. అప్పుడు తులసి ఆగండి అత్తయ్య గారు అనగానే… అనసూయ నువ్వు నోరు ముయ్.. మొత్తం నీ వల్లే ఇదంతా అని తులసిని కూడా నానా మాటలు అంటూ… ఇక దాండియా ఆడావు కదా బహుమతి తీసుకున్నావు కదా ఇంకా ఇక్కడ ఏం చేస్తున్నావ్ వెళ్లిపో అని సామ్రాట్ ని తిడుతూ అందుకే నీకు నేను చెప్పాను నేను బ్రతిమిలాడుకున్నాను.. తులసి జాబ్ లోంచి తీసేయమని చెప్పాను.
చెప్పింది చేసావ్ కానీ వదిలి ఉండలేక మళ్ళీ వచ్చావా నీవల్ల మాకు రోజుకో తలనొప్పి నీ ఇల్లు ఒక ఎడారి మమ్మల్ని ఇలా బ్రతకని నాలా మాటలు అంటూ ఉంటుంది. అందరూ చెప్తున్నా కానీ ఎవరి మాట వినకుండా అనసూయ సామ్రాట్ తులసి పై మండిపడుతూనే ఉంటుంది. ఇక మళ్లీ ఆడవాళ్లు కూతుర్ల చూసుకున్నావు కదా నెత్తికెక్కింది అనుభవించు అని అనసూయని అంటుండగా.. సామ్రాట్ ఒక్కసారిగా వాళ్లపై కోప్పడతాడు. అప్పుడు తులసి నీ సామ్రాట్ ఇది మీ కుటుంబ విషయం మీ పర్మిషన్ ఇస్తే నేను దీనిగురించి మాట్లాడతాను అని అంటాడు. అప్పుడు అనసూయ నువ్వేం చెప్పనక్కర్లేదు ఇక్కడ నుంచి వెళ్ళిపో అని అంటూ ఉంటుంది. అప్పుడు తులసి మీరేం చెప్పాలనుకుంటున్నారో చెప్పేసి వెళ్ళండి సామ్రాట్ గారు మీరు మా ఇంట్లో భాగం కాకపోవచ్చు.. కానీ నామీద పడ్డ నింద లో మీకు భాగం ఉంది. మీరు చెప్పండి. అప్పుడు సామ్రాట్ ఆడదానికి ఆడవాళ్లే శత్రువులని నిరూపిస్తున్నారు. నీ నోటికి అదుపు లేకుండా రాక్షసిల్లా మాట్లాడుతున్నారు.

అనగానే ఈ కాలనీకి ఒక పరువు ఉంది ఇలాంటి విడాకులు తీసుకున్న ఆడది ఇలా తిరుగుతుందా అని అనగానే… అప్పుడు తులసి ఒకప్పుడు లాస్య తిరుగుతున్నప్పుడు ఎవరు ఏమి మాట్లాడలేదు.. అప్పుడు లేవని నోర్లు ఇప్పుడు ఎందుకు లేస్తున్నాయి.. సామ్రాట్ గారు దేవుడు లాంటి మనిషి తన గురించి ఇంకా ఎవరైనా మాట్లాడితే అస్సలు ఊరుకోను అని ఎడాపెడా అందరినీ క్లాస్ పీకుతుంది. అందరి నోరు మూసుకునేలా సామ్రాట్, తులసి సమాధానం చెప్తారు. ఒక మనసు ఇంకొక మనసుతో కలిస్తే స్నేహం అంటారు. స్నేహం సంస్కారం అంత మైనది అత్తయ్య గారు అని అనసూయ కూడా కొట్టినట్లుగా మాట్లాడుతుంది. ఇకనుంచి సామ్రాట్ నన్ను డ్రాప్ చేయడానికి వస్తాడు.. పికప్ చేసుకోవడానికి వస్తాడు. పండక్కి వస్తాడు. భోజనానికి వస్తాడు. రాత్రి వస్తాడు. పగలు వస్తాడు. ఎప్పుడొచ్చినా నేను స్వాగతం పలుకుతాను ఆయనకి మర్యాదలు చేస్తాను. ఇకనుంచి ఎవ్వరైనా తనని ఏమైనా అంటే అస్సలే ఊరుకోను అని గట్టిగా అక్కడ ఉన్న వాళ్ళందరికీ వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతూ ఉండగా..
అక్కడ ఉన్న వాళ్ళందరూ చప్పట్లతో సన్మానం చేస్తారు. సామ్రాట్ కూడా ఇంటికి వచ్చి తులసి అన్న మాటలను గుర్తు చేసుకుంటూ సంతోషపడుతూ ఉంటారు. అప్పుడు వాళ్ళ బాబాయ్ ఏంట్రా ఆ కన్నీళ్లు అనగానే అవి కన్నీళ్లు కాదు బాబాయ్ ఆనంద భాష్పాలు.. ఒక్క మనిషి నా స్నేహం కోసం చుట్టూ ఉన్న సమాజాన్ని ఎదిరించి మాట్లాడింది. నాకు ఇప్పుడు ప్రపంచాన్ని గెలిచినట్లుగా ఉంది. ధైర్యం అంటే తులసి గారిది. ఇక తులసి గారితో మ్యూజిక్ స్కూల్ స్టార్ట్ చేస్తాను రన్ చేస్తాను. అని సంతోషపడుతూ ఉంటాడు. రేపటి ఎపిసోడ్ లో తులసి మళ్ళీ జాబ్ లో జాయిన్ అవుతుంది. మ్యూజిక్ స్కూల్ కి సంబంధించిన ఫైలు లాస్య దగ్గర ఉన్నాయని తెలుసుకున్న తులసి లాస్య పై మండిపడుతూ ఉంటుంది. అప్పుడు లాస్య ఈ ఫైల్ నేను హ్యాండ్ ఓవర్ చేసుకున్నాను. నా అనుమతితో కాదు సామ్రాట్ అనుమతితో అని అంటుంది. ఇక తర్వాతే ఏం జరిగిందో తెలియాలంటే రేపటి ఎపిసోడ్లో చూడాల్సిందే.