Intinti Gruhalakshmi 13 Oct Today Episode : బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్ ఇంటింటి గృహలక్ష్మి. ఈ సీరియల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ ఈరోజు తాజాగా రిలీజ్ అయింది. ఈరోజు ఎపిసోడ్ 762 హైలెట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం… కాలనీలో జరిగిన సంఘటన గురించి తులసి ఒకపక్క పద్మనాభం ఇంకొకపక్క బాధపడుతూ ఉంటారు. అప్పుడు ప్రేమొచ్చి పద్మనాభం కి ధైర్యం చెబుతూ ఉంటాడు. కానీ పద్మనాభం ఇంకా అందరూ కలిసి ఒక మంచి మనసుకి తూట్లు పొడిచార్రా.. నమ్మిన మనిషి నమ్మకద్రోహం చేసింది రా పాపం ఎంత బాధ పడుతుందో అని పద్మనాభం బాధపడుతూ ఉంటాడు. అప్పుడు ప్రేమ్ అమ్మకి నేనున్నాను తాతయ్య అమ్మకి ఎలాంటి ఇబ్బంది జరగకుండా చూసుకుంటాను అని చెప్తూ ఉంటాడు. అప్పుడు పద్మనాభం నీ వల్ల కాదు నేను తనకి ఇబ్బంది జరగకుండా బాధపడకుండా నేను ఏదో ఒకటి చేయాలి ఏదో ఒకటి చేస్తా అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే తులసి అనసూయకు మందులిచ్చి వేసుకోమని చెప్తూ ఉంటుంది.
అంతలో పక్కింటి వాళ్ళు వచ్చి వాళ్ళ కోడల శ్రీమంతానికి పిలుపులు వచ్చి శృతి అంకిత గురించి ఇంకా పిల్లల్ని ఎందుకు కనడం లేదు కాళ్ళకి అడ్డమనుకుంటే మనకి కావాలన్నప్పుడు దేవుడు ఇవ్వడు అని చెప్పి అక్కడినుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు తులసి అర్థమైందా అని శృతి, అంకితలను అంటారు. అప్పుడు అనసూయ పద్మనాభం కూడా నాకు మనవరాలని మనవళ్ళని ఎత్తుకోవాలని నాకు కోరిక ఉంది అని అంటాడు.అప్పుడు తులసి కూడా మీరేమైనా ఇప్పుడే పిల్లలు వద్దనుకుంటున్నారా అని అడుగుతుంది. అప్పుడు శృతి జరిగింది చెప్పబోతూ ఉండగా.. ప్రేమ్ ఆపి ఇప్పుడు టైం కలిసి రావట్లేదమ్మ అని అంటారు. అప్పుడు తులసి అయితే ఓకే.. దేవుని గట్టిగా అడుగుదాం అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత తులసి ఆఫీస్ కి రెడీ అయి వెళ్తూ ఉండగా.. అనసూయ ఆపే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కానీ తులసి తనకి సర్ది చెప్పి… మీ నమ్మకాన్ని నేను పోగొట్టుకోను మీరు గీసిన దాటను.. అని అంటుండగా అనసూయ నేను ఇంట్లో ఉండి సంసారాన్ని నడపలేదా ఇప్పుడు నువ్వు కూడా అలాగే సంగీతం చెప్పుకుంటూ నువ్వు కూడా ఇల్లు గడుపుకోవచ్చు కదా అని అనగానే…

తులసి మీ జీవితం వేరు అత్తయ్య నా జీవితం వేరు ఈ జీవితంలో బంగారం లాంటి మామయ్య ఉన్నాడు. నా జీవితంలో అన్ని కష్టాలు ఏడుపులు అని బాధపడుతూ మనసుకి నచ్చి చెప్పి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే పద్మనాభం సామ్రాట్ దగ్గరికి వెళ్లి సామ్రాట్ ని తులసి కోసం ఆ ప్రాపర్టీని చేసి పెట్టమని సామ్రాట్ ని పొగుడుతూ హెల్ప్ అడుగుతాడు. అప్పుడు సామ్రాట్ దానికి ఒప్పుకొని నేను చేసి పెడతాను లేండి అని చెప్తాడు. సామ్రాట్ వాళ్ల బాబాయ్ కూడా నేను మీకు మాటిస్తున్నాను ఆ పని జరిగేలా నేను చేస్తాను అని చెప్తాడు. అప్పుడు పద్మనాభ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే తులసి ఆఫీస్ కి వెళ్లి మ్యూజిక్ స్కూల్ ఫైల్ ని వెతుకుతూ ఉంటుంది. నందు లాస్య ఫైల్ విషయంలో కొంచెం ఘర్షణ పడుతూ ఉంటారు.
అప్పుడు తులసి మ్యూజిక్ స్కూల్ ఫైల్ కి గురించి విజయ అనే అమ్మాయిని అడుగుతుంది. అప్పుడు ఆ విజయ లాస్య మేడం గారు హ్యాండ్వర్ చేసుకున్నారు ఇక ఆ విషయాలన్నీ తనే చూసుకుంటారంట.. స్కూల్ విషయంలో కానీ ఫైల్ విషయంలో గాని మీరు ఇన్వాల్వ్ వద్దని చెప్పారు మేడం కన్స్ట్రక్షన్ జరిగిన తర్వాత వచ్చి చూడమని చెప్పారు అని చెప్పి అక్కడినుంచి వెళ్ళిపోతుంది. ఇక రేపటి ఎపిసోడ్ లో ప్రేమ్ శృతి గొడవపడి శృతి ఇంట్లో నుంచి వెళ్ళిపోతూ ఉండగా… తులసి చూసి ప్రేమ్ చెంప పగలగొట్టి భార్య ఇంట్లోంచి వెళ్ళిపోతున్న పట్టించుకోవడం లేదు నువ్వు అసలు ఏం భర్తవురా అని తిడుతూ చి నువ్వు నా కొడుకువి కాదు ఆనందగోపాల్ గారి కొడుకువి అని ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది. ఇక తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే రేపటి ఎపిసోడ్లు చూడాల్సిందే…