Intinti Gruhalakshmi 14 Oct Today Episode : నందుని తులసి నీ బాస్ తనకి రెస్పెక్ట్ ఇవ్వు అంటున్న సామ్రాట్… నేను జాబ్ మానేస్తా అంటున్న నందు..!

Advertisement

Intinti Gruhalakshmi 14 Oct Today Episode : బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్ ఇంటింటి గృహలక్ష్మి. ఈ సీరియల్ ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ ఈరోజు తాజాగా రిలీజ్ అయింది. ఈరోజు ఎపిసోడ్ 763 హైలెట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం… తులసి లాస్య నందు దగ్గరికి వెళ్లి మ్యూజిక్ స్కూల్ సంబంధించిన ఫైల్ గురించి మాట్లాడుతూ ఉంటుంది. మ్యూజిక్ స్కూల్ సంబంధించిన ఏ విషయమైనా నేను తీసుకోవాలి అని నందుకి గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. అంతలో సామ్రాట్ అక్కడికి వస్తారు. సామ్రాట్ నందుని తిడుతూ తనకి ఫస్ట్ రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకోండి తనకి మ్యూజిక్ స్కూల్లో కచ్చితంగా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. తనే పెంచి పెద్ద చేయాల్సింది అని తులసి గారిని పొగుడుతూ నందుని తిట్టి అక్కడినుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు తులసి మ్యూజిక్స్ స్కూలుకు సంబంధించిన ఫైల్ ఇవ్వమని లాస్యకి చెప్పండి జనరల్ మేనేజర్ గారు అని అంటుంది. అప్పుడు వాళ్ళిద్దరూ అవాక్కై చూస్తూ ఉంటారు.

Advertisement

కట్ చేస్తే శృతి, ప్రేమ్ కి టీ ఇచ్చి వెళ్ళిపోతూ ఉండగా… ప్రేమ్ శృతిని పిలిచి ఇక అన్ని మర్చిపోదాం ఇక ముందులాగా కలిసుందాం ఎన్నాలిలా నటిస్తాం చెప్పు అని అంటూ ఉంటాడు. అప్పుడు శృతి దానికి ఒప్పుకోదు.. ప్రేమ లేనిచోట మొక్కుబడిగా కలిసి ఉండడం వీలుకాదు.. నా ఫీలింగ్స్ తో సంబంధం లేదు.. భర్తగా నువ్వు ఒక డిజాస్టర్ అని గట్టిగా అంటుంది. అప్పుడు ప్రేమ్ అయితే అంత కష్టం గా నాతో ఉండడం ఎందుకు ఇంట్లో నుంచి వెళ్ళిపో అని గట్టిగా అంటారు. నేను నీకు పనికి రానప్పుడు నువ్వు కూడా నాకు పనికిరావు నువ్వు కూడా భార్య గా డిజాస్టర్ నీ మొహం కనబడకపోతే నేను సంతోషంగా ఉంటాను వెళ్ళిపో అని అంటాడు. అప్పుడు శృతి ఏడుస్తూ ఉంటుంది. కట్ చేస్తే నందు మందు తాగుతూ సామ్రాట్ అన్నమాటలు గుర్తు చేసుకుంటూ ఫీలవుతూ ఉంటాడు. అంతలో లాస్య వచ్చి నందు భోజనానికి రా అని పిలుస్తూ ఆ సామ్రాట్ మాటలు ఇంకా మర్చిపోలేదా అని బాస్ కదా అలాగే మాట్లాడతాడు. కాబట్టి వదిలేయాలి అని అంటూ ఉంటుంది. నా బాధ నీకు అర్థం అయితే ఇలా మాట్లాడవు అని లాస్య అని నందు అంటారు. అలా కొద్దిసేపు తులసి, సామ్రాట్ గురించి మాట్లాడుతూ.. తనని తిడుతూ ఇక జాబ్ మానేద్దాం అంత అవమానించిన తర్వాత ఎలా అక్కడ జాబ్ చేద్దాం.

Advertisement
intinti gruhalakshmi 14 october 2022 full episode
intinti gruhalakshmi 14 october 2022 full episode

అని ఇద్దరు ఘర్షణ పడుతూ ఉంటారు. కట్ చేస్తే శృతి లగేజ్ తీసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. అంతలో తులసి అక్కడికి వచ్చి ఆగు అని శృతిని వెనక్కి పిలుస్తుంది. అప్పుడు శృతి రాగానే తులసి ఏమైందమ్మా ఎక్కడికి వెళ్తున్నావ్ అని అడుగుతుంది. అప్పుడు శృతి అత్త ని చూడ్డానికి వెళుతున్న అనగానే… ఒక్క మాట ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపోతున్నావేంటి అసలు ఏం జరిగింది అనగానే శృతి తులసి నీ కౌగిలించుకొని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు నా వల్ల ఏదైనా పొరపాటు జరిగిందా అని తులసి అడుగుతుంది. అప్పుడు శృతి కాదు ఆంటీ అని ప్రేమ్ కి శృతికి మధ్యన జరిగిన గొడవ అంత తులసికి చెప్తుంది. అదంతా విన్న తులసి ప్రేమ్ అని గట్టిగా పిలుస్తుంది. అప్పుడు ప్రేమతో పాటు అందరూ వస్తారు. అప్పుడు తులసి ప్రేమ్ ని చంప పగలగొట్టి నువ్వే మగాడివి రా భార్యకి గౌరవం ఇవ్వలేని వాడివి.. నీకోసం శృతి జీవితమంతా త్యాగం చేసిన నీకు అది అర్థం కావడం లేదా అని తిడుతూ నువ్వు నా కడుపున ఎలా పుట్టావురా నవ్వు నా కొడుకువి కాదు ఆనందగోపాల్ గారి కొడుకువి అని తిడుతూ ఉంటుంది. ఇక రేపటి ఎపిసోడ్లు ప్రేమ్ , అభి ల ఫస్ట్ నైట్ ఏర్పాట్లు చేస్తు ఉంటుంది తులసి.. తర్వాతే ఏం జరిగిందో తెలియాలంటే రేపటి ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే..

Advertisement