Intinti Gruhalakshmi 15 Oct Today Episode : ఫస్ట్ నైట్ ద్వారా ఒకటైన ప్రేమ్, అభి జంటలు… అనసూయకు తులసిపై అసూయ పెరిగేలా చేస్తున్న లాస్య…

Advertisement

Intinti Gruhalakshmi 15 Oct Today Episode :బుల్లితెరపి ప్రసారమయ్యే సీరియల్ ఇంటింటి గృహలక్ష్మి. ఈ సీరియల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ ఈరోజు తాజాగా రిలీజ్ అయింది. ఈరోజు ఎపిసోడ్ 764 హైలెట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం… ప్రేమ్ ని తులసి నువ్వు ఏం మగాడివి రా ఆడదాన్ని అర్థం చేసుకునే వాడివి అనుకున్నాను కానీ నువ్వు నా కొడుకువి కాదు… ఆనందగోపాల్ గారి కొడుకువి మీ నాన్న లాగానే భార్యని ఒంటరిని చేద్దామనుకున్నావా? గాలికి వదిలేద్దామనుకున్నావా.. మమ్మల్ని అర్థం చేసుకోలేకపోతే కొంచెం విషం ఇచ్చి చంపేయండి కానీ ఇలా చేయకండి అని తిడుతూ ఉంటుంది. అప్పుడు ప్రేమ్ తులసి కాళ్లపై పడతాడు. అప్పుడు తులసి నేను కాదు క్షమించేది శృతి అనగానే ప్రేమ్ శృతి కాళ్ళపై పడుతుండగా.. శృతి వద్దు అని కౌగిలించుకుంటుంది. అప్పుడు ప్రేమ్ సారీ శృతి అనగానే శృతి కూడా తప్పు నాది కూడా ఉంది అని ఇద్దరు కలిసిపోతారు.

Advertisement

అప్పుడు అందర్నీ సమస్యల్ని దాచి పెట్టుకోకండి అందరికీ చెప్పండి అని తెలిసి అంకిత అభిలను కూడా మీక్కూడా ఏమన్నా ప్రాబ్లం ఉందా అని అడుగుతుంది. అప్పుడు అలా ఏం లేదు అని చెప్తారు.తులసి ప్రేమ్ ని ఆవేశంలో కొట్టాను నొప్పిగా ఉందా అని అడుగుతుంది. అప్పుడు పద్మనాభం ఆ నొప్పి పోవాలంటే ఒకటే మార్గం ఉంది అని చెప్పి వాళ్ళ ఆవిడ అక్కడ ముద్దు పెట్టడం అని చెప్పగానే తులసి అవును తాతయ్య చెప్పినట్లు చేయండి అని చెప్పగానే శృతి ప్రేమ్ కి ముద్దు పెడుతుంది. ఇక తర్వాత వాళ్ల ఫస్ట్ నైట్ కి సిద్ధం చేయాలని అనుకుంటారు. తర్వాత తులసి, అంకిత, శృతిని రెడీ చేస్తూ సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక్కడ అనసూయ పద్మనాభం అభి, ప్రేమ్ ని ఫస్ట్ నైట్ కి ప్రిపేర్ చేస్తూ ఉంటారు. అనసూయ పద్మనాభం అలా కామెడీగా ఆట పట్టిస్తూ ఉంటారు. ఇక్కడ తులసి, దివ్య అంకిత శృతిలను రెడీ చేస్తూ ఫ్లెక్సీలు కూడా కట్టించాం దానిపైన మీ పేర్లు పెట్టాం అని ఆటపట్టిస్తూ ఉంటుంది దివ్య. ఇక్కడేమో పద్మనాభం అనసూయ అభి, ప్రేమ్ లను కొన్ని జాగ్రత్తలు చెప్తూ ఉంటారు.

Advertisement
intinti gruhalakshmi 15 october 2022 full episode
intinti gruhalakshmi 15 october 2022 full episode

తులసి, దివ్య అంత శృతిలను జాగ్రత్తలు చెప్తూ ఉంటారు.ఇక ప్రేమ్ రూంలో ప్రేమ్ శృతి కోసం ఎదురుచూస్తూ ఉంటాడు. అభి రూమ్ లో అంకిత అభి కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. అంతలో శృతి అభి దగ్గరికి సిగ్గుపడుతూ వస్తుంది. అభి సిగ్గుపడుతూ అంకిత దగ్గరికి వెళ్తాడు. అలా వెళ్ళిన తర్వాత అవి సగం పాలు తాగి అంకితకి ఇస్తాడు. శృతి మాత్రం మొత్తం పాలు తాగేస్తుంది. ప్రేమ్ ఇది అన్యాయం చీటింగ్ అని శృతిని అంటూ ఉంటాడు. అప్పుడు శృతి ఇది మొదటి రాత్రి కాదు.. కాబట్టి మూడో రాత్రి కాబట్టి మొత్తం తాగేయాలంట అని మా నాయనమ్మ చెప్పింది అని సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక ఇలా రెండు జంటలు సరదాగా రొమాంటిక్గా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక రేపటి ఎపిసోడ్ లో లాస్య అనసూయ కి ఫోన్ చేసి నీ కొడుకు జాబ్ మానేశాడు. అని తులసి పై లేనిపోనివన్నీ చెప్పి తనపై అసూయ పెరిగేలా చేస్తుంది. అప్పుడు అనసూయ తులసి పై మండిపడుతూ ఉంటుంది. ఇంక తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే సోమవారం ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే…

Advertisement