Intinti Gruhalakshmi 19 Oct Today Episode : తులసికి తన ఇంటిని గిఫ్ట్ గా ఇచ్చిన పద్మనాభం… సంతోషంలో తేలిపోతున్న తులసి…

Advertisement

Intinti Gruhalakshmi 19 Oct Today Episode : బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్ ఇంటింటి గృహలక్ష్మి. ఈ సీరియల్ ఈరోజు తాజాగా రిలీజ్ అయింది. ఈరోజు ఎపిసోడ్ హైలెట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం… లాస్యని సామ్రాట్ ఆఫీస్ నుంచి వెళ్ళిపోమని గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. కానీ లాస్య నాకు ఈ ఉద్యోగం చాలా అవసరం నందు జాబ్ కూడా పోయింది. అని బ్రతిమిలాడుతూ ఉంటుంది. సామ్రాట్ ఒప్పుకో పోయేసరికి తులిసి దగ్గరికి వెళ్లి నువ్వైనా చెప్పు తులసి నువ్వు చెప్తే వింటాడు అని కొద్దిసేపు బ్రతిమిలాడుకుంటుంది. తులిసి కూడా ఇది నన్ను మాత్రమే అంటే తీసుకునే దాన్ని నీకు జాబ్ ఇచ్చి నిన్ను నీ జీవితాన్ని నిలబెట్టిన సామ్రాట్ గారిని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా నేను ఒప్పుకోను అన్నట్లుగా మాట్లాడుతుంది. అప్పుడు లాస్య తిరగబడి నన్ను కావాలని జాబ్ లోంచి తీసేసారు. ఏమి చదువు రాని దాన్ని జనరల్ మేనేజర్ గా పెట్టావు ఇది ఏదో ఒక రోజు ఈ కంపెనీని ముంచుతుంది నిలువునా… అని గట్టిగా సామ్రాట్ ని తులసిని కలిపి మాటలంటూ ఉంటుంది.

Advertisement

ఇక తులసి నా చెయ్యి నీ చెంప పగలకొట్టకు ముందే ఇకనుంచి వెళ్ళిపో అని గట్టిగా అనడంతో లాస్య కొట్టి చూడు నేనేంటో చూపిస్తా అని తులిసిపై మండిపడుతూ నాన మాటలు అంటూ ఉంటుంది. ఇక సామ్రాట్ ఇకనుంచి వెళ్ళిపో తొందరగా అనగానే లాస్య అక్కడినుంచి వెళ్ళిపోతుంది. ఇక తులసి సామ్రాట్ లాస్య ఇక ఇప్పట్నుంచి ఊరికే ఉండదు ఇప్పుడు ఎంత గొడవ చేసిందో అంతకంటే డబల్ గొడవ ఇంటిదగ్గర చేస్తుంది. అని తన గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. కట్ చేస్తే పద్మనాభం దివ్య సరదాగా ఆట ఆడుకుంటూ ఉంటారు. అంతలో ప్రేమ్ స్వీట్స్ బాక్స్ తీసుకొని వెళ్తూ ఉండగా.. పద్మనాబం అరే ఏంట్రా అది అని అనగానే స్వీట్ బాక్స్ దాచుకుంటూ ఉంటాడు. ఇక అప్పుడు దివ్య సరదాగా ఆటపట్టిస్తూ ఉంటుంది. వాళ్లు కూడా సరదాగా దివ్యని ఆటపట్టిస్తూ ప్రేమగా చూసుకుంటూ ఉంటారు. అంతలో తులసి ఇంటికి డల్ గా వస్తూ ఉంటుంది. అప్పుడు పద్మనాబం ఏమైంది అమ్మ అని అడుగుతూ ఉంటాడు.

Advertisement
intinti gruhalakshmi 19 october 2022 full episode
intinti gruhalakshmi 19 october 2022 full episode

అప్పుడు అనసూయ వచ్చి నేను చెప్తాను అని ఆరోజు పండగ రోజు మనం మాటలన్నామని ఒక్కొక్కల మీద పగ సాధిస్తూ ఉంది అని నందు జాబ్ పోవడానికి నువ్వే కారణం లాస్య జాబ్ పోవాడానికి నువ్వే కారణమని తులసినే తిడుతూ ఉంటుంది. అప్పుడు ఏడుస్తూ నా జీవితంకి ఎవరు అడ్డుపడకండి నా జీవితం ఏం బతుకుతానని అని చెప్తున్నాను నేను ఎప్పుడూ మీ తులసినే పాత తులసినే మీరే నన్ను అపార్థం చేసుకుని దూరం చేస్తున్నారు. అయినా వాళ్ల జాబ్ తీసేయడం వలన నాకు లాభం ఏంటి.? అనగానే అనసూయ నువ్వు చేసే పనులకి అడ్డంగా ఉంటున్నారని తీసేసిన అని నా నా మాటలు అంటూ ఉంటుంది. అప్పుడు తులసి నా అత్తయ్య నన్ను ఇన్ని మాటలు అంటదని నేను అస్సలు ఊహించలేదు అని బాధపడుతూ ఉంటుంది. అప్పుడు పద్మనాభం అనసూయని తిడుతూ తులసి కాదే మారిపోయింది. నువ్వు మారిపోయావు నీ మనసుతో ఆలోచించు తనేంటో నీకు తెలియదా అని తిడుతూ తులసికి సారీ చెప్తాడు.

ఇక తులసి బాధపడుతూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే లాస్య ఆగ్రహంతో ఇంటికి వచ్చి అన్ని వస్తువులన్నీ పగలగొడుతూ సామ్రాట్ ని తిట్టుకుంటూ ఆఫీసులో విషయాలను గుర్తు చేసుకుంటూ అన్ని విసిరేస్తూ ఉంటుంది. అంతలో నందు అక్కడికి వచ్చి ఏమైంది అలా చేస్తున్నావ్ అని అడుగుతూ ఉంటాడు. మాట అన్నాను సారీ చెప్పాను అని వాళ్లని నానా మాటలు అంటూ నందుకి చెప్తూ ఉంటుంది. అప్పుడు నందు నీకు ఇలాంటి పరిస్థితి వస్తుంది నీకు ముందే చెప్పాను కదా… నేను ఎప్పుడు జాబ్ మానేద్దామని చెప్పాను.. కానీ నువ్వు వినలేదు నిన్న నన్ను ఇవాళ నిన్ను అవమానించాడు మనం వేరే జాబ్స్ వెతుక్కుందాం అని చెప్తూ ఉంటాడు. నేనేం చేయాలో అదే చేస్తా అని లాస్య అంటూ ఉంటుంది. అప్పుడు నందు నా పరువు తీసే పని మాత్రం చేయకు అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.

ఇక తులసిని సామ్రాట్ని ఇక ఊరికే వదిలిపెట్టను బీ రెడీ తులసి అని అంటూ ఉంటుంది.కట్ చేస్తే తులసి వాళ్ళ ఇంట్లో అందరూ టీ తాగుతూ ఉంటారు. పద్మనాభం పేపర్ చదువుతూ ఉంటాడు. తులసి ఆఫీస్ కి వెళ్లడానికి రెడీ అవుతూ ఉంటుంది. అప్పుడు అక్కడ ఒక గిఫ్ట్ కనపడుతుంది. అప్పుడు ఆ గిఫ్ట్ తీసుకొని హాల్లోకి వచ్చి ఇది ఏంటి అని అందర్నీ అడుగుతూ ఉంటుంది. ఇక అప్పుడు పద్మనాబం నేనే పెట్టాను అని చెప్తుంటాడు. రేపటి ఎపిసోడ్ లో తులసికి తన ఇంటిని మళ్లీ తిరిగి పద్మనాబం ఇచ్చేస్తాడు. అప్పుడు తులసి ఆ ఇంట్లోకి వెళ్లి సంతోషంతో పొంగిపోతూ ఉంటుంది. ఇక తర్వాతే ఏం జరిగిందో తెలియాలంటే రేపటి ఎపిసోడ్లు చూడాల్సిందే…

Advertisement