Intinti Gruhalakshmi 20 Oct Today Episode : తన ఇంట్లో అడుగుపెట్టి సంతోషంలో తేలిపోతున్న తులసి… సామ్రాట్ పై సంచలనం సృష్టిస్తున్న నందు, లాస్య

Advertisement

Intinti Gruhalakshmi 20 Oct Today Episode :  బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్ ఇంటింటి గృహలక్ష్మి. ఈ సీరియల్ ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ ఈరోజు తాజాగా రిలీజ్ అయింది. ఈరోజు ఎపిసోడ్ 768 హైలెట్స్ ఏంటి ఇప్పుడు మనం చూద్దాం… తులసి ఆ గిఫ్ట్ తీసుకొచ్చి అందర్నీ ఎవరిది ఎవరిది అని అడుగుతూ ఉంటుంది. అప్పుడు ఎవరిది కాదు అని చెప్తూ ఉంటారు. అప్పుడు అందరూ కలిసి ఓపెన్ చేయమని చెప్తూ ఉంటారు. కానీ పద్మనాభం ఆ గిఫ్ట్ని ఓపెన్ చేయొద్దు అని చెప్తూ ఉంటాడు. అప్పుడు గిఫ్ట్ తెచ్చిన ఓపెన్ చేయడానికి కాదా అని ఎటకారంగా సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు పద్మనాబం గిఫ్ట్ ఓపెన్ చేయడానికి ఒక స్పెషల్ ప్లేస్ అరేంజ్ చేశాను. అక్కడ ఓపెన్ చేద్దాం అని చెప్తూ ఉంటాడు. అప్పుడు అనసూయ గింతతంత గిఫ్ట్ కి ఫంక్షన్ హాల్ ఏ బుక్ చేసావా అని ఎటకారంగా సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ పద్మనాభం ఆల్రెడీ క్యాబ్ బుక్ చేసి అందర్నీ తీసుకొని అక్కడికి వెళ్తాడు.

Advertisement

అప్పుడు అందరూ ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు సర్ప్రైజ్ గా అనిపించడం లేదు కన్ఫ్యూజన్ లో ఉంది అని అంటూ ఉంటారు. అప్పుడు తులసి కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. మీరు ఎంతో ప్రేమగా ఇచ్చిన ఇంటిని నేను పోగొట్టుకున్నాను మిమ్మల్ని అందరిని బాధపెట్టాను. అని ఇంటి ముందు నిలబడే అర్హత నాకు లేదు అని బాధపడుతూ ఉంటుంది. అప్పుడు పద్మనాభం ఆగమ్మ తులసి నిన్ను బాధ పెట్టడం నా ఉద్దేశం కాదమ్మా ..గుండె ఒత్తిడి ఎలా ఉంటుందో నాకు తెలియద అమ్మ.. ఇంటితో నీకు ఉన్న అనుబంధం నాకు తెలుసమ్మా.. ఇక్కడ నిలబడి ఈ గిఫ్ట్ బాక్స్ ఓపెన్ చెయ్ అని బ్రతిమలాడుతూ ఉంటాడు. అప్పుడు తులసి ఆ గిఫ్ట్ బాక్స్ ను ఓపెన్ చేస్తుంది. ఆ గిఫ్ట్ బాక్స్ లో ఇంటి తాళాలు ఇంటికి సంబంధించిన కాగితాలు అందులో ఉంటాయి. అది చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోతూ ఉంటారు అందరూ. అప్పుడు ఏంటి మావయ్య ఇది అని తులసి అనగా పద్మనాభం నువ్వు కోరుకున్నది అమ్మ నీ సంతోషం అది మళ్లీ నీ దగ్గరికి వచ్చేసింది అమ్మ అని సంతోష్ పడుతూ ఉంటాడు. అప్పుడు తులసి అందరూ కూడా సంతోషపడుతూ ఉంటుంది.

Advertisement
intinti gruhalakshmi 20 october 2022 full episode
intinti gruhalakshmi 20 october 2022 full episode

ఈ ఇల్లు దూరమైనందుకు నువ్వు ఎంత బాధ పడ్డావో నాకు తెలుసు అమ్మ.. అంటాడు. అప్పుడు అందరూ ఇది ఎలా కొన్నారు అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అని అనగానే… అప్పుడు పద్మనాభం టైం వచ్చినప్పుడు చెప్తాను దాని గురించి ఇప్పుడు మర్చిపోండి అని చెప్తాడు. అప్పుడు తులసి మావయ్య ఈ ఇల్లు నా పేరు మీద వద్దు అని బాధపడుతూ ఉంటుంది. పద్మనాభం అదేంటమ్మా అలా అంటావు.. అప్పుడు ఇల్లు అమ్ముక్కోడానికి కారణం నువ్వు కాదమ్మా పరోక్షంగా నా కొడుకు అందరూ అన్నట్లుగా చెప్తూ ఉంటాడు. ఇల్లు నీ పేరు మీద ఉండాలి. ఈ బహుమతి నువ్వు కాదంటే నేను బ్రతికున్నన్ని రోజులు నువ్వు నాతో మాట్లాడొద్దు అని చెప్తూ ఉంటాడు. అప్పుడు తులసి ఇంత పెద్ద శిక్ష అనుభవించే ఓపిక నాకు లేదు ఇకనుంచి ఇల్లు మన అందరిదీ అని అంటూ ఉంటుంది. అప్పుడు పద్మనాభం ఇక ఇల్లు నీది అని చెప్తాడు. అందరూ అభినందనలు చెబుతూ ఉంటారు.

తర్వాత పద్మనాభం తులసి నిలయం అనే బోర్డు తీసుకొచ్చి తులసికిచ్చి అక్కడ తొలగించమని చెప్తూ ఉంటాడు. కానీ తులసి ఈ తులసి అనే పేరుని తీసేసి ఆనంద్ నిలయం పెడదాం అనగానే… అందరూ తులసి పేరు ఎక్కడ ఉంటే అక్కడ సంతోషం ఉంటుంది. దాంట్లో మార్పు లేదు అని అంటూ అంటారు. అప్పుడు తులసి ఆ బోర్డు తలగిస్తుంది. తర్వాత గేట్ తీసుకొని లోపలికి వెళ్తూ సంతోష పడుతూ ఉంటారు. అందరు కూడా లోపలికి వస్తూ ప్రతి ప్లేస్ ను చూస్తూ సంతోషంతో తేలిపోతూ ఉంటారు. ఇక ముఖ్య ద్వారం దగ్గరికి వచ్చి డోర్ ఓపెన్ చేస్తుంది. ఇక అందరూ తులసిని పూలతో ఆహ్వానిస్తూ ఉంటారు. తర్వాత పద్మనాబం స్వీట్స్ తీసుకువచ్చి అందరికీ తినిపిస్తూ ఉంటాడు.

అందరూ స్వీట్స్ తిని డైనింగ్ టేబుల్ మీద కూర్చొని అన్ని జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఉంటుంది. అలా ఒక్కొక్క ప్లేస్ కి వెళ్లి ఒక జ్ఞాపకాన్ని తులసి గుర్తు చేసుకుంటూ ఉంటుంది. అప్పుడు తులసి పద్మనాదం దగ్గరికి వెళ్లి గతం గుర్తుకొస్తుంది. మావయ్య అని అనగానే పద్మనాభం కాలం వెనక్కి వెళ్తే బాగుంటుందనిపిస్తుందా అమ్మ అని అనగానే ఎంత వెనక్కి వెళ్ళినా ఇక్కడికే వచ్చి ఆగుతుంది మామయ్య అని సంతోష పడుతూ ఉంటుంది. తులసి ఇప్పుడు ఇంత ఖర్చు పెట్టి ఈ గిఫ్ట్ నాకెందుకు ఇవ్వాలనుకున్నారు అని అంటుంది. ఇక రేపటి ఎపిసోడ్లో పూజ చేసి హారతి తీసుకొచ్చి అందర్నీ తీసుకోమని అందర్నీ అడుగుతూ ఉండగా.. సామ్రాట్ వచ్చి హారతి తీసుకొని ఈ ఇంట్లో మొదటి హారతి నేను తీసుకున్నందుకు సంతోషపడుతున్న అంటాడు. అప్పుడు లాస్య, నందు గొడవ సృష్టిస్తూ ఉంటారు. ఇక తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే రేపటి ఎపిసోడ్ లో చూడాల్సిందే..

Advertisement