Intinti Gruhalakshmi 21 Oct Today Episode : తులసి ని, సామ్రాట్ ని నానా మాటలు అంటున్న లాస్య… సామ్రాట్ పక్కనే ఉంటా అంటున్న తులసి

Advertisement

Intinti Gruhalakshmi 21 Oct Today Episode : బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్ ఇంటింటి గృహలక్ష్మి. ఈ సీరియల్ ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ ఈరోజు తాజాగా రిలీజ్ అయింది. ఈరోజు ఎపిసోడ్ 769 హైలెట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం… పద్మనాభం ఇచ్చిన ఇంట్లో సంతోషంగా జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ ఉంటూ.. పద్మనాభం దగ్గరికి వెళ్లి ఇప్పుడు నాకు ఈ ఇల్లు గిఫ్ట్ గా ఇవ్వాల్సిన అవసరం ఏముంది మావయ్య అని అడుగుతుంది. అప్పుడు పద్మనాభం ఆ ఇంట్లో రోజురోజుకి మనుషుల మధ్య దూరాలు పెరిగిపోతున్నాయి. ఒక్కొక్కలి ఆలోచన ఒక్కొక్క లాగా ఉంటుంది. ఏమో ఆ ఇంట్లో ఉంటే ప్రశాంతత అనిపించడం లేదు ఈ ఇంటికి వస్తే సంతోషంగా ఉంటామని నీ సంతోషం కోసం ఇలా చేశాను అని చెప్తూ ఉంటాడు. ఇక సామాన్లు కూడా ప్యాక్ చేయమని చెప్పాను అని చెప్తూ ఉండగా దివ్య వచ్చి సామాన్లు ప్యాకింగ్ కూడా అయిపోయిందా తాతయ్య అని సరదాగా మాట్లాడుకుంటూ ఉంటుంది.

Advertisement

అంతలో శృతి, అంకిత కూడా వచ్చి ఈ మధ్య తాతయ్య ఫాస్ట్ గా నిర్ణయాలు తీసుకొని అందర్నీ సర్ప్రైజ్ చేస్తున్నాడు అని అలా సరదాగా అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అంతలో పద్మనాభం అభి, ప్రేమ్ ని పిలిచి ఇంటి సామాన్లు వస్తున్నాయి దగ్గరుండి చూసుకోండి అని చెప్తూ ఉంటాడు. అప్పుడు వాళ్ళు సరే అని చెప్తారు తులసి ఇంటిని చూస్తూ సంతోషంతో పొంగిపోతూ ఉంటుంది. కట్ చేస్తే నందు జాబ్ చర్చ్ చేసుకుంటూ ఉంటాడు. అంతలో భాగ్య వచ్చి మీకేమో ఉద్యోగాలు ఊడిపోతున్నాయి. అక్కడేమో ఒకదానికొకటి రోజుకి కొత్తగా వచ్చి పడుతున్నాయి. ఏదైనా రాసిపెట్టి ఉండాలి అనుకుంటూ తులసి గృహప్రవేశం చేస్తుంది. మావయ్య గారు తులసి కి గిఫ్ట్ గా ఇచ్చాడంట అని చెప్పి చెప్తూ ఉంటుంది. అప్పుడు లాస్య మెడికల్ షాపులో అప్పు పెట్టే మావయ్య అలా ఎలా చేస్తాడో నేను నమ్మను అని అంటూ ఉంటుంది. అప్పుడు భాగ్య ఆ ఇల్లు దగ్గర తీసిన వీడియోని తీసి అది చూపిస్తుంది.

Advertisement
intinti gruhalakshmi 21 october 2022 full episode
intinti gruhalakshmi 21 october 2022 full episode

అప్పుడు లాస్య నందు నువ్వు ఇంటికి పెద్ద కొడుకువి నిన్ను పిలవకుండా ఎలా చేసుకున్నారు అని వాళ్లపై మాటలు ఎక్కిస్తూ ఉంటుంది. అప్పుడు నందు తులసి గృహప్రవేశం చేసింది తులసి మనల్ని పిలవాల్సిన అవసరమేముంది అని మంచిగా మాట్లాడుతూ ఉంటాడు. కానీ భాగ్య ముగ్గురు కొడుకులు ఉన్నారు. వాళ్లను వదిలేసి నువ్వు వదిలేసిన తులసికి గిఫ్ట్ గా ఇవ్వడం ఏంటి అని వాళ్లపై నిందలు వేస్తూ ఉంటారు. లాస్య భాగ్య కలిసి కూడగట్టుకుని ఆస్తి విషయాలు బయటకు రాబట్టాలి అని అక్కడికి వెళ్దామని అంటూ ఉంటారు. దానికి నందు ఒప్పుకో పోయేసరికి ఇద్దరు కలిసి తనను ఒప్పిస్తారు. కట్ చేస్తే తులసి పూజ చేసి అందరికీ హారతి ఇవ్వడానికి వస్తూ ఉండగా.. సామ్రాట్ అక్కడికి వచ్చి హారతి తీసుకొని మొదటి హారతి మీ ఇంట్లో తీసుకున్న వాడిని నేను అయినందుకు నా అదృష్టమని భావిస్తున్నాను అని అంటాడు. అప్పుడు తులసి ఆశ్చర్యంగా మేము ఇక్కడ ఉన్నామని మీకు ఎలా తెలుసు అని అనగానే.. పద్మనాభం మనం ఇక్కడున్నామంటే ఆయనే కారణం అని తన గురించి అంతా చెబుతూ ఉండగా..

అంతలో భాగ్య ,లాస్య ,నందు అక్కడికి వచ్చి చప్పట్లు కొట్టుకుంటూ ఎంత గొప్ప మనసు ,ఇంత దయాకరుడు ముచ్చటేస్తుంది సామ్రాట్ అని అంటూ.. ఏంటి సామ్రాట్ అని ఏకవచనంతో పిలిచినందుకు బాధగా ఉందా… గౌరవం నువ్వే పోగొట్టుకున్నావు నేనేం చెయ్యను చెప్పు అని ఎటకారంగా అంటూ ఉంటుంది. అప్పుడు తులసి మా ఇంటికి వచ్చి మా అతిథి పై ఇలా మాట్లాడడం ఏం బాగాలేదు అని అంటూ ఉంటుంది. అప్పుడు తులసి ఇంట్లోకి వచ్చినప్పుడు అతిధి.. బయటికి వచ్చినప్పుడు ఏమో ఫ్రెండ్ అని ఇలా రకరకాల పేర్లతో బలే పెట్టుకున్నవు తులసి అని సామ్రాట్ ని నాన మాటలంటూ ఉంటుంది. అప్పుడు పద్మనాభం లాస్యని నోరు మూసుకుంటావా అని అనగానే భాగ్యం గృహప్రవేశం చేసి మమ్మల్ని పిలవకుండా ఉంటే మాకు కోపం రాకుండా ఉంటుందా అయినా మేము మీ ఇంటి కోడలుమే కాదా అని అంటూ ఉంటుంది. అప్పుడు లాస్య తులసి పైనే మీకు ఎందుకు అంత ఆపేక్ష అయినా నువ్వైనా చెప్పొచ్చు కదా బయట అందరికీ జ్ఞానోదయం చేస్తావు.. ఇంట్లో ఆదరణంగా ఉంటావు ఇంతలోనే ఎందుకు స్వార్థం అని లాస్య అంటుంది. అప్పుడు ప్రేమ్ మీరు ఏదైనా అడగాలి అంటే తాతయ్యని అడగండి అమ్మని కాదు అని అంటాడు. అప్పుడు భాగ్య ప్రేమ్ కూడా తిడుతుంది. అప్పుడు అనసూయని కూడా మీరేం మాట్లాడరేంది అని అడగడంతో అనసూయ నా మాట ఎవరు వింటున్నారు. నన్ను ఇక్కడ లెక్క చేస్తున్నారు .

అని మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు పద్మనాభం నేనెవరితో మాట్లాడను నేను ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు అని అంటాడు. అప్పుడు లాస్య అంతలా మాయ చేసింది మిమ్మల్ని తులసి అని అంటూ అంటుంది. అప్పుడు పద్మనాభం మాయలో పడడానికి నేను నందగోపాల్ని కాదు ఈ ఇంట్లో కష్టాలు వచ్చినప్పుడు అప్పుల బాధతో ఇబ్బంది పడ్డప్పుడు ఎవరు రాలేదే ఇప్పుడు వచ్చి అందరూ భాగాలు అని మాట్లాడుతున్నారు అని అంటూ ఉంటాడు. అప్పుడు భాగ్య మా వాటాలు మాకు ఇవ్వండి అని గట్టిగా మాట్లాడుతుంటుంది. అప్పుడు పద్మనాభం ఈ ఇల్లు నా కష్టార్జితం నా కష్టాన్ని తీసుకొచ్చి నేను తులసికి ఇచ్చాను దీనికి అడిగే హక్కు ఎవరికీ లేదు అని అంటూ ఉంటాడు. అప్పుడు భాగ్యలక్ష్మి చట్ట ప్రకారం తులసక్కకి ఇల్లు ఇచ్చే హక్కు లేదు అని అంటూ ఉంటుంది. అప్పుడు సామ్రాట్ చట్టం ఏం చెప్తుందో ఒకసారి తెలియజేస్తాను అని అంటుండగా.. లాస్య ఇది ఆఫీస్ కాదు సామ్రాట్ నువ్వు చెప్తే మేము వినడానికి అని అంటుంది. అప్పుడు నందు కూడా మా ఫ్యామిలీ విషయాలు మీరు ఎందుకు తలదురుస్తున్నారు అని అంటాడు. అప్పుడు పద్మనాభం నీకు హక్కు ఉందో లేదో తెలియదు కానీ తనకి మాత్రమే హక్కు ఉంది. అని చెప్తాడు. ఇక అప్పుడు లాస్య సామ్రాట్ ని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుంటుంది.

అప్పుడు తులసి లాస్య ను తిడుతూ ఉంటుంది. అప్పుడు లాస్య తులసి మీద ఉన్న ఇష్టాన్ని ఇలా గిప్ట్ల రూపంలో ఇస్తున్నావా అని నింద వేస్తూ ఉంటుంది. అప్పుడు తులసి లాస్య అని గట్టిగా అంటూ ఉంటుంది. కానీ లాస్య ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు సామ్రాట్ కూడా ఉక్రోషంతో నిందలు వేస్తున్నావు లాస్య అని అంటాడు. అయినా నందు కూడా ఉన్నదే కదా అనేది అంటూ ఉంటాడు. ఇక రేపటి ఎపిసోడ్లో సామ్రాట్ తులసిని తీసుకెళ్లడానికి ఇంటికి వచ్చి బయట వెయిట్ చేస్తూ ఉంటాడు. తులసి మాత్రం అందరి ముందు నా ఫ్రెండ్ సామ్రాట్ నాకోసం వచ్చాడు. తనతో ఒకటే కారులో పక్క పక్కన కూర్చుని వరంగల్ వెళుతున్నాను అని చెప్తూ ఉంటుంది. లాస్య ఇంట్లోకి రాకుండా అలాగే ఆగిపోయాడు ఏంటి అంటూ ఉంటుంది. నందు మాత్రం ఇవాళ రాష్ట్రాలు తిరుగుతున్నారు. రేపు దేశాలు తిరుగుతారు అని అంటూ ఉంటాడు. అప్పుడు అనసూయ ఇన్ని మాటలు పడి వెళ్లాల్సిన అవసరం ఏంటమ్మా ఆగిపోవచ్చుగా అని అంటూ ఉంటుంది. ఇక తర్వాతే ఏం జరిగిందో తెలియాలంటే రేపటి ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే.

Advertisement