Intinti Gruhalakshmi 22 Oct Today Episode : తులసి ఇచ్చిన ట్విస్ట్ కి దిమ్మరిపోతున్న నందు, లాస్య… సంతోషంతో పొంగిపోతున్న పరంధామయ్య…

Advertisement

Intinti Gruhalakshmi 22 Oct Today Episode : బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్ ఇంటింటి గృహలక్ష్మి. ఈ సీరియల్ ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ ఈరోజు తాజాగా రిలీజ్ అయింది. ఈరోజు ఎపిసోడ్ 770 హైలెట్సె ఏంటో ఇప్పుడు మనం చూద్దాం… నందగోపాల్ మన ఫ్యామిలీలో సామ్రాట్ ని ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నావ్ తనని బయటికి వెళ్ళమను మనం మాట్లాడుకుందాం. అని తులిసితో అంటాడు. అప్పుడు సామ్రాట్ వెళ్ళిపోతూ ఉండగా… తులసి సామ్రాట్ ని ఆపి మీరు నా ఫ్రెండ్.. నేను చెప్తేనే మీరు వెళ్ళాలి. ఒకవేళ మీరు వెళ్తే నన్ను అవమానించినట్లే అని అంటుంది. అప్పుడు నందు మీ కోడలు ప్రవర్తన చూశారు కదా.. ఇల్లు చేతికిచ్చి నెత్తిన పెట్టుకున్నారు అని అంటూ ఉంటాడు. అప్పుడు నందు వెళ్ళిపోతూ ఉండగా.. అనసూయ ఆపి నీకు ఎవరు సపోర్ట్ గా ఈ ఇంట్లో ఉండట్లేదు నేను ఎవరెవరు ఎవరికో ఫ్రెండ్స్ వచ్చి పోతుంటే.. నువ్వు ఇంటికి రావడానికి ఏముంది.

Advertisement

ఇంట్లో వాటా ఇవ్వకపోయినా పర్లేదు..కానీ నీకు గౌరవం ఇవ్వాలి అని అంటూ ఉంటుంది. అప్పుడు తులసి మీ అబ్బాయిని ఇంటికి రావద్దని ఎప్పుడు అనలేదు గౌరవం ఎప్పుడు నేను ఇస్తున్నాను అది నిలబెట్టుకోవడం లేదు… నా ఫ్రెండ్ వస్తాడు. రేపు తను నేను వరంగల్ వెళుతున్నాం పక్క పక్కన కూర్చొని అందరికీ తెలిసేలా… మీ కొడుకు ఇదే డ్రామాలు ఏమైనా మళ్లీ స్టార్ట్ చేస్తాడేమో… మీకు చెప్పడానికి విసుకు రావడంలేదు ఏమో గాని.. నాకు మాత్రం తలనొప్పిగా ఉంది. అంటూ నందుకి అదిరిపోయే ట్విస్ట్ ఇస్తుంది. అప్పుడు పరంధామయ్య తెగ సంతోషంతో వాయిస్ మెసేజ్ ఐడియా బాగుంది అని మాట్లాడుతూ అంటూ ఉంటాడు. కట్ చేస్తే అనసూయ మౌనంగా ఉండడంతో పరంధామయ్య వచ్చి నాతో మాట్లాడవా ఈ వయసులో ఇలా ఉండడం అవసరమా మంచిగా ఉన్నప్పుడు నువ్వు మాట్లాడకపోతే రేపు నువ్వు మాట్లాడడానికి నేను ఉంటానో లేదో తెలియదు అని అంటాడు. అప్పుడు అనసూయ నా కోపం మీ మీద కాదు…

Advertisement
intinti gruhalakshmi 22 october 2022 full episode
intinti gruhalakshmi 22 october 2022 full episode

చెప్పిన మాట వినకుండా అలా చేస్తున్న తులసి మీద అని తులసిని అంటూ ఉంటుంది. అప్పుడు పరంధామయ్య అనసూయ కి అర్థమయ్యేలా చెప్తూ ఉంటాడు. తులసి ఇంట్లో బట్టలు సర్దుతూ ఉంటుంది. అంకితతో సరదాగా మాట్లాడుకుంటూ అన్ని పనులు చేస్తూ ఉంటుంది అంతలో సామ్రాట్ తులసికి ఫోన్ చేసి… సారీ తులసి గారు మీ ఇంటికి నేను వచ్చినప్పుడల్లా గొడవలు జరుగుతున్నాయి. అనగానే తులసి గొడవలు జరుగుతుంది. మీ వల్ల కాదు… నావల్ల అయిన ఈ ఇంట్లో గొడవలు కి మీరు కూడా అలవాటు కావాలి అని చెప్తూ ఉంటుంది. అప్పుడు సామ్రాట్ సరే నేర్చుకుంటాను అని చెప్తాడు. తర్వాత సరదాగా మాట్లాడుకుంటూ వరంగల్ కి తీసుకెళ్లాల్సిన ఫైల్స్ అన్ని రెడీగా పెట్టుకున్నారా అని అడుగుతుంటాడు. అప్పుడు అన్ని పెట్టుకున్నాను సామ్రాట్ గారు అని చెప్తుంది. సామ్రాట్ వాళ్ల బాబాయి వచ్చి కొద్దిసేపు తనని ఆట పట్టించి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే నందు బయటికి వెళుతుండగా.. లాస్య వెళ్లనివ్వకుండా అడ్డుపడుతూ మీ ఇంటికెళ్దాం మీ అమ్మగారు సపోర్టు ఉంది కదా అన్ని విషయాలు మాట్లాడదాం..

మన ఇంటికి వచ్చి ఉండు అని అనేలా చేద్దాం అని చెప్తూ ఉంటుంది. అప్పుడు దానికి నందు అస్సలు ఒప్పుకోడు. లాస్య ఒప్పుకునేలా చేస్తుంది.తులసిని చుక్కలు చూపించాలి అని లాస్య అనుకుంటూ ఉంటుంది. కట్ చేస్తే తులసి రెడీ అవుతూ ఉంటుంది. అప్పుడు అప్పుడు అనసూయ తనని చూసి ఈరోజు స్పెషల్ గా రెడీ అవుతుందేంటి కొత్త చీరనుకుంటా అంటూ ఉంటుంది. అందులో అక్కడికి తులసి రాగానే శృతి వచ్చి ఆంటీ పక్కన రామప్ప గుడి ఉంటుంది. అక్కడికి వెళ్లి రండి అని చెప్తూ ఉంటుంది. అప్పుడు అనసూయ ఇంకో పక్కన ఇంకో దేవుడు కూడా ఉండు అక్కడికి వెళ్ళినా పుణ్యం వస్తుంది. నిన్ను ఎవరు ఇయామన్నారు. సలహాలు అని శృతిని తిడుతుంది. తులసిని అనసూయ ఇప్పుడు రోజులు మారిపోయాయి అత్తగారి మాటంటే లెక్కలేదు అని అంటూ ఉంటుంది. అప్పుడు పరంధామయ్య సామ్రాట్ వస్తున్నాడంట. వచ్చాక టీ ఇవ్వమ్మా అని చెప్తూ ఉంటాడు. అప్పుడు అనసూయ కోపంగా పాలు విరిగిపోయాయి అని అంటూ ఉంటుంది.

అలా కొద్దిసేపు అనసూయని అందరు కలిసి ఆటపట్టిస్తూ ఉంటారు. అంతలో లాస్య నందు వచ్చి అందర్నీ బయట తీసుకెళ్లాలి అని అంటూ ఉంటారు. కానీ మేము రాము అని చెప్తూ ఉంటారు. అప్పుడు లాస్య ఇంట్లోనే క్యారం బోర్డు ఆడదాం అని చెప్తూ ఉంటూ ఉంటుంది. కానీ ఫ్రేమ్ లాస్యకి మధ్యలో చురక వేస్తూ ఉంటాడు. లాస్య మాత్రం తులసిని కొత్త చీర ఎప్పుడు కొన్నావు ఎవరి కొనిచ్చారు అని ఎటకారంగా మాట్లాడుతుంది. అప్పుడు తులసి ఒకప్పుడు మా ఆయన కొన్నారు అది ఇప్పుడు కట్టుకోవాల్సి వచ్చింది అని తను కూడా ఎటకారంగా మాట్లాడుతుంది. ఇక రేపటి ఎపిసోడ్లు సామ్రాట్ తులసి వస్తుండగా తుఫాను వస్తూ ఉంటుంది. వాళ్లు కారులో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇక్కడ ఇంట్లో వాళ్లకోసం కంగారు పడుతూ ఉంటారు. కానీ నందు తులసి పై ఎన్నో మాటలు చెబుతూ ఉంటాడు. ఇక తర్వాతే ఏం జరిగిందో తెలియాలంటే రేపటి ఎపిసోడ్లో తెలుసుకోవాల్సిందే…

Advertisement