Intinti Gruhalakshmi 29 Sep Today Episode : తులసి పై మండిపడుతున్న అనసూయ… జాబ్ మానేయను అని చెప్తున్నా తులసి…

Advertisement

Intinti Gruhalakshmi 29 Sep Today Episode : బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్ ఇంటింటి గృహలక్ష్మి. ఈ సీరియల్ ప్రేక్షకులని బాగా ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ ఈరోజు తాజాగా రిలీజ్ అయింది. ఈరోజు ఎపిసోడ్ 750 హైలెట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం… నిన్ను జాబ్ చేయొద్దు అని చెప్పేది నువ్వెక్కడ చిక్కుల్లో పడిపోతావు. నువ్వు ఎక్కడ ఎవరికి కింద తలవంచుకోవాల్సి వస్తుందో అని నా బాధను అంతేగాని నీ మీద ప్రేమ లేక కాదు మామ్ నీ మీద కోపం కాదు.. మామ్ నిజంగా చెప్తున్న మామ్ అని ఏడుస్తూ ఐ లవ్ యు మామ్ ఐ లవ్ యు నీ మీద ఒట్టు ఇదంతా నిజం అని అభి వాళ్ళ అమ్మకి చెప్తాడు. అప్పుడు తులసి మీ అమ్మ ఎప్పుడు తల వంపులు వచ్చే పని చేయదు.. మీ నుంచి మాట తెచ్చుకుంటే ఆరోజు నేను మీకు ఎవ్వరికీ కనిపించని ఇది నిజం అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే సామ్రాట్ ఎందుకు బాబాయ్ ఒకటి అనుకుంటే ఒకటి జరుగుతుంది అని అంటుండగా… అప్పుడు సామ్రాట్ వాళ్ల బాబాయ్ నువ్వు వద్దన్నా ఫ్రెష్ వాళ్ళని పిలిచావు.. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటే వెళ్ళిపోయారు. అప్పుడు సామ్రాట్ నేను ఆలోచిస్తున్నది నా గురించి కాదు బాబాయ్.. తులసి గారి గురించి..

Advertisement

గుట్టుగా బ్రతుకుతున్న వాళ్ళ జీవితంలోకి ఇలాంటివన్నీ చిరాకే కదా.. అసలు చిన్న విషయానికి గొడవ చేస్తున్నాడు.ఇంకా ఈ విషయం చూస్తే ఇంకేం చేస్తాడో.. అని అంటుండగా వాళ్ల బాబాయ్ ఎందుకు ఊరుకుంటాడు చేయాల్సిన రచ్చంత చేస్తాడు. అయితే తులసి నేను ఎవరి మాటలు పట్టించుకోను అనే కుండబద్దలు కొట్టింది కదా… తులసి ఇంట్లో వాళ్ళ ఆమె స్వేచ్ఛకి అడ్డుపడరు.. ఒకవేళ అడ్డుపడిన వాళ్ళని ఒప్పించి ముందుకు నడిచే ధైర్యం తులసికి ఉంది.. తులసి గారి ఇంట్లో ఏం జరుగుతుందో ఏంటో అని కంగారు పడుతున్న అని సామ్రాట్ అంటాడు. కట్ చేస్తే అభి తులసి అన్నమాట గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటారు.. అంతలో అంకిత వచ్చి సారీ అభి నేను అర్థం చేసుకోలేకపోయాం అని అంటూ ఉంటుంది. అప్పుడు అభి నన్ను ఎందుకు అర్థం చేసుకుంటారు.. అందరూ నన్ను ఒంటరి వాన్ని చేసి వదిలేస్తున్నారు.. అని అంటాడు. అప్పుడు సరే నా మీద కోపం ఉంటే సరే కానీ అన్నం తిను అని బ్రతిమిలాడుతూ ఉంటుంది. అప్పుడు అభి కూల్ అవుతాడు. అంకిత భోజనం తినిపిస్తుంటే తింటూ ఉంటాడు. కట్ చేస్తే అనసూయ బయట కూరగాయలు కొంటూ ఉండగా అమ్మలక్కలు తులసి గురించి చెడుగా మాట్లాడుతూ ఉంటారు..

Advertisement
intinti gruhalakshmi 29 september 2022 full episode 
intinti gruhalakshmi 29 september 2022 full episode

అమ్మలక్కలు అందరూ తులసి అలా ఊరు మీద వదిలేసారేంటి అంత చండాలంగా మాట్లాడుతుందేంటి ఏది వదులుకున్న సామ్రాట్ ను వదులు అని అంటుంది ఇదేం పోయేకాలం అంటూ అనసూయక కోపం వచ్చేలా మాట్లాడుతుంటారు. ఇక కోపంతో అనసూయ అక్కడినుంచి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే తులసి కి సామ్రాట్ ఫోన్ చేస్తాడు. మాట్లాడుతూ ఉండగా గుడ్ మార్నింగ్ సామ్రాట్ గారు అని అంటూ ఉంటుంది. అప్పుడు నిజంగానే గుడ్ మార్నింగ్ చెప్తున్నారా.. అని అంటాడు. అప్పుడు నిజంగానే చెప్తున్నాను అండి అంటే మీరు ప్రెస్ మాట్లాడిన మాటలకి మా ఇంట్లో ఏదైనా జరిగిందని ఆలోచించుకుంటున్నారా అని అంటుంది తులసి. అప్పుడు సామ్రాట్ మీరు సూపర్ అండి మీ వాళ్ళు ఆఫీస్ కి రావద్దని అడ్డుపడుతున్నారా అని అడగగా… ఆగిపొమ్మంటారా మరి అని అంటుంది. అప్పుడు సామ్రాట్ అయ్యో అలా కాదండి.. అని అనగానే మా వాళ్లు ఎవరికీ నా మీద కోపం లేదండి అంటుంది.. అప్పుడు సామ్రాట్ నావల్ల మీరు ఇబ్బంది పడుతున్నారు అండి అని అంటాడు. అప్పుడు తులసి నాకు ఇబ్బంది అనిపించిన రోజు నా నిర్ణయం నేనే తీసుకుంటాను..

ఇక నేను ఆఫీస్ కి బయలుదేరాను అని చెప్తుంది.. అప్పుడు సామ్రాట్ ఒక విషయం తులసి గారు మీ హనీ బర్త్డే రేపు మీ ఇంట్లో వాళ్లందర్నీ తీసుకుని రండి అని చెప్తాడు.. కట్ చేస్తే అనసూయ ఇంట్లో కొచ్చి అమలక్కలు అన్న మాటలను ఇంట్లోకి వచ్చి ఆగ్రహం చెందుతూ ఉంటుంది. అప్పుడు అందరూ వచ్చి ఏమైంది బామ్మ ఎందుకు అలా కోప్పడుతున్నావ్ అని అంటారు.. అప్పుడు అనసూయ తులసి వలన ఈ వీధికి చెడ్డపేరు వస్తుందంట.. తెలిసిన చూసి అందరూ చెడిపోతారంట అని వాళ్ళ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు… అని అంటుంది. అప్పుడు అభి నేను చెప్తూనే ఉన్నాను కదా నాయనమ్మ ఇంకా ఇది ముదిరిపోద్ది నాయనమ్మ అని అభి అంటాడు.. అప్పుడు ప్రేమ్ ఎవడు ఏదో కూచాడని మామ్ చేతులు కట్టేస్తామా అని అంటాడు… ఇంకా అప్పుడు అనసూయ ఇక తులసికి ఆఫీస్ కి వెళ్లొద్దు సామ్రాట్ తో పని చేయొద్దని చెప్తాను అని నిర్ణయం తీసుకుంటుంది. అప్పుడు ప్రేమ్ మొన్నటిదాకా అభి నువ్వు అత్తగారింట్లో ఉన్నాం.. నేను తాడు బొంగరం లేకుండా ఉన్నాను.. అప్పుడు ఈ ఇల్లు గడవడానికి ఎవరు కారకులు అది తెలుసుకోండి అని ప్రేమ్ అంటూ ఉంటాడు.. ఇక అందరూ తులసిని పిలిచి మాట్లాడాలి అని అనుకుంటూ ఉంటారు. ఇక అప్పుడు తులసి అక్కడికి వస్తుంది.

అప్పుడు తులసి వచ్చి అందరిని చూసి ఏంటి అందరూ సీరియస్ గా ఉన్నారు అని అడుగుతుంది. అప్పుడు అంకిత ఏం లేదు ఆంటీ బామ్మ కి కాళ్ల నొప్పులు ఎక్కువయ్యాయి అంట.. అని మాట దాటేస్తూ ఉంటారు. అప్పుడు సరే ఆఫీస్ కి వెళ్తున్నాను అని చెప్తూ ఉంటుంది.. తులసి అప్పుడు రేపు హాని పుట్టినరోజు అంట మనందరినీ రమ్మన్నారు అని అనగానే.. అనసూయ మన హనీ ఏంది నువ్వు 9 నెలలు మోసి కన్నట్లు.. అని తులసి పై కోప్పడుతూ ఉంటుంది. ఇక అప్పుడు తులసి అత్తయ్య గారు ఏదో కోపంలో ఉన్నారు అని అంటుంది. అప్పుడు గోవర్ధన్ అదేం లేదులేమ్మా నువ్వు వెళ్ళు అని చెప్తాడు. కట్ చేస్తే ఆఫీసులో తులసి హోదా చూసి లాస్య కుళ్ళుకుంటూ ఉంటుంది. అంతలో నందు వచ్చి ఏం చేస్తున్నావ్ లాస్య అని అంటుండగా.. తులసిని చూపించి ఆమె హుందాతనం చూడు అని చూపిస్తూ ఉంటుంది. ఇక రేపటి ఎపిసోడ్లో కావాలని లాస్యం సామ్రాట్ వెరిఫై చేయని ఫైల్ ను తన దగ్గర పెట్టి తన్ సైన్ చేసేలా చేసి తులసిని సామ్రాట్ తిట్టేలా చేస్తూ ఉంటుంది. అప్పుడు సామ్రాట్ తులసిని చూసుకోకుండా అలా ఎలా చేస్తావని తిడుతూ ఉంటాడు. ఇక తర్వాతే ఏం జరిగిందో తెలియాలంటే రేపటి ఎపిసోడ్లో చూడాల్సిందే..

Advertisement